By: ABP Desam | Updated at : 29 Aug 2021 07:10 AM (IST)
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు (ప్రతీకాత్మక చిత్రం)
దేశంలో ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు గత నెల రోజులుగా స్థిరంగానే కొనసాగుతున్నాయి. డీజిల్ ధరల విషయంలో కూడా స్థిరత్వమే కొనసాగుతోంది. కానీ, హైదరాబాద్‌లో మాత్రం నాలుగు రోజుల క్రితం హెచ్చుతగ్గులు కనిపించగా.. మళ్లీ అప్పటి నుంచి ఇంధన ధరలు స్థిరంగానే ఉంటున్నాయి. నేడు (ఆగస్టు 29న) ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో ఆగస్టు 29న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.105.54 కాగా.. డీజిల్ ధర రూ.96.99 గా ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.30 పైసలు పెరిగి రూ.105.72గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.28 పైసలు పెరిగి రూ.97.15 వద్ద ఉంది.
ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.105.06 కాగా.. డీజిల్ ధర రూ.96.53 గా స్థిరంగానే ఉంటూ వస్తోంది. వరంగల్‌లో మూడు రోజులుగా ఇవే ధరలు నిలకడగా ఉంటున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.0.02 పైసలు పెరిగింది. తాజాగా ధర రూ.107.01 గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.0.02 పైసలు పెరిగి.. ప్రస్తుత ధర రూ.98.35గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో కాస్త ఎక్కువగానే హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర రూ.0.34 పైసలు తగ్గి.. ప్రస్తుతం రూ.107.63 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.32 పైసలు తగ్గి రూ.98.56కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో గత పది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి.
విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.107.12గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఏకంగా రూ.0.63 పైసలు పెరిగింది. డీజిల్ ధర కూడా విశాఖపట్నంలో రూ.0.58 పైసలు పెరిగి రూ.98.06గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలు సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉండగా.. తాజాగా స్వల్పంగా ఉంటున్నాయి.
తిరుపతిలో భారీగా పెరిగిన ధర
తిరుపతిలో ఇంధన ధరల్లో కాస్త పెరుగుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర రూ.1.25 పెరిగి ప్రస్తుతం రూ.109.57 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇక డీజిల్ ధర రూ.1.17 పెరిగి రూ.100.34గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఆగస్టు 28 నాటి ధరల ప్రకారం 68.74 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Cryptocurrency Prices Today: క్రిప్టో క్రేజ్! బిట్‌కాయిన్ సహా మేజర్ క్రిప్టోలన్నీ లాభాల్లోనే!
Stock Market News: మంగళకరం! ఒక్క సెషన్లోనే రూ.7 లక్షల కోట్లు పోగేసిన ఇన్వెస్టర్లు!
PIB Fact Check: రూ.12,500 కడితే రూ.4.62 కోట్లు ఇస్తున్న ఆర్బీఐ! పూర్తి వివరాలు ఇవీ!
Elon Musk Twitter Deal: మస్క్ మామా మజాకా! ట్విట్టర్ డీల్‌కు మస్కా కొట్టాడుగా!
Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!
MI vs SRH: లక్కు హిట్‌మ్యాన్ వైపే! టాస్ ఓడిన కేన్ మామ!
Gyanvapi Mosque Case: 'జ్ఞానవాపి మసీదు' కేసులో సుప్రీం కీలక ఆదేశాలు- కమిషనర్ తొలగింపు
O2 Movie Telugu Teaser: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!
R Krishnaiah Thanks YS Jagan: ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు, కానీ వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చారు : ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు