Petrol-Diesel Price, 24 December: వాహనదారులకు కాస్త ఊరట! ఇంధన ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ ప్రాంతాల్లో మాత్రం స్థిరంగా..

విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు స్వల్పంగా తగ్గింది. లీటరు ధర ప్రస్తుతం రూ.0.06 పైసలు తగ్గి రూ.110.29 గా ఉంది. డీజిల్ ధర రూ.0.08 పైసలు తగ్గి రూ.96.36గా ఉంది.

FOLLOW US: 

గత రెండు నెలల క్రితం వరకూ ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా ఎగబాకుతూ వచ్చి జీవితకాల గరిష్ఠాన్ని చేరాయి. కానీ, కొద్ది రోజుల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో..
హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత కొద్ది రోజులుగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్‌లో కూడా నేడు (డిసెంబరు 24)  పెట్రోల్ ధర రూ.107.69 గా స్థిరంగానే కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.94.14 గానే ఉంటోంది. కొద్ది రోజులుగా వరంగల్‌లో ఈ ధరలే ఉంటున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్‌లో ఇంధన ధరలు నేడు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.24 పైసలు పెరిగి రూ.109.93 గా ఉంది. డీజిల్ ధర రూ.0.22 పైసలు పెరిగి రూ.96.23 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Also Read: Card Tokenization: డెబిట్‌, క్రెడిట్‌ కార్డు టోకెనైజేషన్‌ గడువు పొడగించాలని ఆర్‌బీఐకి వినతి

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు స్వల్పంగా తగ్గింది. లీటరు ధర ప్రస్తుతం రూ.0.06 పైసలు తగ్గి రూ.110.29 గా ఉంది. డీజిల్ ధర రూ.0.08 పైసలు తగ్గి రూ.96.36గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.

విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.05గా ఉంది. పాత ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.70 పైసలు తగ్గింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.18 గా ఉంది. ఇది రూ.0.65 పైసలు తగ్గింది.

తిరుపతిలో ఇలా..
తిరుపతిలోనూ ఇంధన ధరలు నేడు తగ్గాయి. లీటరుకు రూ.0.60 పైసలు తగ్గి పెట్రోలు ధర ప్రస్తుతం రూ.110.58 కి చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర రూ.0.56 పైసలు తగ్గి రూ.96.60 కి చేరింది.

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా డిసెంబరు 24 నాటి ధరల ప్రకారం 73.79 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.

Also Read: 83 Movie Review - '83' మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?

Also Read: Snapdeal IPO: ఐపీవోకు స్నాప్‌డీల్‌.. రూ.1250 కోట్ల సమీకరణకు ముసాయిదా దాఖలు

Also Read: Tesla Smartphone: క్రేజీ ఎలన్‌ మస్క్‌! టెస్లా నుంచి మొబైల్‌ ఫోన్‌.. ఫీచర్లు ఇవే!!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 24 Dec 2021 07:27 AM (IST) Tags: Petrol Price Diesel Price Fuel Cost Petrol Diesel Price Today Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 29 May: నేడు చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం - ఈ నగరాల్లో స్థిరంగా

Petrol-Diesel Price, 29 May: నేడు చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం - ఈ నగరాల్లో స్థిరంగా

Gold-Silver Price: నేడు నిలకడగా బంగారం ధరలు, వెండి మాత్రం పైపైకి - మీ ప్రాంతంలో ధరలు ఇవీ

Gold-Silver Price: నేడు నిలకడగా బంగారం ధరలు, వెండి మాత్రం పైపైకి - మీ ప్రాంతంలో ధరలు ఇవీ

Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్‌ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం

Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్‌ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం

Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?

Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?

Gas Cylinders Explode: గ్యాస్‌ సిలిండర్‌ పేలితే బీమా పొందడం ఎలా? ఈజీ ప్రాసెస్‌ ఇదే!

Gas Cylinders Explode: గ్యాస్‌ సిలిండర్‌ పేలితే బీమా పొందడం ఎలా? ఈజీ ప్రాసెస్‌ ఇదే!

టాప్ స్టోరీస్

Boy Smoking: KGF 2 రాకీ భాయ్‌లా ట్రై చేసిన స్టూడెంట్, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసిన పేరెంట్స్

Boy Smoking: KGF 2 రాకీ భాయ్‌లా ట్రై చేసిన స్టూడెంట్, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసిన పేరెంట్స్

Weather Updates: నెమ్మదించిన నైరుతి రుతుపవనాలు - హీటెక్కుతోన్న ఏపీ, తెలంగాణ, రెండు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ

Weather Updates: నెమ్మదించిన నైరుతి రుతుపవనాలు - హీటెక్కుతోన్న ఏపీ, తెలంగాణ, రెండు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ

Khammam: కానిస్టేబుల్ దంపతుల పాడుపని! ఏకంగా కోటిన్నర దోచేసిన భార్యాభర్తలు

Khammam: కానిస్టేబుల్ దంపతుల పాడుపని! ఏకంగా కోటిన్నర దోచేసిన భార్యాభర్తలు

Horoscope Today 29th May 2022: ఈ రోజు ఈ రాశివారు మాజీ ప్రియురాలు/ ప్రియుడిని కలుస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 29th May 2022:  ఈ రోజు ఈ రాశివారు మాజీ ప్రియురాలు/ ప్రియుడిని కలుస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి