By: ABP Desam | Updated at : 12 Aug 2021 07:24 AM (IST)
Petrol Price
దేశంలో ముంబయి, చెన్నై, బెంగళూరు సహా అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో గత 20 రోజులుగా ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌లో మాత్రం రెండు రోజుల క్రితం స్వల్ప వ్యత్యాసం కనిపించగా మళ్లీ ఇంధన ధరలు నిలకడగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఇంధన మార్కెట్‌లో రెండు రోజుల క్రితం పెట్రోల్ లీటరుకు రూ.0.15 పైసలు పెరిగింది. డీజిల్ ధర మాత్రం నేడు రూ.0.14 పైసలు చొప్పున తగ్గింది.
తెలంగాణలో ఆగస్టు 12న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.105.83 కాగా.. డీజిల్ ధర రూ.97.96 గా ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర.. ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.27 పైసలు తగ్గి రూ.105.71గా ఉంది. డీజిల్ ధర రూ.0.25 పైసలు తగ్గి రూ.97.83 కు చేరింది.
ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.105.38 కాగా.. డీజిల్ ధర రూ.97.53 గా స్థిరంగానే కొనసాగుతూ ఉంది. కొద్దిరోజులుగా వరంగల్‌లో కూడా మెట్రో నగరాల తరహాలోనే ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవే ఇంధన ధరలు ఉంటున్నాయి.
నిజామాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.0.58 పైసల వరకూ తగ్గింది. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.53 పైసలు తగ్గింది. దీంతో తాజాగా పెట్రోల్ రూ.107.14 గా ఉంది. డీజిల్ ధర రూ.99.17గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో ఇంధన ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పెట్రోల్ ధర రూ.0.27 పైసలు తగ్గి ప్రస్తుతం రూ.107.99 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.28 పైసలు తగ్గి రూ.99.56కు చేరింది.
విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.106.80గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఏకంగా రూ.0.15 పైసలు తగ్గింది. డీజిల్ ధర కూడా విశాఖపట్నంలో రూ.0.14 పైసలు తగ్గి రూ.98.43గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో భారీగా పెరుగుదల
తిరుపతిలో ఇంధన ధరల్లో భారీ మార్పు చోటు చేసుకుంది. పెట్రోల్ లీటరుకు రూ.0.71 పైసలు పెరగగా.. డీజిల్ రూ.0.65 పైసలు ఎగబాకింది. దీంతో తాజాగా లీటరు పెట్రోలు ధర రూ.108.12 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇక డీజిల్ ధర కూడా రూ.0.65 పైసలు పెరిగి.. రూ.99.65గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఆగస్టు 12 నాటి ధరల ప్రకారం 69.25 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను అలాగే ఉంచుతున్నాయి. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Gold-Silver Prices Today: స్థిరంగా పసిడి వెలుగు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Investment In Mutual Funds: కేవలం రూ.250తో SIP స్టార్ట్ చేయొచ్చు, కొత్త ప్లాన్ తీసుకొస్తున్న సెబీ
Petrol - Diesel Rates Today: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Gold-Silver Prices Today: జాబ్స్ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Upcoming Cars on January 2024: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!
Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్
Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ
/body>