అన్వేషించండి

Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇంకా ఎంత పెరుగుతాయి?

Petrol Diesel Price Hike: భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. గత శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు రూ.3 మేర పెరిగిన తర్వాత, మరోసారి ఆయిల్ కంపెనీలు ధరలు పెంచాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు 90 పైసలు పెరిగాయి.
  • హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.111.88, ఢిల్లీలో రూ.98.64 చేరింది.
  • ఆర్థిక నష్టాలను భర్తీ చేయడానికి చమురు కంపెనీలు ధరలు పెంచుతున్నాయి.

Petrol Price Hike News | న్యూఢిల్లీ: వాహనదారులకు వరుస షాకులు తగులుతున్నాయి. 5 రోజుల వ్యవధిలో రెండోసారి భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మంగళవారం నాడు (మే 19న) పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 90 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండవసారి ఇంధన ధరలు పెరగడం వాహనదారులను ఇబ్బంది పెడుతోంది. పశ్చిమాసియా సంక్షోభం, అంతర్జాతీయ చమురు ధరల పెరుగుల గమనిస్తే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరగనున్నాయని అర్థమవుతోంది. ఆయిల్ కంపెనీలు తమ నష్టాలను భర్తీ చేసుకునేందుకు మాత్రమే ధరలు పెంచుతున్నాయని కేంద్రం చెబుతోంది.   

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, హైదరాబాద్‌లో రూ.110.89 ఉన్న లీటర్ పెట్రోల్ ధర మంగళవారం రూ.111.88కి చేరింది దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 97.77 నుంచి రూ. 98.64 కు చేరుకుంది. అలాగే డీజిల్ ధర లీటరుకు రూ. 90.67 నుంచి రూ. 91.58 కి పెరిగింది. గత శుక్రవారం కూడా చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు దాదాపు రూ. 3 చొప్పున పెంచాయి. 

కొత్త ఇంధన ధరలు ఇవే..

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.89 నుంచి రూ.111.88కి చేరింది

ఢిల్లీలో పెట్రోల్ రూ. 98.64, డీజిల్ లీటరుకు రూ. 91.58 కి చేరుకుంది.

ముంబైలో పెట్రోల్ రూ. 107.59, డీజిల్ లీటరుకు రూ. 94.08 అయింది.

కోల్‌కతాలో పెట్రోల్ రూ. 109.70, డీజిల్ లీటరుకు రూ. 96.07 గా నమోదైంది.

చెన్నైలో పెట్రోల్ రూ. 104.49, డీజిల్ లీటరుకు రూ. 96.11 అయింది.

జైపూర్‌లో పెట్రోల్ ధర రూ. 108.84, డీజిల్ ధర లీటరుకు రూ. 94.12 కి చేరుకుంది.

డీజిల్ కొత్త ధరల వివరాలు
హైదరాబాద్‌లో డీజిల్ లీటర్ ధర రూ.98.96 నుంచి రూ.99.95 చేరింది. 

ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 91.58 అయింది. 

కోల్‌కతాలో లీటర్ డీజిల్ ధర రూ. 96.07 కు చేరుకుంది. 

ముంబయిలో లీటర్ డీజిల్ ధర రూ. 94.08 అయింది 

చెన్నైలో లీటర్ డీజిల్ ధర రూ. 96.11కు చేరుకుంది. 

Also Read: Petrol Diesel Price Hike: చమురుపై అగ్ర దేశాలు 50 శాతం వడ్డిస్తే భారత్‌ ప్రభుత్వం రూ.3లతో సరిపెట్టింది! విమర్శించే ముందు తేడా తెలుసుకోండి!

ప్రభుత్వ చమురు కంపెనీలకు నష్టాలు
భారత ప్రభుత్వ చమురు కంపెనీలు గత 4 సంవత్సరాలుగా రిటైల్ ధరలను పెంచలేదు. పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ (ముడిచమురు) ధరలు పెరగడం వల్ల ఈ కంపెనీలకు ప్రతిరోజూ దాదాపు రూ. 1000 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి ధరలను క్రమంగా పెంచుతున్నారు. గతంలో రూ. 3 పెంచిన తర్వాత ఈ నష్టం కొద్దిగా తగ్గి రోజుకు రూ. 750 కోట్లకు చేరుకుంది. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు 90 పైసల చొప్పున వాహనదారులపై బారం పడింది. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌ చమురు సంక్షోభాన్ని బాగానే తట్టుకుని నిలబడింది. పలు దేశాల్లో ఇంధన ధరలు గత రెండు నెలలో 50 నుంచి 100 శాతం మేర పెరిగాయి.

Frequently Asked Questions

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగాయి?

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 90 పైసల చొప్పున పెరిగాయి. వారం రోజుల్లో ఇది రెండవసారి ధరల పెంపు.

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర ఎంతకు చేరింది?

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.89 నుండి రూ.111.88కి చేరింది.

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరిగాయి?

ఇరాన్, అమెరికా సంక్షోభం కారణంగా ముడిచమురు ధరలు పెరగడం వల్ల ప్రభుత్వ చమురు కంపెనీలకు రోజుకు దాదాపు రూ. 1000 కోట్ల నష్టం వస్తోంది. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి ధరలు పెంచుతున్నారు.

గతంలో చమురు ధరల పెంపు తర్వాత కంపెనీల నష్టం ఎంతకు తగ్గింది?

గతంలో రూ. 3 పెంచిన తర్వాత, కంపెనీల రోజువారీ నష్టం రూ. 1000 కోట్ల నుండి రూ. 750 కోట్లకు తగ్గింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Vijay Wife Sangeetha Reunion: త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
Mumbai Doctor Controversy: చనిపోయిన మగవాళ్ల ప్రైవేటు పార్టులపై డాక్టర్ మహిళా అసహ్యకర జోకులు- ఇది మరో స్టాండప్ కామెడీ వివాదం
చనిపోయిన మగవాళ్ల ప్రైవేటు పార్టులపై డాక్టర్ మహిళా అసహ్యకర జోకులు- ఇది మరో స్టాండప్ కామెడీ వివాదం
SINGA: గూస్ బంప్స్ ఇచ్చేలా 'సింగ' టైటిల్ గ్లింప్స్‌... గోపీచంద్ కొత్త లుక్, కొత్త సినిమా ప్రోమో చూశారా?
గూస్ బంప్స్ ఇచ్చేలా 'సింగ' టైటిల్ గ్లింప్స్‌... గోపీచంద్ కొత్త లుక్, కొత్త సినిమా ప్రోమో చూశారా?
Anil Ravipudi: జీవీని పాతేసిన అనిల్ రావిపూడి... ప్రమోషన్లు మొదలెట్టేశార్రో
జీవీని పాతేసిన అనిల్ రావిపూడి... ప్రమోషన్లు మొదలెట్టేశార్రో
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Vijay Wife Sangeetha Reunion: త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
Mumbai Doctor Controversy: చనిపోయిన మగవాళ్ల ప్రైవేటు పార్టులపై డాక్టర్ మహిళా అసహ్యకర జోకులు- ఇది మరో స్టాండప్ కామెడీ వివాదం
చనిపోయిన మగవాళ్ల ప్రైవేటు పార్టులపై డాక్టర్ మహిళా అసహ్యకర జోకులు- ఇది మరో స్టాండప్ కామెడీ వివాదం
SINGA: గూస్ బంప్స్ ఇచ్చేలా 'సింగ' టైటిల్ గ్లింప్స్‌... గోపీచంద్ కొత్త లుక్, కొత్త సినిమా ప్రోమో చూశారా?
గూస్ బంప్స్ ఇచ్చేలా 'సింగ' టైటిల్ గ్లింప్స్‌... గోపీచంద్ కొత్త లుక్, కొత్త సినిమా ప్రోమో చూశారా?
Anil Ravipudi: జీవీని పాతేసిన అనిల్ రావిపూడి... ప్రమోషన్లు మొదలెట్టేశార్రో
జీవీని పాతేసిన అనిల్ రావిపూడి... ప్రమోషన్లు మొదలెట్టేశార్రో
Crime Thriller Series OTT : డబుల్ మర్డర్స్... ట్విస్టులతో ఇన్వెస్టిగేషన్ - ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
డబుల్ మర్డర్స్... ట్విస్టులతో ఇన్వెస్టిగేషన్ - ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
Meenakshi Natarajan Court Case: మీనాక్షి నటరాజన్‌ కేసు పిటిషన్‌ను ఫిర్యాదుదారుకు రిటర్న్ చేసిన నాంపల్లి కోర్టు - కేసు లేనట్లే - జరిగిపోయిన నష్టం భర్తీ ఎలా?
మీనాక్షి నటరాజన్‌ కేసు పిటిషన్‌ను ఫిర్యాదుదారుకు రిటర్న్ చేసిన నాంపల్లి కోర్టు - కేసు లేనట్లే - జరిగిపోయిన నష్టం భర్తీ ఎలా?
Standup Comedy Controversy: ప్లేట్ బిర్యానీ జోక్‌తో తిరగబడిన టెకీ లైఫ్ - లేడీస్ విషయంలో అంతే - 370 బిర్యానీ వైరల్ స్టోరీ ఇదిగో !
ప్లేట్ బిర్యానీ జోక్‌తో తిరగబడిన టెకీ లైఫ్ - లేడీస్ విషయంలో అంతే - 370 బిర్యానీ వైరల్ స్టోరీ ఇదిగో !
Kadiri Shadi Mahal Dispute: కదిరిలో షాదీమహల్‌కు తాళం - ఎమ్మెల్యే కబ్జా ప్లాన్‌లో భాగమే - వైసీపీ సంచలన ఆరోపణలు
కదిరిలో షాదీమహల్‌కు తాళం - ఎమ్మెల్యే కబ్జా ప్లాన్‌లో భాగమే - వైసీపీ సంచలన ఆరోపణలు
Embed widget