Ways to get Emergency fund: కొన్నిసార్లు మనకు డబ్బు అత్యవసరంగా అవసరమయ్యే పరిస్థితులు వస్తాయి. ఏదైనా పరిస్థితిలో డబ్బు ఆకస్మికంగా అవసరమైనప్పుడు సమస్యల్లో ఇరుక్కున్నట్లు ప్రజలు భావిస్తారు. ప్రజలు తక్షణమే డబ్బును సమకూర్చుకోవడానికి కొన్ని పరిమిత ఆప్షన్లు వారికి ఉంటాయి. ఆ సమయంలో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

Continues below advertisement

కొన్ని మార్గాల్లో తక్షణం నగదు పొంది తమ అవసరాన్ని తీర్చుకోగలరు. ఈ ఎంపికలలో వ్యక్తిగత రుణాలు (Personal Loans), క్రెడిట్ కార్డ్‌ల వినియోగం, బ్యాంక్ ఓవర్‌డ్రాఫ్ట్ వంటివి ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మూడింటికీ వేర్వేరు రూల్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్ల  గురించి కొన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

వ్యక్తిగత రుణాలు (Personal Loans) ఎంపిక

Continues below advertisement

పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు పర్సనల్ లోన్ ఎంచుకోవాలి. వివాహం, ఉన్నత విద్య, ఇల్లు కొనుగోలు చేయడం, ఏదైనా వైద్య అత్యవసర పరిస్థితుల్లో మీరు వ్యక్తిగత రుణాన్ని ఎంచుకోవాలి. బ్యాంక్ మీ ఆర్థిక స్థితి, సిబిల్ స్కోర్‌ (Cibil Score)ను పూర్తిగా పరిశీలించి మీ వ్యక్తిగత రుణాన్ని ఆమోదిస్తుంది. దీనిపై మీరు ప్రతి నెలా వడ్డీతో సహా నిర్దేశించిన మొత్తాన్ని బ్యాంకుకు చెల్లించాలి. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈ పరిస్థితిలో పర్సనల్ లోన్ మీకు సరైన ఎంపిక కావచ్చు. ఎందుకంటే మీ జీతం ప్రకారం EMI ని డిసైడ్ చేసుకుని నెలవారీగా చెల్లించవచ్చు. 

బ్యాంక్ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం

బ్యాంక్ ఓవర్‌డ్రాఫ్ట్ అనేది నగదు మీవద్ద లేని పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైన బ్యాంకింగ్ సౌకర్యం. దీనిని బ్యాంక్ తన అత్యంత నమ్మకమైన,  బాధ్యతాయుతమైన కస్టమర్‌లకు అందిస్తుంది. ఈ సర్వీస్ కింద మీ పొదుపు లేదా కరెంట్ ఖాతాలో ఎంత డబ్బు జమ అయినా, బ్యాంక్ మీకు దానికంటే ఎక్కువ డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతిస్తుంది. అయితే ఈ సౌకర్యం కోసం బ్యాంక్ మీ నుంచి వడ్డీని వసూలు చేస్తుంది. 

ఉదాహరణకు, మీ బ్యాంక్ ఖాతాలో రూ. 50,000 ఉంటే.. బ్యాంక్ మీకు రూ. 20,000 ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిని ఇస్తే కనుక మీరు బ్యాంక్ నుండి మొత్తం రూ. 70,000 విత్‌డ్రా చేయవచ్చు. కొంతకాలం పాటు డబ్బు అవసరమైన వారు బ్యాంక్ ఓవర్‌డ్రాఫ్ట్‌ను వినియోగించుకోవాలి. నిర్ణీత సమయంలోనే డబ్బును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 

క్రెడిట్ కార్డ్‌ల వినియోగం

క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా మీరు వెంటనే కావాల్సిన వస్తువులను, సర్వీసులను కొనుగోలు చేయవచ్చు. వచ్చే నెలలో ఆ బిల్లులను చెల్లించవచ్చు. ప్రతి క్రెడిట్ కార్డ్‌కు దాని లిమిట్ అనేది ఉంటుంది. దాని ప్రకారం మీరు కొనుగోలు చేయడం లేదా ఏదైనా బిల్లు చెల్లించవచ్చు. మీరు నెలవారీగా శాలరీ పొందుతున్నట్లయితే, వచ్చే నెలలో మీరు క్రెడిట్ కార్డ్ మొత్తాన్ని చెల్లించగలరని భావిస్తే ఆ పరిస్థితుల్లో క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించాలి. మీ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోతే, మీరు క్రెడిట్ కార్డ్‌లకు దూరంగా ఉండాలి. సమయానికి చెల్లించకపోతే వడ్డీ రూపంలో పెద్ద మొత్తంలో బ్యాంకులకు చెల్లించాలి. డబ్బు అవసరమైన సమయంలో మీకు ఎక్కువ మేలు చేసేది, తక్కువ నష్టం చేకూర్చే విధానాలనే ఎంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తారు.