Personal Loan Interest Rates: మనకు డబ్బు అత్యవసరం అయితే.. సేవింగ్స్ అంతగా లేకపోతే.. వెంటనే గుర్తుకొచ్చేది 'పర్సనల్ లోన్'. ఏ బ్యాంకు పడితే ఆ బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకోవడం ఆర్థికంగా భారమవుతుంది. లోన్ తీసుకునే ముందు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఈఎంఐలు సరిపోల్చి చూసుకోవడం చాలా అవసరం.
అక్టోబర్ నెలలో వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు
- బ్యాంకు పేరు - వడ్డీ రేటు (సంవత్సరానికి)
- యాక్సిస్ బ్యాంక్ - 8.90% నుండి
- యూనియన్ బ్యాంక్ - 8.90% నుండి
- ఇండియన్ బ్యాంక్ - 9.00% నుండి
- పంజాబ్ & సింధ్ బ్యాంక్ - 9.65% నుండి
- కెనరా బ్యాంక్ - 9.70% నుండి
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర - 9.75% నుండి
- యూకో బ్యాంక్ - 9.95% నుండి
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ - 9.99% నుండి
- ఐసీఐసీఐ బ్యాంక్ - 9.99% నుండి
- ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ - 9.99% నుండి
రూ.10 లక్షల రుణంపై EMI ఎంత?
- లోన్ మొత్తం, కాలపరిమితి, వడ్డీ రేటు ఆధారంగా నెలవారీ EMI మారుతుంది. ఒక ఉదాహరణ చూద్దాం.
- లోన్ మొత్తం: రూ.10,00,000
- తిరిగి చెల్లించే కాలపరిమితి: 5 సంవత్సరాలు (60 నెలలు)
- 8.90% వడ్డీ రేటు అయితే.. నెలవారీ EMI: సుమారు రూ.20,710
- 10.00% వడ్డీ రేటు వద్ద: నెలవారీ EMI: సుమారు రూ.21,247
- వడ్డీ రేటులో కేవలం 1.10% తేడా ఉన్నప్పటికీ, నెలకు దాదాపు రూ.537 తేడా వస్తుంది. 5 సంవత్సరాలకు ఇది వేల రూపాయల అదనపు భారంగా మారుతుంది. అందుకే సరైన బ్యాంకును ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. Also Read: భారత ప్రధాని అంబానీ..! స్టార్లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్ టార్గెట్గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
రుణం తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- మీ అవసరానికి తగినంత లోన్ మాత్రమే తీసుకోండి. కాలపరిమితి పెరిగితే EMI తగ్గవచ్చు, కానీ చెల్లించే మొత్తం వడ్డీ పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి.
- కేవలం ఒకే బ్యాంకుపై ఆధారపడకుండా కనీసం 3-4 బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీ-క్లోజర్ ఛార్జీలను సరిపోల్చండి.
- మీ నెలవారీ జీతం నుంచి ఇంటి ఖర్చులు, ఇతర అవసరాలు పోను మిగిలిన మొత్తంలోనే EMI ఈజీగా చెల్లించగలరో లేదో ముందే లెక్కగట్టిండి.
- తక్కువ వడ్డీ రేట్లు అని చూపే యాడ్స్ వెనుక దాగి ఉన్న షరతులను బాగా తెలుసుకోండి.
- మంచి క్రెడిట్ స్కోర్ (750 కంటే ఎక్కువ) ఉంటే బ్యాంకులతో తక్కువ వడ్డీ రేటు కోసం చర్చించే అవకాశం ఉంటుంది.
పర్సనల్ రుణం అనేది అత్యవసర సమయాల్లో మంచి పరిష్కారమే అయినప్పటికీ, సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే అది భారంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి.
Also Read: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్పీఎస్ కొత్త స్కీమ్
