search
×

Gold investment: బంగారం కొనడానికి బోలెడు రూట్లు, ఇవి తెలిస్తే షాప్‌ మొహం కూడా చూడరు

ఏప్రిల్-జూన్‌ కాలంలో పెళ్లిళ్ల సీజన్‌ ఉన్నా, కొండెక్కి కూర్చున్న స్వర్ణాన్ని అందుకోవడం సగటు భారతీయుడి వల్ల కాలేదు.

FOLLOW US: 
Share:

Gold Investment Options: ఇటీవలి నెలల్లో, మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన (24 క్యారెట్లు) బంగారం ధర ₹64,000 పలికింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ, ప్రస్తుతం ₹60,000 దగ్గర ఉంది. ఇది కూడా సామాన్యుడు భరించలేని రేటే. ఎల్లో మెటల్‌ మెరుపులు భరించలేక, జనం షాపుల వైపు వెళ్లడం తగ్గించారు.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) రీసెంట్‌ రిపోర్ట్‌ ప్రకారం... ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మన దేశంలో బంగారం డిమాండ్ (India Gold Demand in Q2) 7 శాతం తగ్గి, 158.1 టన్నులకు పరిమితమైంది. ఏప్రిల్-జూన్‌ కాలంలో పెళ్లిళ్ల సీజన్‌ ఉన్నా, కొండెక్కి కూర్చున్న స్వర్ణాన్ని అందుకోవడం సగటు భారతీయుడి వల్ల కాలేదు. అందువల్లే సామాన్య వినియోగదార్లు గోల్డ్ షాపులకు దూరంగా ఉంటున్నారు. 

బంగారం కొనడానికి కేవలం గోల్డ్‌ షాపులకు మాత్రమే వెళ్లాల్సిన పని లేదు, ఇంకా చాలా రూట్లున్నాయి. 

గోల్డ్‌ బాండ్స్‌ 
సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ (SGB) పేరిట కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రన్‌ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా SGBలను జారీ చేస్తుంది. కనిష్టంగా ఒక గ్రాము నుంచి గరిష్ఠంగా 4 కిలోల వరకు గోల్డ్‌ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. బాండ్ల జారీని ప్రకటించడానికి ముందున్న మూడు రోజుల్లో బంగారం ధరను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. ఆ మూడు రోజుల ధరలకు సగటును లెక్కించి, ఆ మొత్తాన్ని సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌లో ఒక గ్రాము బంగారం ధరగా నిర్ణయిస్తారు. ఏ బ్యాంక్‌ నుంచైనా సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు కొనుగోలు చేయవచ్చు. వీటిపై ఏడాదికి 2.50 శాతం వడ్డీని చెల్లిస్తారు. వీటి కాల గడువు (మెచ్యూరిటీ పిరియడ్‌) 8 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత విత్‌డ్రా చేసుకోవచ్చు. రిడీమ్‌ చేసుకునే సమయంలో ఉన్న రేటు ప్రకారం డబ్బు చెల్లిస్తారు. ఈ బాండ్లను బ్యాంకులో తనఖా పెట్టి లోన్‌ కూడా తీసుకోవచ్చు. ఇవి డిజిటల్‌ ఫార్మాట్‌లో ఉంటాయి కాబట్టి దొంగల భయం ఉండదు.

డిజిటల్‌ గోల్డ్
ఇది వర్చువల్‌ గోల్డ్‌. ఆన్‌లైన్‌లో మీడియేటర్‌ కంపెనీ ద్వారా కొనుగోలు చేయాలి. మీరు డబ్బు కట్టిన ప్రతిసారీ, ఆ డబ్బుకు సమానమైన బంగారాన్ని మీడియేటింగ్‌ కంపెనీ కొని, మీ పేరిట తన వద్ద దాస్తుంది. కనిష్టంగా ఒక గ్రాము కూడా కొనుగోలు చేయొచ్చు. మీ బంగారం తిరిగి కావాలని అనుకున్నప్పుడు భౌతిక లోహం రూపంలో తిరిగి మీకు అప్పగిస్తుంది. ఇప్పుడు.. స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీలతో పాటు పేటీఎం, ఫోన్‌పే వంటి ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థల ద్వారా కూడా డిజిటల్‌ గోల్డ్‌ కొనవచ్చు. 

గోల్డ్‌ ETFs
దీనిని గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ లేదా గోల్డ్‌ ETFs గా పిలుస్తారు. ఇది కూడా ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉండే బంగారమే. ఎలక్ట్రానిక్‌ రూపంలో సులభంగా వీటిని కొనవచ్చు, అమ్మవచ్చు. స్టాక్‌ ఎక్స్ఛేంజీల ద్వారా వీటిని ట్రేడ్‌ చేయొచ్చు. ETFs ద్వారా కొన్న పసిడి డీమ్యాట్‌ రూపంలో ఉంటుంది. కాబట్టి, బంగారం భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌
ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ తరహాలోనే గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోనూ దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టవచ్చు. దీని కోసం వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ హౌస్‌లు నుంచి వివిధ స్కీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. మీరు జమ చేసే డబ్బును గోల్డ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ పేరుతో మ్యూచువల్‌ ఫండ్స్‌ ETFల్లో పెట్టుబడి పెడతాయి. మీకు డీమ్యాట్‌ అకౌంట్‌ లేకపోయినా వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు. 

మరో ఆసక్తికర కథనం: ఉల్లి రేటు రెట్టింపయ్యే ఛాన్స్‌ - ఈ ఘాటు నషాళానికి అంటుతుంది!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 05 Aug 2023 02:51 PM (IST) Tags: Mutual Funds Digital Gold Gold bonds Gold ETFs Demand

ఇవి కూడా చూడండి

Big Changes 2025: జనవరి 01 నుంచి జరిగే ఆరు పెద్ద మార్పులు - సగం లాభం, సగం నష్టం!

Big Changes 2025: జనవరి 01 నుంచి జరిగే ఆరు పెద్ద మార్పులు - సగం లాభం, సగం నష్టం!

ITR Filing: పన్ను చెల్లింపుదార్లకు గుడ్‌ న్యూస్‌ - ITR ఫైలింగ్‌ గడువు పెంచిన టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌

ITR Filing: పన్ను చెల్లింపుదార్లకు గుడ్‌ న్యూస్‌ - ITR ఫైలింగ్‌ గడువు పెంచిన టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌

Gold-Silver Prices Today 31 Dec: నగలు కొనేవాళ్లకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌, భారీగా తగ్గిన బంగారం రేటు - ఈ రోజు పసిడి, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today 31 Dec: నగలు కొనేవాళ్లకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌, భారీగా తగ్గిన బంగారం రేటు - ఈ రోజు పసిడి, వెండి ధరలు ఇవి

New Year Gift Ideas: మ్యూచువల్ ఫండ్, షేర్లు లేదా గోల్డ్ బాండ్ - కొత్త సంవత్సరంలో ఏ బహుమతి ఇవ్వాలి?

New Year Gift Ideas: మ్యూచువల్ ఫండ్, షేర్లు లేదా గోల్డ్ బాండ్ - కొత్త సంవత్సరంలో ఏ బహుమతి ఇవ్వాలి?

Cheapest Insurance Policy: ఇది దేశంలోనే అత్యంత చవకైన బీమా పాలసీ, కేవలం 45 పైసలకే రూ.10 లక్షల బీమా కవరేజ్

Cheapest Insurance Policy: ఇది దేశంలోనే అత్యంత చవకైన బీమా పాలసీ, కేవలం 45 పైసలకే రూ.10 లక్షల బీమా కవరేజ్

టాప్ స్టోరీస్

AP Liquor Policy: మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు

AP Liquor Policy: మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు

KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !

KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !

Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?

Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?

DCP Vineet With ABP Desam: న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్

DCP Vineet With ABP Desam: న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్