అన్వేషించండి

Personal Bankruptcy in India: సామాన్యుడు తాను దివాలా తీసినట్లు ప్రకటించుకోవచ్చా? చట్టం ఏం చెబుతుంది?

Personal Bankruptcy in India: సుభాష్ చంద్ర దివాలా కేసులో భారీ ఉపశమనం పొందారు. అయితే ఒక సాధారణ వ్యక్తి తాను దివాలా తీసినట్లు ప్రకటించుకోగలడా లేదా అనే విషయాన్ని తెలుసుకోండి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కార్పొరేట్ రుణ హామీదారులకు దివాలా చట్టం పూర్తిగా వర్తిస్తుంది.
  • సాధారణ ప్రజలకు దివాలా చట్టం ఇంకా పూర్తిగా అమలు కాలేదు.
  • ప్రస్తుతం పాత దివాలా చట్టాలు, ప్రక్రియలు అమలులో ఉన్నాయి.
  • దివాలా ప్రకటించిన వారికి ఆస్తుల విక్రయంతో ప్రతిష్ట దెబ్బతింటుంది.

Personal Bankruptcy in India: ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర తనపై దాఖలైన వ్యక్తిగత దివాలా కేసులో ₹6.5 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు,  ఇతర ఆర్థిక సంస్థలు మొత్తం ₹22,006.57 కోట్ల క్లెయిమ్‌ల కోసం రికవరీ చర్యలను ప్రారంభించాయి. అంటే 22,006.57 కోట్ల రుణానికి బదులు సుభాష్ చంద్ర  ఆరున్నర కోట్లు చెల్లిస్తే సరిపోతుంది. ఈ ప్రతిపాదనకు అప్పులు ఇచ్చిన సంస్థలు  ఓటు వేయగా... దివాలా, బ్యాంక్రప్సీ కోడ్ కింద నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆ నిర్ణయాన్ని సమర్థించింది. అందుకే క్లెయిమ్‌లోని ప్రతి ₹100కి రికవరీ మొత్తం కేవలం మూడు పైసలు మాత్రమే. ఈ కేసు ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ఒక పెద్ద వ్యాపారవేత్తే వ్యక్తిగత దివాలా ప్రక్రియను ఎదుర్కోగలిగినప్పుడు, ఒక సాధారణ వ్యక్తి కూడా తన రుణాలను తిరిగి చెల్లించలేకపోతే వ్యక్తిగతంగా దివాలా తీసినట్లు ప్రకటించుకోవచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.

దివాలా, బ్యాంక్రప్సీ కోడ్ సామాన్యుడిని ఎందుకు పూర్తిగా వర్తించదు ?

దివాలాలను పరిష్కరించడానికి, రుణాలను వసూలు చేయడానికి ఒక ఆధునిక చట్రాన్ని సృష్టించేందుకు దివాలా, బ్యాంక్రప్టసీ కోడ్, 2016ను రూపొందించారు. ఈ చట్టం కంపెనీలకు, కార్పొరేట్ రుణగ్రహీతలకు పూర్తిగా వర్తిస్తుంది. అయితే, వ్యక్తులు, భాగస్వామ్య సంస్థల దివాలా, బ్యాంక్రప్టసీకి సంబంధించిన ఐబిసిలోని పార్ట్ 3, సాధారణ ప్రజల కోసం ఇంకా పూర్తిగా అమలు కాలేదు.

ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది. ఐబిసి ​​ప్రకారం, ఒక కంపెనీ లేదా భాగస్వామ్య సంస్థ తీసుకున్న కార్పొరేట్ రుణానికి ఒక వ్యక్తి వ్యక్తిగత హామీ ఇచ్చి, ఆ తర్వాత రుణగ్రహీత చెల్లింపులో విఫలమైతే, ఆ వ్యక్తి దివాలా ప్రక్రియను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే పెద్ద కార్పొరేట్ రుణాలకు సంబంధించిన కేసులలో వ్యక్తిగత దివాలా ప్రక్రియలను ప్రారంభించవచ్చు. కేవలం వ్యక్తిగత రుణం తీసుకున్న వ్యక్తికి పరిస్థితి భిన్నంగా ఉంటుంది.

ఇప్పటికీ అమలులో పాత దివాలా చట్టాలు 

వ్యక్తిగత అప్పులను ఎదుర్కొంటున్న వ్యక్తులకు చట్టపరమైన మార్గాలు పూర్తిగా లేవని కాదు. భారత్‌లో వ్యక్తిగత దివాలాకు సంబంధించిన రెండు పాత చట్టాలు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి.

ప్రెసిడెన్సీ టౌన్స్‌ దివాలా చట్టం, 1909 – ముంబై, కోల్‌కతా, చెన్నైతో సహా కొన్ని మహానగర ప్రాంతాలకు వర్తిస్తుంది.

టెరిటోరియల్ దివాలా చట్టం, 1920 – దేశంలోని మిగిలిన ప్రాంతాలకు వర్తిస్తుంది. 

క్రెడిట్ కార్డులు, డిజిటల్ రుణ వేదికలు, వినియోగదారు రుణాలు, తక్షణ ఆన్‌లైన్ రుణాలతో కూడిన నేటి ఆర్థిక వాతావరణం ఏర్పడక చాలా కాలం ముందు, అంటే ఒక శతాబ్దానికి పైగా క్రితం ఈ చట్టాలు రూపొందించారు. అందుకే ఆధునిక ఆర్థిక వ్యవస్థలో వాటి విధానాలు పాతవిగా, క్లిష్టమైనవిగా ఉన్నాయి. 

సాధారణ ప్రజలకు వ్యక్తిగత దివాలా ఎందుకు కష్టంగా ఉంటుంది? 

అప్పుల్లో ఉన్న వ్యక్తి కేవలం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి దివాలా ప్రకటించుకోలేరు. వారు సాధారణంగా సంబంధిత న్యాయస్థానానికి వెళ్లి, అధికారిక న్యాయ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. 

 అప్పులు తీసుకున్న వ్యక్తి ఒక న్యాయవాది సహాయంతో దివాలా కోసం దరఖాస్తు చేసుకోవాలి. అప్పులు ఇచ్చిన సంస్థలు, చెల్లించాల్సిన అప్పులు, ఆస్తులు, ఆదాయంతో సహా తమ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని అందించాలి. ఆ వ్యక్తి తాము నిజంగా తమ ఆర్థిక బాధ్యతలను నెరవేర్చలేకపోతున్నామని, తమ అప్పులు చెల్లించే సామర్థ్యానికి మించి ఉన్నాయని నిరూపించుకోవాలి. ఆ తర్వాత న్యాయస్థానం కేసును విచారిస్తుంది, సంబంధిత పార్టీల వాదనలు వింటుంది. అవసరమైన విచారణలు జరుపుతుంది.

ఒక వ్యక్తి దివాలా తీసినట్లు ప్రకటించిన తర్వాత ఏం జరుగుతుంది? 

దివాలా ప్రకటించడం అంటే కేవలం అప్పుల నుంచి విముక్తి పొందడం మాత్రమే కాదు. ఇది ఒక వ్యక్తి ఆస్తులు, ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్ అవకాశాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇందులో అత్యంత ముఖ్యమైన పరిణామం వ్యక్తిగత ఆస్తుల అమ్మకం. అప్పటి పరిస్థితులు, వర్తించే చట్టాలను బట్టి, ఇల్లు, కారు లేదా ఆభరణాలు వంటి ఆస్తులను దివాలా ప్రక్రియలో చేర్చి, రుణదాతలకు చెల్లించడానికి ఉపయోగించవచ్చు. కొన్ని ముఖ్యమైన వస్తువులను కాపాడుకోగలిగినప్పటికీ, దివాలా అంటే ఒక వ్యక్తి తన ఆస్తులన్నింటినీ ఉంచుకొని, అప్పులన్నీ తీరిపోతాయని కాదు. ఒక వ్యక్తి ఆర్థిక ప్రతిష్ట కూడా తీవ్రంగా దెబ్బ తింటుంది. ఫలితంగా భవిష్యత్తులో రుణాలు పొందే సామర్థ్యంపై తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల సాంప్రదాయ బ్యాంకింగ్ క్రెడిట్ సేవలను పొందడం కష్టమవుతుంది.

Frequently Asked Questions

సాధారణ ప్రజలకు వ్యక్తిగత దివాలా కోసం IBC పూర్తిగా వర్తిస్తుందా?

లేదు, దివాలా, బ్యాంక్రప్సీ కోడ్ (IBC) కంపెనీలు, కార్పొరేట్ రుణగ్రహీతలకు మాత్రమే పూర్తిగా వర్తిస్తుంది. వ్యక్తులకు సంబంధించిన పార్ట్ 3 ఇంకా పూర్తిగా అమలు కాలేదు.

IBC కింద ఒక వ్యక్తికి దివాలా ప్రక్రియ ఎప్పుడు వర్తించవచ్చు?

ఒక వ్యక్తి కంపెనీ లేదా భాగస్వామ్య సంస్థ తీసుకున్న కార్పొరేట్ రుణానికి వ్యక్తిగత హామీ ఇచ్చి, ఆ రుణగ్రహీత చెల్లింపులో విఫలమైతే, ఆ వ్యక్తికి దివాలా ప్రక్రియ వర్తిస్తుంది.

సామాన్య ప్రజల వ్యక్తిగత దివాలా కోసం ప్రస్తుతం ఏ చట్టాలు అమలులో ఉన్నాయి?

ప్రెసిడెన్సీ టౌన్స్ దివాలా చట్టం, 1909, టెరిటోరియల్ దివాలా చట్టం, 1920 వంటి పాత చట్టాలు అమలులో ఉన్నాయి. ఇవి ఆధునిక ఆర్థిక వాతావరణానికి తగినవి కావు.

వ్యక్తిగత దివాలా ప్రకటించిన తర్వాత కలిగే ప్రధాన పరిణామాలు ఏమిటి?

దివాలా ప్రకటించిన తర్వాత ఆస్తుల అమ్మకం జరగవచ్చు. వ్యక్తి ఆర్థిక ప్రతిష్ట దెబ్బతిని, భవిష్యత్తులో రుణాలు పొందే సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu: డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
Historic IND VS JPN Clash: వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
Telangana Assembly Sessions: నీ తల్లిని కాదు నా తల్లిని అవమానించారు.. దీనికేం చెబుతావు? హరీష్ రావుపై స్పీకర్ మండిపాటు
నీ తల్లిని కాదు నా తల్లిని అవమానించారు.. దీనికేం చెబుతావు? హరీష్ రావుపై స్పీకర్ మండిపాటు
KTR Challenge: 420 హామీలు నెరవేర్చుతామంటే మేమే అరెస్ట్ అవుతాం! అందుకు సిద్ధమా? కేటీఆర్ ఛాలెంజ్
420 హామీలు నెరవేర్చుతామంటే మేమే అరెస్ట్ అవుతాం! అందుకు సిద్ధమా? కేటీఆర్ ఛాలెంజ్
Advertisement

వీడియోలు

Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్
Fatima Sana Women's Asia Cup 2026 | పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ షాక్
Telangana Politics | BRS MLC Arrest | తెల్లవారుజామున BRS ఎమ్మెల్సీల అరెస్ట్.. తాతా మధు, నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
KTR challenges Congress | ఎమ్మెల్సీల అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్.. “మేమంతా అరెస్ట్‌కు సిద్ధం.. మీరు సిద్ధమా?”
Mohsin Naqvi Women's Asia Cup 2026 | టీమిండియా గెలిస్తే ట్రోఫీ ఇస్తారా? నఖ్వీ రాకతో మళ్లీ వివాదం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
Historic IND VS JPN Clash: వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
Telangana Assembly Sessions: నీ తల్లిని కాదు నా తల్లిని అవమానించారు.. దీనికేం చెబుతావు? హరీష్ రావుపై స్పీకర్ మండిపాటు
నీ తల్లిని కాదు నా తల్లిని అవమానించారు.. దీనికేం చెబుతావు? హరీష్ రావుపై స్పీకర్ మండిపాటు
KTR Challenge: 420 హామీలు నెరవేర్చుతామంటే మేమే అరెస్ట్ అవుతాం! అందుకు సిద్ధమా? కేటీఆర్ ఛాలెంజ్
420 హామీలు నెరవేర్చుతామంటే మేమే అరెస్ట్ అవుతాం! అందుకు సిద్ధమా? కేటీఆర్ ఛాలెంజ్
Anaswara Rajan: కాకా కూతురు అమ్ములు పాప... చిరంజీవి సినిమాలో అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ రిలీజ్... బర్త్‌డే స్పెషల్
కాకా కూతురు అమ్ములు పాప... చిరంజీవి సినిమాలో అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ రిలీజ్... బర్త్‌డే స్పెషల్
2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ vs పాత మోడల్‌.. మైలేజ్, పవర్‌లో వచ్చిన మార్పులేంటి?
2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ ఎంత మైలేజ్ ఇస్తుంది? కంపెనీ లెక్కలు చూస్తే షాకే!
Dates Benefits : ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే.. రోజుకు ఎన్ని తింటే మంచిది
ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే.. రోజుకు ఎన్ని తింటే మంచిది
KL Rahul Future Clarity: ట్రేడింగ్ రూమర్లకు చెక్ పెట్టిన రాహుల్..తన ట్వీట్ తో క్లారిటీ , ఇక హార్దిక్ పాండ్యా ఇష్యూలో మ‌రో ట్విస్ట్
ట్రేడింగ్ రూమర్లకు చెక్ పెట్టిన రాహుల్..తన ట్వీట్ తో క్లారిటీ , ఇక హార్దిక్ పాండ్యా ఇష్యూలో మ‌రో ట్విస్ట్
Embed widget