SBI Amrit Kalash Scheme Details in Telugu: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI), తన కస్టమర్ల కోసం ప్రకటించిన ఒక స్పెషల్‌ ఆఫర్‌ అతి త్వరలో ముగుస్తుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఇస్తున్న ఆఫర్‌ పేరు 'అమృత్‌ కలశ్‌' (SBI Amrit Kalash Scheme). ఇది ఒక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌. మీ దగ్గర కొంత డబ్బు ఉండి, షార్ట్‌ టర్మ్‌లో మంచి ఆదాయం సంపాదించాలని ప్లాన్‌ చేస్తుంటే ఇదొక గుడ్‌ ఆప్షన్‌.


అమృత్‌ కలశ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం గడువును (SBI Amrit Kalash Scheme Dead Line / Last date) స్టేట్‌ బ్యాంక్‌ చాలా సార్లు పెంచింది. ఈ స్కీమ్‌కు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా ఆఖరు తేదీని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చింది. తాజాగా, డెడ్‌లైన్‌ను డిసెంబర్‌ 31, 2023గా ఫిక్స్‌ చేసింది. ఎస్‌బీఐ, పథకం చివరి తేదీని మరోమారు పెంచుతుందో, లేదో ప్రస్తుతానికి స్పష్టత లేదు. 


ఎస్‌బీఐ అమృత్‌ కలశ్‌ పథకం వివరాలు (SBI Amrit Kalash Scheme Details):


అమృత్‌ కలశ్‌ స్కీమ్‌ ఇంట్రెస్ట్‌ రేట్‌ (SBI Amrit Kalash Scheme Interest Rate 2023)
SBI అమృత్‌ కలశ్‌ పథకం టైమ్‌ పిరియడ్‌ 400 రోజులు. ఈ డిపాజిట్‌ పథకంలో పెట్టుబడి పెట్టే సీనియర్‌ సిటిజన్లకు ఏటా 7.6% వడ్డీ రేటు అందుతుంది. సాధారణ పౌరులకు ఏడాదికి 7.1% వడ్డీ రేటును బ్యాంక్‌ ఇస్తుంది. ఎస్‌బీఐ ఉద్యోగులు, పెన్షనర్లకు అదనంగా ఒక శాతం ‍‌(1%) వడ్డీ రేటు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తోంది.


అమృత్‌ కలశ్‌ వడ్డీ రేటు గురించి ఇంకా సింపుల్‌గా తెలుసుకుందాం. ఈ పథకంలో ఒక సీనియర్‌ సిటిజన్‌ ఒక 5 లక్షల రూపాయలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే, 7.6% వడ్డీ రేటు ప్రకారం 400 రోజులకు అతనికి రూ.43,000 వడ్డీ వస్తుంది. ఇదే మొత్తానికి ఒక సాధారణ పౌరుడికి లభించే వడ్డీ మొత్తం 40,085 రూపాయలు.


అమృత్‌ కలశ్‌ కోసం ఎలా అప్లై చేసుకోవాలి? (How to apply for SBI Amrit Kalash Scheme?)
మీకు దగ్గరలో ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడి వరకు వెళ్లేంత సమయం మీకు లేకపోతే ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఎస్‌బీఐ యోనో (SBI YONO) యాప్‌ ద్వారా కూడా ఈ స్కీం కోసం అప్లై చేసుకోవచ్చు.


అమృత్‌ కలశ్‌ స్కీమ్‌పై బ్యాంక్‌ లోన్‌ (Bank loan on SBI Amrit Kalash Scheme)
ఈ స్కీమ్‌ను మెచ్యూరిటీ తేదీ కంటే ముందుగానే రద్దు చేసుకునే సదుపాయం ఉంది. దీంతో పాటు, ఈ డిపాజిట్‌ను మీద బ్యాంక్‌ లోన్‌ కూడా వస్తుంది.


అమృత్‌ కలశ్‌ పథకంపై మీరు తీసుకునే వడ్డీపై ఆదాయ పన్ను (Income Tax) నిబంధనల ప్రకారం TDS కట్‌ అవుతుంది. ఇలా కట్‌ అయిన మొత్తాన్ని, మీరు ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేసే సమయంలో క్లెయిమ్‌ చేసుకోవచ్చు. 


రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాల్లో ఉండే దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు, NRI రూపాయి టర్మ్ డిపాజిట్లు రెండింటికీ ఈ పథకం వర్తిస్తుంది. కొత్తగా డిపాజిట్‌ చేయడంతో పాటు, పాత డిపాజిట్‌ను కూడా రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇందులో, టర్మ్ డిపాజిట్ & స్పెషల్‌ టర్మ్ డిపాజిట్ సౌకర్యం కూడా ఖాతాదార్లకు అందుబాటులో ఉంది.