Premature FD Withdrawal: ఈ నెల ప్రారంభంలో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 6.50 శాతం నుంచి 6.25 శాతానికి, 25 బేసిస్ పాయింట్లు (RBI Repo Rate Cut) తగ్గించిన తర్వాత, బ్యాంకులు కూడా ఫిక్స్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేటు (Interest rate on fixed deposits)పై అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కొన్ని బ్యాంక్‌లు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించాయి. దీంతో, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టిన కస్టమర్లలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. వీళ్లలో చాలా మంది, తమ FDని బ్రేక్ చేసి ముందస్తుగా డబ్బును ఉపసంహరించుకోవాలని (FD Early Withdrawal) & మరింత మంచి రాబడి ఇచ్చే ఆర్థిక సాధనాలలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటున్నారు.
అయితే, లోతుగా ఆలోచించకుండా తొందరపడి ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను మధ్యలోనే రద్దు చేసుకునే వాళ్లు ప్రతికూల పరిణామాలను అనుభవించాల్సి రావచ్చు. ఎఫ్‌డీ ముందస్తు ఉపసంహరణపై బ్యాంకులు జరిమానా విధిస్తాయన్న విషయాన్ని పెట్టుబడిదారులు గుర్తు పెట్టుకోవాలి. నిర్ణీత సమయం వరకు కొన్ని బ్యాంక్‌లు FD వడ్డీ రేటు తగ్గించి, సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటును మాత్రమే చెల్లిస్తున్నాయి. అంటే, ఎఫ్‌డీని బ్రేక్ చేయడం వల్ల నష్టాన్ని ఎదుర్కోవలసి రావచ్చు.
ముందస్తు ఉపసంహరణపై జరిమానా రద్దు చేసే ఛాన్స్!ఇలాంటి సమయాల్లో, ఫిక్స్‌డ్ డిపాజిట్ పెట్టుబడిదార్లకు ఒక వెసులుబాటు కూడా ఉంటుంది. ఎఫ్‌డీ డబ్బు ముందస్తు ఉపసంహరణపై బ్యాంక్ విధించే జరిమానాను కొన్ని షరతుల ఆధారంగా పూర్తిగా మాఫీ చేసేందుకు అవకాశం ఉంది. బ్రేక్ చేసిన ఎఫ్‌డీ డబ్బును అదే బ్యాంకులో మరో మంచి దీర్ఘకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో మళ్ళీ పెట్టుబడి పెట్టడం ఈ షరతుల్లో ఒకటి. ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు, పెట్టుబడిదారులు తమ బ్యాంక్ విధించే జరిమానాలు & ముందస్తు ఉపసంహరణపై వచ్చే వడ్డీ గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. FD ని ముందస్తుగా ఉపసంహరించుకోవడంపై అన్ని బ్యాంకులు వేర్వేరు జరిమానాలు విధిస్తాయని మీకు తెలియజేద్దాం. అయితే, ఈ జరిమానా సాధారణంగా 0.5 శాతం నుండి ఒక శాతం వరకు ఉంటుంది.
మరో ఆసక్తికర కథనం: రూ.89,000 దాటిన గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
సగం శాతం జరిమానా విధిస్తున్న స్టేట్ బ్యాంక్స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), రూ. 5 లక్షల వరకు టర్మ్ డిపాజిట్లను ముందస్తుగా ఉపసంహరించుకుంటే అర శాతం (0.5%) జరిమానా విధిస్తుంది. రూ. 5 లక్షలకు పైగా టర్మ్ డిపాజిట్లపై ఒక శాతం (1%) జరిమానా విధిస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), మెచ్యూరిటీకి ముందు ఉపసంహరణపై FD వడ్డీ రేటు కంటే 0.5 లేదా ఒక శాతం తక్కువ వడ్డీ ఇస్తుంది. HDFC బ్యాంక్ కూడా, మెచ్యూరిటీ కంటే ముందు FD ఉపసంహరణపై నిర్ణీత వడ్డీ రేటు కంటే ఒక శాతం తక్కువ వడ్డీని చెల్లిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: ఈ జంట ఇంట్లో కూర్చొని రూ.50 లక్షలు సంపాదిస్తోంది, ఈ టెక్నిక్ మీరూ ట్రై చేయొచ్చు