Post Office Savings Account: బ్యాంక్‌ ఖాతా మీద రకరకాల ఛార్జీలను సంబంధిత బ్యాంక్‌ కస్టమర్ల నుంచి వసూలు చేస్తుందని మనకు తెలుసు. ఖాతా నిర్వహణ ఛార్జీలు, ఏటీఎం కార్డ్‌ వార్షిక రుసుము, కనీస నిల్వ లేకపోతే ఫైన్‌, ఏదైనా స్టేట్‌మెంట్‌ కావాలంటే ఛార్జీ ఇలా రకరకాల రూపాల్లో బ్యాంకులు వసూలు ఖాతాదార్ల నుంచి డబ్బులు చేస్తుంటాయి.     


ఇదే విధంగా, సేవింగ్స్‌ ఖాతా మీద పోస్టాఫీసు కూడా రకరకాల ఛార్జీలు వసూలు చేస్తోంది. మన దేశంలో బ్యాంకు ఖాతాదార్ల కంటే పోస్టాఫీసు ఖాతాదార్ల సంఖ్య ఎక్కువ. నెలకు లక్షల రూపాయలు సంపాదించే వారి దగ్గర నుంచి అతి తక్కువ ఆదాయం సంపాదించే వారి వరకు, ప్రతి ఒక్కరూ పొదుపు చేయగలిగేలా లేదా పెట్టుబడి పెట్టేలా పోస్టాఫీసు పథకాలు (Post office Schemes) ఉంటాయి. కాబట్టే, పోస్టాఫీసుల మీద ప్రజలకు అమితమైన నమ్మకం ఉంది. పోస్టాఫీసులు, 'చిన్న మొత్తాల పొదుపు పథకాలను' ‍‌(Small Savings Schemes) ఎక్కువగా అందిస్తున్నాయి. మైనర్ల నుంచి సీనియర్‌ సిటిజన్ల వరకు ప్రతి వర్గానికి ఉపయోగ పడేలా, ప్రయోజనం చేకూర్చేలా పోస్టాఫీసు పథకాలు ఉన్నాయి. ఈ పథకాల మీద ఆకర్షణీయమైన వడ్డీ రావడంతో పాటు, ఆదాయ పన్ను మినహాయింపులు కూడా ఉండడంతో పోస్టాఫీసు ఖాతాదార్లలో ఉద్యోగస్తులు, వ్యాపారులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. పైగా కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు ఉండడంతో, పోస్టాఫీసు పథకాల్లో ప్రజలు పెట్టే పెట్టుబడులు సురక్షితంగా ఉండడంతో పాటు, రాబడికి హామీ లభిస్తుంది.        


భారతీయ పోస్ట్ ఆఫీస్‌ సేవింగ్స్‌ ఖాతాలో లేదా ఏదైనా పోస్టాఫీసు పథకంలో డబ్బును పెట్టుబడిగా పెడితే.. వాటిపై వివిధ రకాల రుసుములను చెల్లించాల్సి ఉంటుంది. మీకు పోస్టాఫీసు సేవింగ్స్‌ అకౌంట్‌ ‍‌(Post Office Savings Account) ఉంటే, ఈ ఛార్జీలకు సంబంధించిన సమాచారాన్ని మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. పొదుపు ఖాతాదార్లకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్న పోస్టాఫీసు, ఆ సౌకర్యాల కల్పన కోసం ఛార్జీలు వసూలు చేస్తోంది.


సేవింగ్స్‌ ఖాతా నిర్వహణపై పోస్టాఫీసు వసూలు చేస్తున్న 8 రకాల ఛార్జీలు ఇవి:       


8 ఇతర సేవలు మరియు రుసుములు      
డూప్లికేట్ పాస్ బుక్ జారీ చేయడానికి రూ. 50 ఛార్జీ    
ఖాతా స్టేట్‌మెంట్‌ లేదా డిపాజిట్ రసీదు జారీ కోసం రూ. 20 ఛార్జీ          
పోగొట్టుకున్న లేదా మ్యుటిలేటెడ్ సర్టిఫికేట్‌కు బదులుగా కొత్త పాస్‌బుక్ తీసుకోవడం కోసం రిజిస్ట్రేషన్ ఛార్జీ - రూ. 10
నామినేషన్ రద్దు లేదా మార్పు కోసం - రూ. 50 ఛార్జీ        
ఖాతా బదిలీ కోసం - రూ. 100 ఛార్జీ   
ఖాతాపై తాకట్టు కోసం - రూ. 100 ఛార్జీ    
చెక్ బౌన్స్‌ లేదా క్యాన్సిల్‌ చేస్తే - రూ. 100 ఛార్జీ    
సేవింగ్స్ బ్యాంక్ ఖాతా చెక్ బుక్ జారీ కోసం - ఒక క్యాలెండర్‌ సంవత్సరంలో 10 లీఫ్‌ల వరకు ఛార్జీలు ఉండవు,  ఆ తర్వాత ప్రతి లీఫ్‌కు రూ. 2 ఛార్జీ