Short-term fixed deposits rates: తక్కువ కాలంలో ఎక్కువ డబ్బును సంపాదించి పెట్టే సురక్షితమైన పెట్టుబడి మార్గాల్లో స్వల్పకాలిక బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (Short term FD) ఒకటి. దీనిలో పెట్టుబడికి రిస్క్ ఉండదు. పైగా, బ్యాంక్ తొలుత వాగ్దానం చేసిన వడ్డీ ఆదాయం కస్టమర్ ఖాతాలోకి కచ్చితంగా వస్తుంది. మన దేశంలో ఎక్కువ మంది ఎన్నుకుంటున్న ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ ఇది.
వివిధ టెన్యూర్స్ కోసం బ్యాంక్‌లో డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయవచ్చు. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాల పరిమితి (tenure) వరకు ఎఫ్‌డీ స్కీమ్స్ ఉంటాయి. వీటిని స్వల్పకాలిక FD & దీర్ఘకాలిక FD అని విభజించవచ్చు. 7 రోజుల నుంచి 12 నెలల (1 సంవత్సరం) టర్మ్‌తో పని చేసే ఎఫ్‌డీలను స్వల్పకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Short term fixed deposits) అని; 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల కాల పరిమితితో ఉంటే డిపాజిట్లను దీర్ఘకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Long term fixed deposits) అని పిలుస్తారు.
షార్ట్ టర్మ్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ, సాధారణంగా, పొదుపు ఖాతా (savings account) రేట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే, దీర్ఘకాలిక FD రేట్ల కంటే తక్కువగా ఉంటుంది.
స్వల్పకాలిక డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు అన్ని బ్యాంక్‌ల్లో ఒకేలా ఉండవు, రుణదాతను బట్టి & కాల వ్యవధిని బట్టి మారుతుంటాయి. వీటిలోనూ... ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల కంటే ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ప్రైవేట్ రంగ బ్యాంక్‌ల కన్నా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ల్లో ఇంకా ఎక్కువ వడ్డీ ఆదాయం వస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల బ్యాంక్‌లతో పోలిస్తే, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ల్లో పెట్టుబడులపై రిస్క్ ఎక్కువగా ఉంటుందని గమనించాలి.
ప్రస్తుతం, సాధారణ కస్టమర్లకు షార్ట్ టర్మ్ డిపాజిట్లపై (7 రోజుల నుంచి 01 సంవత్సరం కాలపరిమితి డిపాజిట్లపై) వివిధ రంగాల బ్యాంక్‌లు వివిధ మొత్తాల్లో వడ్డీ చెల్లిస్తున్నాయి. 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులను సాధారణ కస్టమర్లుగా బ్యాంక్‌లు పిలుస్తుంటాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో షార్ట్ టర్మ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు (Public sector banks' FD rates)
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (SBI) సాధారణ కస్టమర్లకు 3% నుంచి 5.75% మధ్య వడ్డీ ఆదాయం వస్తుంది.
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సాధారణ కస్టమర్లకు 3% నుంచి 7% మధ్య వడ్డీ రేట్లను చెల్లిస్తోంది.
- కెనరా బ్యాంక్ (Canara Bank) సాధారణ కస్టమర్లకు 4% నుంచి 6.85% వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది.
ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో షార్ట్ టర్మ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు (Private bank's FD rates)
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) సాధారణ కస్టమర్లకు 3% నుంచి 6% వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.
- ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) సాధారణ కస్టమర్లకు 3% నుంచి 6% మధ్య వడ్డీ ఆఫర్ చేస్తోంది.
- యెస్ బ్యాంక్ (Yes Bank) సాధారణ కస్టమర్లు 3.25% నుంచి 7.25% వరకు వడ్డీ ఆదాయం పొందుతున్నారు.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో షార్ట్ టర్మ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు (Small finance banks' FD rates)
- యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Unity Small Finance Bank) తన సాధారణ కస్టమర్లకు 4.50% నుంచి 7.85% మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది.
- జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Jana Small Finance Bank) సాధారణ కస్టమర్లకు 3% నుంచి 8.50% వరకు వడ్డీ ఆదాయం అందుతోంది.
- సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ (Suryoday Small Finance Bank) బ్యాంక్ సాధారణ కస్టమర్లు 4% నుంచి 6.85% మధ్య వడ్డీ ఆదాయం పొందుతున్నారు.
మరో ఆసక్తికర కథనం: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా?, వివిధ బ్యాంక్‌ల్లో కొత్త వడ్డీ రేట్లు ఇవి