Mutual Funds SIP: కొత్త సంవత్సరంలో (New Year 2024) చాలా మంది సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమంది చెడు అలవాట్లను వదిలేస్తారు, మరికొందరు ఆరోగ్యకరమైన అలవాట్లను స్టార్ట్‌ చేస్తారు, ఎక్కువ ప్రదేశాలకు టూర్‌ వెళ్లాలని కోరుకుంటారు. ఇంకొందరు పెట్టుబడి (Investment), పొదుపు (Savings) చేయాలని, ఎక్కువ డబ్బు సంపాదించాలని కూడా తీసుకుంటారు.


కొత్త సంవత్సరంలో, డబ్బు కలిసొచ్చే పని చేయాలని మీరు కూడా ఆలోచిస్తుంటే, మా దగ్గర ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (Investment in 2024) ఉంది. 


2024 సంవత్సరంలో, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతి నెలా రూ. 2024 పెట్టుబడి పెట్టాలని మీరు నిర్ణయం తీసుకోవచ్చు. దీని అర్థం, ప్రతి రోజూ కేవలం రూ. 67 ఆదా చేస్తే చాలు. ఇంత తక్కువ మొత్తంతో, దీర్ఘకాలంలో మీరు చాలా పెద్ద కార్పస్‌ ఫండ్‌ ‍‌సృష్టించొచ్చు. 


రోజుకు దాదాపు 67 రూపాయలు ఆదా చేసి, ప్రతి నెలా రూ. 2024 పెట్టుబడి పెడితే... వచ్చే 24 ఏళ్లలో ఎంత మీరు కోటి రూపాయలను క్రియేట్‌ చేయవచ్చు.


SIP ద్వారా రూ.1 కోటి కార్పస్‌ని సృష్టించడం ఎలా? ‍‌(How to create a corpus of Rs.1 Crore through SIP?)


సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా మదుపు చేసే డబ్బు మ్యూచువల్‌ ఫండ్స్‌ (Mutual Funds) లోకి వెళ్తుంది. ఫండ్‌ మేనేజర్‌ ఆ డబ్బును వివిధ రకాల మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్స్‌లోకి పంప్‌ చేస్తారు, మంచి రిటర్న్స్‌ (Returns) రాబట్టేందుకు ప్రయత్నిస్తారు. 


దీర్ఘకాలంలో, మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి 12 శాతం ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉందని చరిత్ర చెబుతోంది. 


మీరు ప్రతి నెలా రూ. 2024 SIP చేసి, ప్రతి సంవత్సరం 12 శాతం వార్షిక రాబడిని (annual return) సంపాదిస్తే, 24 సంవత్సరాలలో మీ పెట్టుబడి కోటి రూపాయలకు పైగా పెరుగుతుంది. 


దీని కోసం మీరు స్టెప్ అప్ సిప్‌ను (Step Up SIP) అప్లై చేయాలి. స్టెప్‌ అప్‌ సిప్‌ అంటే... సిప్‌లో పెట్టే పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లడం. స్టెప్‌ అప్‌ SIPలో, ప్రతి సంవత్సరం మీ పెట్టుబడిని 13 శాతం చొప్పున పెంచుకుంటూ వెళ్లాలి. దానిపై 12 శాతం రాబడిని పొందాలి. ఇలా చేస్తే.. 24 సంవత్సరాలలో, మీరు ఆశించిన రాబడి రూ. 1 కోటి కంటే ఎక్కువే ఉంటుంది.


ఈ పద్ధతిలో, 24 సంవత్సరాల్లో మీరు పెట్టిన పెట్టుబడి దాదాపు రూ. 33,85,519 అవుతుంది. మీకు వచ్చిన మూలధన లాభం ‍‌(Capital gain) రూ. 66,94,663 అవుతుంది. మొత్తం కలిపి రాబడి రూ. 1,00,80,182 అవుతుంది.


ఈ రోజుల్లో నెలకు రూ. 2024, అంటే రోజుకు రూ. 67 ఆదా చేయడం చాలా చిన్న విషయం. ఇలాంటి చిన్న విషయంతో భవిష్యత్తును బ్రహ్మాండంగా మార్చే అవకాశం ఉంది. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లో ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: NPS అకౌంట్‌ నుంచి డబ్బు తీసుకోవాలా?, ఫిబ్రవరి నుంచి కొత్త రూల్స్‌