అవును, జూన్ 1 నుండి కొన్ని కొత్త ఆదాయపు పన్ను చట్టాలు అమలులోకి వస్తున్నాయి. ఇది ముఖ్యంగా వేతన జీవులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
June 1 Rule Changes 2026:బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
జూన్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న ఐదు అతిపెద్ద ఆర్థిక మార్పులు సమగ్రవిశ్లేషణ. ఐటీ మిహనాయింపులు, యూపీఐ కొత్త ఫీచర్లు, ఏటీఎం ఛార్జీలు,గ్యాస్ ధరలపై మీ జేబుకు కనెక్ట్ అయ్యే పూర్తి వివరాలు.

- జూన్ 1 నుంచి ఆదాయపు పన్ను, యూపీఐ సెక్యూరిటీలో మార్పులు.
- ఉద్యోగులకు చిల్డ్రన్ ఎడ్యుకేషన్, హెచ్‌ఆర్‌ఏ అలవెన్స్ పెంపు.
- అడ్వాన్స్ టాక్స్ చెల్లింపు గడువు జూన్ 15 వరకు.
- యూపీఐ లావాదేవీల్లో మోసాలను అరికట్టేందుకు కొత్త నియమాలు.
- ఏటీఎం ఛార్జీలు, ఎల్పీజీ ధరలలో మార్పులు రానున్నాయి.
June 1 Rule Changes 2026: మనం దేశంలో ప్రతి నెల ఒకటో తేదీని కొన్ని రూల్స్ మారడం సహజం. కానీ జూన్ 1 చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త ఆదాయపు పన్ను చట్టాలు క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అమల్లోకి రానున్నాయి డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట వేసేలా ఆర్బీఐ ఒక్క యూపీఐ సెక్యూరిటీ అప్‌డేట్స్ తీసుకురావడం వంటివన్నీ ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. వీకెండ్ మూడ్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆ ఐదు పెద్ద మార్పులను ఇప్పుడు తెలుసుకోండి.
శాలరీడ్ ఉద్యోగులకు భారీ ఊరట
పాత పన్ను విధానంలో కొనసాగుతున్న లక్షలాది మంది వేతన జీవులకు ఈ జూన్ 1 ఒక తీపి కబురు లాంటిది. దశాబ్దాలుగా మారకుండా ఉన్న కొన్ని కీలకమైన అలవెన్సుల మినహాయింపు పరిమితులను ప్రస్తుతం ద్రవ్యోల్బణం, మార్కెట్ ధరలకు అనుగుణంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ భారీగా సవరించింది. ఈసవరించిన రూల్స్ జూన్ 1 నుంచి శాలరీ స్ట్రక్చర్‌లో స్పష్టం కనిపించబోతున్నాయి.
చిల్డ్రన్ ఎడ్యుకేషన్- హాస్టల్ అలవెన్స్ పెంపు
ఇప్పటి వరకు ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పిల్లల చదువు కోసం ఇచ్చే అలవెన్స్‌పై నెలకు కేవలం వంద రూపాయలు మాత్రమే పన్ను మినహాయింపు ఉండేది. నేటి కాలంలో వంద రూపాయలకు కనీసం నోట్‌బుక్ కూడా రావడం లేదు. అందుకే ప్రభుత్వం ఈ పరిమితని ఏకంగా మూడు వేలకు పెంచింది. అంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఏడాదికి పెద్ద మొత్తంలో టాక్స్ సేవ్ అవుతుంది. అలాగే, హాస్టల్ అలవెన్స్ మినహాయింపు, నెలకు 300 నుంచి ఏకంగా నెలకు 9వేలకి పెంచారు.
భాగ్యనగర వాసులకు హెచ్‌ఆర్‌ఏ పండుగ
ఇప్పటి వరకు మెట్రో నగరాల కేటగిరి కింద కేవలం ఢిల్లీ , ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో నివసించే వారికి మాత్రమ బేసిక్ శాలరీలో 50 శాతం హెచ్‌ఆర్ మినహాయింపు లభించేది. ఐటీ హబ్‌గా మారిన హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ నగరాలు ఇప్పటి వరకు 40 శాతం కేటగిరిలో ఉండేవి. కానీ జూన్ 1 నుంచి హైదరాబాద్ కూడా 50 శాతం హెచ్‌ఆర్‌ఏ కేటగిరిలోకి చేర్చారు. దీని వల్ల గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టాప్ ఐటీ కంపెనీల ఉద్యోగులతోపాటు నగరంలో అద్దె ఇళ్లల్లో ఉండే ప్రతి ఉద్యోగికి పన్ను భారం భారీగా తగ్గి చేతికి వచ్చే జీతం పెరుగుతుంది.
ఫ్రీ మీల్స్ వోచర్ పరిమితి పెంపు
ఆపీసుల్లో ఉద్యోగులకు ఇచ్చే ఫుడ్ కూపన్లు, లేదా మీల్స్ ఓచ్లపై పన్ను రహిత పరిమితిని గతంలో ఉన్న 50 నుంచి 200 రూపాయలకు ప్రతి మీల్‌కు పెంచారు.
జూన్ 15లోపు అడ్వాన్స్ టాక్స్ కట్టాల్సిందే!
కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025/2026 ఫ్రేమ్ వర్క్ ప్రకారం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత అడ్వాన్స్ టాక్స్ చెల్లించడానికి జూన్ 15, 2026 చివరి తేదీ. అయితే దీనికి సంబంధించిన లెక్కింపు ఫైనాన్షియల్ ప్లానింగ్ జూన్ 1 నుంచే ప్రారంభమవుతుంది.
ఎవరెవరు అడ్వాన్స్ టాక్స్ చెల్లించాలి?
ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి లేదా వ్యాపార సంస్థ నిరక లయబిలిడీ అన్ని రకాల టీడీఎస్ మినహయింపులు పోను పదివేలు లేదా అంత కంటే ఎక్కువ ఉంటే వారు కచ్చితంగా ముందస్తు పన్ను చెల్లించాలి. జూన్ 15 లోపు మొత్తం పన్నులో 15 శాతం ప్రభుత్వానికి కట్టేయాలి. ఒక వేళ మీరు జూన్ 15 లోపు ఈ 15 శాతం ముందస్తు పన్ను చెల్లించకుంటే ఐటీ పన్ను చట్టం సెక్షన్ 234c ప్రకారం ప్రతి నెల 1శాతం చొప్పున వడ్డీ పెనాల్టీ పడుతుంది. కాబట్టి చిన్న వ్యాపారస్తులు, ఫ్రీలాన్సర్లు, అదనపు ఆదాయ వనరులు ఉన్న వారు జూన్ 1 నుంచే అడ్వాన్స్ టాక్స్ సిద్ధం చేసుకోవడం మంచిది.
యూపీఐలో కొత్త సెక్యూరిటీ ఫీచర్
నేడు భారత్‌లో పల్లెటూరి కిరణా కొట్టు నుంచి సిటీలోని పెద్ద మాల్ వరకు ప్రతి ఒక్కరూ గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ వాడుతున్నారు. అయితే దీనిని ఆసరగా చేసుకొని సైబర్ నేరగాళ్లు నకిలీ పేర్లతో అకౌంట్లు క్రియేట్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా నేషల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ కలిసి జూన్ 1 నుంచి ఒక పవర్‌ఫుల్ రూల్ తీసుకొచ్చాయి.
ఇకపై మీరు ఎవరికైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా లేదా మొబైల్ నెంబర్ నుంచి డబ్బులు పంపించినా సదరు వ్యక్తి తన యూపీఐ యూప్‌లో ఏం పేరు పెట్టుకున్నాడనేది అనవసరం.అతని బ్యాంకు ఖాతాలో ఉన్న అసలు పేరు మాత్రమే మీ మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీని వల్ల పొరపాటున రాంగ్ నెంబర్‌కు డబ్బులు పంపే ఛాన్స్ ఉండదు. ఫిషింగ్, నకిలీ కస్టమర్ కేర్ మోసాలకు చెక్ పెట్టవచ్చు.
పెరగనున్న ఏరియా ఏటీఎం ఛార్జీలు
డిజిటల్ విప్లవం ఎంత వేగంగా దూసుకుపోతున్న, అత్యవసర సమయాల్లో నగదు కోసం మనం ఏటీఎంలపై ఆధారపడక తప్పదు. అయితే జూన్ 1 నుంచి సంప్రదాయ బ్యాంకింగ్ కాస్త ఖరీదు కాబోతోంది. దేశంలోని కొన్ని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు వాణిజ్య బ్యాంకులు తమ ఏటీఎం లావాదేవీల ఛార్జీలను సవరిస్తున్నాయి.
సాధారణంగా ప్రతి బ్యాంక్ తమ ఖాతాదారులకు నెలకు 3 నుంచి ఐదు ఉచిత ఏటీఎం లావాదేవీలను అందిస్తుంది. అయితే జూన్ 1 నుంచి ఈ ఉచిత పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి లావాదేవీపై ఛార్జీలు పెరగనున్నాయి. క్యాష్ తీసుకోవాలంటే ఇప్పటి వరకు పరిమితి దాటితే 21+ వసూలు చేసే వారు ఇప్పుడు అది 23+ అవుతుంది. అంటే 23 రూపాయలతోపాటు ట్యాక్స్ అదనంగా వసూలు చేస్తారు. మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ చెక్ చేయాలంటే పది రూపాయల నుంచి 12 రూపాయల వరకు పెంచనున్నారు.
ఎల్పీజీ గ్యాస్ ధరల సమీక్ష
ప్రతి నెల ఒకటో తేదీన దేశవ్యాప్తంగా కోట్ల మంది గృహిణులు, హోటల్ నిర్వాహకులు ఆసక్తిగా ఎదురు చూసేది గ్యాస్ సిలిండ్ ధరలు గురించి. జూన్ 1న ఉదయం ఆరు గంటలకే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సరికొత్త ఎల్పీజీ ధరలను ప్రకటించనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు ఆధారంగా కమర్షియల్, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తారు. ఈసారి వేసవి కాలం డిమాండ్, అంతర్జాతీయ పరిణామాల వల్ల కమర్షియల్ గ్యాస్ ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సీఎన్జీ, పీఎన్జీ ధరల్లో మార్పులు వస్తాయని చెబుతున్నారు.
స్మాల్ సేవింగ్ రేట్లపై క్లారిటీ
మరోవైపు కేంద్ర ప్రభుత్వం పీపీఎఫ్, సుకన్య సమృద్ది యోజన,నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రస్తుత క్వార్టర్‌కు యథాతథంగా ఉంచింది. కాబట్టి జూన్ నెలలో మీ పొదుపు పథకాలపై వచ్చే వడ్డీలో ఎలాంటి మార్పు ఉండు. పాత రేట్ల కొనసాగుతాయి.
Before You Go
Budget 2026 - 2027 Top 10 Points | కేంద్ర బడ్జెట్ లో పది ముఖ్యమైన అంశాలు
Frequently Asked Questions
జూన్ 1 నుండి ఆదాయపు పన్ను చట్టాలలో ఏమైనా మార్పులు వస్తున్నాయా?
పిల్లల విద్య, హాస్టల్ అలవెన్స్‌లపై పన్ను మినహాయింపు ఎలా మారుతుంది?
పిల్లల విద్య అలవెన్స్‌పై నెలకు రూ. 100 నుంచి రూ. 3,000 వరకు, హాస్టల్ అలవెన్స్‌పై నెలకు రూ. 300 నుంచి రూ. 9,000 వరకు పన్ను మినహాయింపు పరిమితి పెంచబడింది.
హైదరాబాద్‌లో హెచ్‌ఆర్‌ఏపై పన్ను మినహాయింపు ఎలా మారుతుంది?
జూన్ 1 నుంచి హైదరాబాద్ కూడా మెట్రో నగరాల కేటగిరిలోకి చేర్చబడుతుంది. దీంతో బేసిక్ శాలరీలో 50 శాతం హెచ్‌ఆర్‌ఏపై పన్ను మినహాయింపు లభిస్తుంది.
యూపీఐ చెల్లింపులలో భద్రతాపరమైన మార్పులు ఏమిటి?
జూన్ 1 నుండి, యూపీఐలో డబ్బు పంపినప్పుడు, గ్రహీత పేరుతో పాటు అతని బ్యాంకు ఖాతాలోని అసలు పేరు కూడా కనిపిస్తుంది. ఇది మోసాలను అరికట్టడంలో సహాయపడుతుంది.
ఏటీఎం ఛార్జీలలో ఏమైనా మార్పులు ఉన్నాయా?
అవును, జూన్ 1 నుండి, ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి లావాదేవీపై ఛార్జీలు పెరగనున్నాయి. నగదు విత్‌డ్రాకు రూ. 23+, మినీ స్టేట్మెంట్‌కు రూ. 12+ వరకు ఛార్జీలు ఉండవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















