LPG Gas Cylinder Gas Checking Process: ఒకప్పుడు భారత్‌లో వంట మట్టి పొయ్యిలపై చేసేవారు. కానీ ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్‌లను ఉపయోగించి వంట చేస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా గ్యాస్ సిలిండర్‌లను అందించడానికి ప్రభుత్వం ఇప్పుడు ఉజ్వల పథకాన్ని అమలు చేస్తోంది.
గ్యాస్ సిలిండర్ వాడటం వల్ల వంట త్వరగా, సురక్షితంగా జరుగుతుంది. అందువల్ల, గ్యాస్ సిలిండర్ల వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, చాలా సార్లు, ప్రజలు గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేస్తారు, ఫలితంగా నష్ట పోతుంటారు.
చాలా సార్లు, లీకేజీ సిలిండర్‌లు ఇంటికి వస్తుంటాయి. ఫలితంగా చాలా గ్యాస్ పోతుంది. అలాంటి పరిస్థితుల్లో సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉందో తెలియదు. గ్యాస్ సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉందో, దానిని ఎలా తనిఖీ చేయాలో ఇక్కడ చూద్దాం.
ముందుగా, ఒక సిలిండర్ బరువు ఎంత ఉంటుందో ముందుగా తెలుసుకోవాలి. మీరు ఇంటిలో ఉన్న ఖాళీ సిలిండర్‌ను చూడండి. దాని బరువు సుమారు 15 నుంచి 16 కిలోగ్రాములు. దానిలోని గ్యాస్ బరువు 14.02 కిలోగ్రాములు. అంటే మొత్తం సిలిండర్ బరువు 29 నుంచి 30 కిలోగ్రాముల మధ్య ఉంటుంది. మీరు సిలిండర్‌ను రిసీవ్ చేసుకున్నప్పుడు దానిపై ఉన్న టారే వెయిట్(TW) లేబుల్‌ను చెక్ చేయండి. TW 14.2 కిలోలు ఉంటుంది.
కానీ అలా రాసి ఉన్నంత మాత్రాన అంత బరువు ఉంటుందని నమ్మకం ఉండదు. సిలిండర్ బరువును కొలవడానికి ఎలక్ట్రానిక్ తూకం యంత్రాన్ని ఉపయోగించండి. అది 29 కిలోగ్రాముల కంటే తక్కువ బరువు ఉంటే, మీ సిలిండర్ లీక్ అవుతోందని లేదా లీక్ అయిందని అర్థం చేసుకోండి. ఇలా జరిగితే, సిలిండర్‌ను తిరిగి పంపించండి. డెలివరీ బాయ్‌కి రిపోర్ట్ చేయండి. వేరే సిలిండర్ ఇవ్వమని చెప్పండి. మీరు మీ LPG డిస్ట్రిబ్యూటర్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చు లేదా కస్టమర్ సర్వీస్‌కు కాల్ చేయవచ్చు.
