Latest Interest Rates on Property Loans: బ్యాంక్‌లు లేదా ఫైనాన్స్ కంపెనీలు ఇచ్చే అనేక రకాల రుణాల్లో తనఖా రుణం ఒకటి. ఏదైనా ఆస్తిని తాకట్టు పెట్టుకుని బ్యాంక్‌లు/ఫైనాన్స్ కంపెనీలు లోన్ (Loan Against Property - LAP) మంజూరు చేస్తాయి. మీకు ఇల్లు, ఖాళీ స్థలం (Plot) లేదా అపార్ట్‌మెంట్ (Flat) ఉంటే.. ఆ ఆస్తిని తనఖా పెట్టి లోన్ తీసుకోవచ్చు. ఇవి సురక్షిత రుణాలు (Secured loans or Collateral Loans) కాబట్టి, బ్యాంక్‌లు/ఫైనాన్స్ కంపెనీలు తక్కువ వడ్డీ రేట్లకే లోన్‌లు అందిస్తాయి. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా ఈ తరహా లోన్‌లు పొందడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే, క్రెడిట్ స్కోరు బాగుంటే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. కనీస పేపర్ వర్క్‌తో లోన్ సులభంగా పొందవచ్చు.
బ్యాంక్‌లు/ఫైనాన్స్ కంపెనీల్లో తనఖా రుణాలపై ప్రస్తుత వడ్డీ రేట్లు
- టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ (Tata Capital Housing Finance), ప్రస్తుతం, అన్ని బ్యాంక్‌లు & హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో పోలిస్తే అతి తక్కువ వడ్డీ రేట్లకు ఆస్తిపై లోన్ ఆఫర్ చేస్తోంది. ఈ ఫైనాన్స్ కంపెనీ LAP రేట్లు 9.00 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి.
- పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ (PNB Housing Finance) --- 9.24 శాతం నుంచి 15.00 శాతం మధ్య ఉన్నాయి.
- ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank) --- 9.25 శాతం నుంచి ప్రారంభం
- ఎస్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (LIC Housing Finance) --- 9.25 శాతం నుంచి 11.55 శాతం వరకు
- ఎల్&టీ ఫైనాన్స్ (L&T Finance) --- 9.50 శాతం నుంచి ప్రారంభం
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) --- 9.50 శాతం నుంచి 13.30 శాతం వరకు
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) --- 9.50 శాతం నుంచి 12.75 శాతం వరకు
- బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda - BoB) --- 9.70 శాతం నుంచి 18.35 శాతం వరకు
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India - SBI) --- 9.75 శాతం నుంచి 11.05 శాతం వరకు
- గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్ (Godrej Housing Finance) --- 9.75 శాతం నుంచి ప్రారంభం
- బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India - BoI) --- 9.85 శాతం నుంచి 13.70 శాతం వరకు
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank - PNB) --- 10.15 శాతం నుంచి 14.00 శాతం వరకు
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India - UBI) --- 10.20 శాతం నుంచి 12.85 శాతం వరకు
- కరూర్ వైశ్యా బ్యాంక్ (Karur Vysya Bank - KVB) --- 10.20 శాతం నుంచి 13.40 శాతం వరకు
- యూకో బ్యాంక్ (UCO Bank) --- 10.25 శాతం నుంచి 12.50 శాతం వరకు
- యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) --- 10.50 శాతం నుంచి 10.95 శాతం వరకు
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank of Maharashtra - BoM) --- 10.70 శాతం నుంచి 11.70 శాతం వరకు
- ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) --- 10.85 శాతం నుంచి 12.50 శాతం వరకు
- ఫెడరల్ బ్యాంక్ (Federal Bank) --- 12.35 శాతం నుంచి ప్రారంభం
గుర్తుంచుకోవాల్సిన విషయాలుమీరు ఏదైనా ఆస్తిని తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాలంటే మొట్టమొదట గుర్తుంచుకోవాల్సి విషయం - ఆ ఆస్తి తప్పనిసరిగా మీ పేరు మీద ఉండాలి. మీ కుటుంబ సభ్యుడి/సభ్యురాలి పేరు మీద ఆస్తి ఉంటే మీకు రుణం మంజూరు కాదు, కుటుంబ సభ్యుడి/సభ్యురాలి పేరిట లోన్ తీసుకోవాలి. ఆ ఆస్తిపై ఎలాంటి వివాదాలు ఉండకూడదు & ఆస్తి పూర్తిగా చట్టబద్ధంగా ఉండాలి. తనఖా పెట్టబోయే ఆస్తికి అన్ని రకాల అనుమతులు మంజూరై ఉండాలి. లోన్ మంజూరైనప్పుడు, మీ వెసులుబాటును బట్టి EMI కాలవ్యవధిని 7 నుంచి 20 సంవత్సరాల వరకు ఎంచుకోవచ్చు.
ప్రాసెసింగ్ ఫీజ్‌ప్రాపర్టీ లోన్ మంజూరు చేసే బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ విచక్షణ ఆధారంగా మీకు లోన్ మంజూరు అవుతుంది. మీ లోన్ దరఖాస్తును తిరస్కరించే అధికారం కూడా వాటికి ఉంటుందని గుర్తుంచుకోండి. సాధారణంగా, మంజూరైన లోన్ మొత్తంపై 1-3% మధ్యలో ప్రాసెసింగ్ ఫీజ్ ఉంటుంది.