అన్వేషించండి

Real Estate Investment: స్థలం కొంటే లాభమా? ఇల్లు కొంటే మేలా? రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌లో ఉన్న సవాళ్లు ఏంటీ?

Real Estate Investment:గత పదేళ్లలో దేశంలోని ప్రధాన నగరాల్లో నివాస గృహాల ధరలు ద్రవ్యోల్బణాన్ని మించి పెరిగాయని, కొన్ని ప్రాంతాల్లో ఏకంగా వంద శాతానికి పైగా వృద్ధి నమోదైందని నిపుణులు చెబుతున్నారు.

Real Estate Investment:రియల్ ఎస్టేట్ రంగం ఎప్పుడూ ఒక హాట్‌టాపిక్‌. ముఖ్యంగా మధ్యతరగతి, సంపన్న వర్గాలకు పెట్టుబడి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది భూమి లేదా ఇల్లు. అయితే మారుతున్న మలిక సదుపాయాలు, కొత్త నిబంధనలు, మార్కెట్‌ పోకడలతో పెట్టుబడి ఎక్కడ ఎలా పెట్టాలనే ప్రశ్న ప్రతి ఇన్వెస్టర్‌ను వేధిస్తోంది. ఖాళీ స్థలాలు కొనుగోలు చేయడం ద్వారా వచ్చే భారీ లాభాలు ఒకవైపు  ఆకర్షిస్తుంటే, రెడీ టు మూవ్ ఇళ్లు  లేదా అపార్టమెంట్‌ ద్వారా వచ్చే స్థిరమైన ఆదాయం, భద్రత మోరవైపు ఊరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ పెట్టుబడి పెడితే లాభదాయకంగా ఉంటుందనే విషయాలు తెలుసుకుందాం. 
 
పెట్టుబడిపై వచ్చే రాబడి విషయంలో స్థలం, ఇల్లు వేర్వేరు ధోరణులను కలిగి ఉన్నాయి. గత పదేళ్లలో దేశంలోని ప్రధాన నగరాల్లో నివాస గృహాల ధరలు ద్రవ్యోల్బణాన్ని మించి పెరిగాయని, కొన్ని ప్రాంతాల్లో ఏకంగా వంద శాతానికి పైగా వృద్ధి నమోదైందని నిపుణులు చెబుతున్నారు. స్థిరమైన డిమాండ్ ఉన్న చోట్ల ఇళ్ల ధరలు నిలకడగా పెరుగుతూ ఇన్వెస్టర్లకు భరోసా ఇస్తాయి. మరోవైపు లగ్జరీ హౌసింగ్ విభాగంలో బ్రాండెడ్‌ నివాసాలకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. పరిమిత సరఫరా వినూత్న డిజైన్ల వల్ల నార్త్ గోవా వంటి ప్రాంతాల్లో లగ్జరీ ఇళ్లు మార్కెట్‌ సగటు కంటే ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతున్నాయని నిపుణులు అంటున్నారు. 
 
ఖాళీ స్థలాల విషయంలో కథ కొంచెం భిన్నంగా ఉంది. భూమి ధరల పెరుగుదల అనేది మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాలు, సాంస్కృతిక కేంద్రాల్లో భూమి ధరలు ఊహించని విధంగా పెరిగాయి. కనెక్టివిటీ మెరుగుపడటం, ప్రభుత్వ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి దీనికి ప్రధాన కారణాలు. 
 
మెట్రో విస్తరణ, ఎక్స్‌ప్రెస్‌వేలు, కమర్షియల్‌ హబ్‌లు ప్రారంభమయ్య ప్రారంభ దశలో భూమిపై పెట్టుబడి పెడితే భారీ లాభాలు ఉంటాయని రియల్ ఎస్టేట్‌ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో చూసుకుంటే మెట్రో మార్గం విస్తరణకు ఇంకా ఆమోదం లభించలేదు. అయినా సరే విస్తరణ జరుగుతుందని ప్రచారంలో ఉన్న ప్రాంతాల్లో భూముల రేట్లు అమాంతం పెరిగాయి. భూమి ధరల పెరుగుదల అనేది కేవలం అదృష్టంపై కాకుండా పాలన, జోనింగ్ నిబంధనలు అమలుపై ఆధారపడి ఉంటుంది. 

త్వరలో అమ్ముడయ్యేవి ఏవి?

పెట్టుబడి పెట్టిన తర్వాత అవసరానికి దాన్ని నగదుగా మార్చుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో నివాస గృహాల, భూమి కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా రెడీ టూ మూవ్‌ ఇళ్లు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారని రియల్‌ ఎస్టేట్ సంస్థలు చెబుతున్నాయి.  భూమిని కొని అమ్మడం కొంత సమయం పడుతుందని అంటున్నారు. బ్రాండెడ్‌ డెవలపర్లు, డిజిటల్ పద్ధతుల్లో పక్కా డాక్యుమెంట్లతో విక్రయించే ప్లాట్లకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. అయినప్పటికీ ఇళ్లతో పోలిస్తే భూమిని నగదుగా మార్చుకోవడానికి ఎక్కువ ఓపిక అవసరమని అంటున్నారు. 

పన్ను సహా ఇతర రూల్స్‌

ఇన్వెస్టర్లు గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం పన్ను ప్రయోజనాలు. నివాస గృహాలపై తీసుకున్న హోమ్‌లోన్లకు వడ్డీ అసలుపై పన్ను మినహాయింపులు లభిస్తాయి. అలాగే, రెరా చట్టం అమలులోకి వచ్చిన తర్వాత అపార్టమెంట్‌ కొనుగోలుదారులకు రక్షణ పెరిగిందని, పారదర్శక పెరిగింది. ఇళ్లు లేదా ఫ్లాట్ల ద్వారా వచ్చే ఆదాయం, పెట్టుబడిపై వచ్చే లాభాల విషయంలో స్పష్టమైన పన్ను విధానాలు ఉన్నాయి. అదే భూమి విషయానికి వస్తే, అద్దె ఆదాయం వంటి పన్ను మినహాయింపులు ఉండవు. కేవలం భూమిని విక్రయించినప్పుడు వచ్చే లాభాలపై మాత్రమే పన్నులు ఉంటాయి. అలాగే భూమి వినియోగ మార్పిడి, స్థానిక అధికారుల అనుమతుల విషయంలో భూమి పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టైటిల్ క్లియర్‌గా లేకపోతే లావాదేవీల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. 

రిస్క్, పెట్టుబడి ప్రొఫైల్‌

నివాస గృహాలు అనేవి స్థిరత్వానికి సంకేతం కాగా, భూమి అనేది ఓపికకు పరీక్ష. ఇళ్లు తక్షణమే నివసించడానికి ఉపయోగపడతాయి. అద్దె ద్వారా ఆదాయాన్ని ఇస్తాయి. కానీ వీటికి నిర్వహణ ఖర్చులు ఉంటాయి. కాలక్రమేణా కట్టడం పాతబడి విలువ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఉండే లగ్జరీ ఇళ్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. భూమి అనేది దీర్ఘకాలిక సంపద సృష్టికి సాధనం. భూమికి నిర్వహణ ఖర్చులు ఉండవు. కానీ దాని విలువ పెరగడానికి ప్రభుత్వం అక్కడ మౌలిక సదుపాయాలను ఎప్పుడూ అభివృద్ధి చేస్తుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. భూమి విషయంలో రిస్క్ ఎక్కువ ఉన్నప్పటికీ సరైన సమయంలో సరైన చోట భూమిని కొనుగోలు చేస్తే లాభాలు అపార్ట్మెంట్ల కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. 

పెట్టుబడిదారులు ఏం చేయాలి

పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాలు, కాలపరిమితిని బట్టి ఈ రెండింటినీ సమతుల్యం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్థిరమైన ఆదాయం, తక్కువ రిస్క్ కోరుకునే వారు నివాస గృహాలను ఎంచుకోవచ్చు. అదే విధంగా భారీ లాభాల కోసం వేచి చూడగలిగే ఓపిక, రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్న వారు అభివృద్ధి  చెందుతున్న ప్రాంతాల్లోని భూమిని ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. పెట్టుబడిలో కొంత ఇళ్లకు, మరికొంత భూమికి కేటాయిస్తే రిస్క్ తగ్గుతుందని లాభాలు పెంచుకోవచ్చని నిపుణుల అభిప్రాయం. 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Jubilee Hills traffic: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Jubilee Hills traffic: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
Iran Israel War 2026: ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
Rajinikanth - Shah Rukh Khan: కమల్ తర్వాత షారుఖ్‌తో... అనిరుధ్ డ్రీమ్ కాంబో - రజనీతో మల్టీస్టారర్ సెట్టయ్యేనా?
కమల్ తర్వాత షారుఖ్‌తో... అనిరుధ్ డ్రీమ్ కాంబో - రజనీతో మల్టీస్టారర్ సెట్టయ్యేనా?
టీ20లో టీమిండియా నెంబర్ 1 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన SKY
టీ20లో టీమిండియా నెంబర్ 1 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన SKY
Ugadi Panchangam 2026: పరాభవ నామ సంవత్సరం సింహ రాశి ఉగాది ఫలితాలు! ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?
పరాభవ నామ సంవత్సరం సింహ రాశి ఉగాది ఫలితాలు! ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?
Embed widget