By: Raja Sekhar Allu | Updated at : 14 Oct 2025 06:43 PM (IST)
1638 క్రెడిట్ కార్డులతో మనీష్ గిన్నిస్ రికార్డ్ - ఒక్క రూపాయి అప్పులేదు కానీ వాటితో ఆదాయమే ఆదాయం ! ( Image Source : Other )
Indian man sets Guinness World Record by holding 1638 Credit Cards: రెండు, మూడు క్రెడిట్ కార్డులు ఉంటేనే వాటిని సరిగ్గా నిర్వహించడం పెను సవాల్ అవుతుంది. అలాంటిది మనీష్ ధమేజా అనే వ్యక్తి మాత్రం అత్యధిక క్రెడిట్ కార్డులు ఉన్న వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు .హైదరాబాద్‌లో నివసించే మనీష్, క్రెడిట్ కార్డులను కేవలం షాపింగ్ లేదా బిల్ పేమెంట్స్‌కు మాత్రమే కాకుండా, స్మార్ట్ ఎర్నింగ్ టూల్స్‌గా మార్చుకున్నాడు. జీరో డెట్‌తో అన్ని కార్డులను మేనేజ్ చేస్తూ, రివార్డ్ పాయింట్స్, క్యాష్‌బ్యాక్‌లతో లైఫ్‌స్టైల్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఏప్రిల్ 30, 2021న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా ఈ రికార్డ్ అధికారికంగా గుర్తించారు.
మనీష్ ధమేజా హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. కాన్పూర్‌లోని CSJM యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో BCA; లక్నోలోని ఇంటిగ్రల్ యూనివర్సిటీ నుంచి MCA; IGNOU నుంచి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ డిగ్రీలు తీసుకున్నాడు. క్రెడిట్ కార్డుల పట్ల అతనికి మక్కువ ఎక్కువ. మనీష్ 1,638 వ్యాలిడ్ క్రెడిట్ కార్డులను వివిధ బ్యాంకులు సంస్థల నుంచి తీసుకున్నాడు. అవన్నీ యాక్టివ్‌గా ఉపయోగిస్తున్నాడు. వాటిని కేవలం తీసుకోవడం కాదు.. రివార్డులు మాక్సిమైజ్ చేయడానికి ఉపయోగిస్తాడు. అన్ని కార్డులు జీరో డెట్‌తో మేనేజ్ చేస్తాడు.
మనీష్ తన క్రెడిట్ కార్డులను స్మార్ట్‌గా ఉపయోగించి, రివార్డ్ పాయింట్స్, క్యాష్‌బ్యాక్, ఎయిర్‌మైల్స్, ట్రావెల్ బెనిఫిట్స్, హోటల్ ప్రివిలేజెస్ పొందుతాడు. ట్రావెలింగ్, రైల్వే లాంజ్, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఫుడ్, స్పా సర్వీసెస్, హోటల్ ఓచర్లు, డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్లు, షాపింగ్ ఓచర్లు, మూవీ టికెట్లు ఇలా స్పెండింగ్ మైల్‌స్టోన్స్ చేరుకోవడం ద్వారా ఈ రివార్డులు పొందుతాడు. క్రెడిట్ కార్డులను స్పెండింగ్ టూల్స్‌గా కాకుండా, ఎర్నింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌గా మార్చాడు.
2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినప్పుడు బ్యాంకులు, ATMల వద్ద లాంగ్ క్యూలు ఏర్పడ్డాయి. కానీ మనీష్ ధమేజాకు ఈ సమస్యలు లేవు. క్రెడిట్ కార్డులతోనే తన అవసరాలు తీర్చుకున్నాడు. క్రెడిట్ కార్డులు తన జీవితంలో ముఖ్య పాత్ర పోషించాయని ఆయన చెప్పుకుంటాడు.
"నా జీవితం క్రెడిట్ కార్డులు లేకుండా అసంపూర్ణంగా ఉంది. నేను క్రెడిట్ కార్డులను ప్రేమిస్తాను. మైల్‌స్టోన్ చేరుకోవడం ద్వారా కాంప్లిమెంటరీ ట్రావెలింగ్, రైల్వే లాంజ్, ఎయిర్‌పోర్ట్ లాంజ్, ఫుడ్, స్పా, హోటల్ వౌచర్లు, డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్లు, షాపింగ్ , మూవీ టికెట్లు, గోల్ఫ్ సెషన్స్, ఫ్యూయల్ వంటివి ఎంజాయ్ చేస్తాను – రివార్డ్ పాయింట్స్, ఎయిర్‌మైల్స్, క్యాష్‌బ్యాక్ ద్వారా." అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు మనీష్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
During India’s 2016 demonetisation, when the country faced a cash shortage, Manish relied on his credit cards and managed his expenses through digital payments with ease. For him, credit cards are more than financial tools. They are a way of life. pic.twitter.com/g7V8Sztl1Z
— Fact Point (@FactPoint) October 10, 2025
టెక్నాలజీ, ఫైనాన్స్‌ను స్మార్ట్‌గా ప్లాన్ చేస్తే, సాధారణ వస్తువులను అసాధారణమైనవిగా మార్చవచ్చని మనీష్ నిరూపించారు.
Gold Investment: డిజిటల్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి సెబీ హెచ్చరిక.. వినకపోతే రిస్క్ తప్పదు
Bank Holiday: నేడు బ్యాంకు తెరిచి ఉంటుందా లేదా హాలిడేనా? వెళ్లే ముందు సెలవుల జాబితా చూడండి
Wedding Loan : పెళ్లి కోసం లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలివే, మిస్ చేయకండి
Education Loan Interest Rates:ఉన్నత చదువుల కోసం లోన్ ట్రైన్ చేస్తున్నారా? ఏ బ్యాంకు ఏ వడ్డీ రేటుకు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తుంది?
Gold Loan Interest Rates 2025: బంగారు రుణంపై ఏ బ్యాంకు తక్కువ వడ్డీ ఆఫర్ చేస్తోంది?
Nara Lokesh: ఒక్కఛాన్స్ పేరుతో ఏపీ నష్టపోయింది, బిహార్‌లో ఆ పరిస్థితి రావద్దు: నారా లోకేష్
Congress candidate Naveen Yadav: రౌడీ అనే ముద్రవేస్తారా..? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 40వేల మెజారిటీతో గెలుస్తా: నవీన్ యాదవ్
Jana Nayagan : దళపతి విజయ్ లాస్ట్ మూవీ 'జన నాయగన్' - బాలయ్య 'భగవంత్ కేసరి'కి రీమేకా!... ఫస్ట్ సాంగ్‌తో...
AR Rahman Concert : రెహమాన్ కాన్సెర్ట్‌లో 'పెద్ది' టీం సందడి - 'చికిరి చికిరి' జోష్ వేరే లెవల్