ఇది ఇండియన్ బ్యాంక్ డ్వాక్రా మహిళల కోసం రూపొందించిన రుణ పథకం. వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఆర్థిక సహాయం అందిస్తుంది.
Dwcra Bank Loans: డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్! 4 లక్షల రుణం ఇస్తున్న ఇండియన్ బ్యాంక్! పూర్తి వివరాలు ఇవే!
SHG Business Loan Telugu: మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ఇండియన్ బ్యాంక్ IND MSME SAKHI పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.

- ఇండియన్ బ్యాంక్ మహిళా స్వయం సహాయక సంఘాలకు IND MSME SAKHI అందిస్తుంది.
- ఈ పథకం ద్వారా రూ.10 వేల నుండి రూ.4 లక్షల వరకు రుణం లభిస్తుంది.
- 18-65 ఏళ్ల మహిళలు, 650+ సిబిల్ స్కోర్ తో అర్హులు.
- పూచీకత్తు లేకుండా, తక్కువ వడ్డీతో 60 నెలల కాలపరిమితి ఉంటుంది.
Indian Bank IND MSME SAKHI: భారత్ ఆర్థిక వ్యవస్థలో మహిళా స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం, బ్యాంకులు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే, మహిళలను కేవలం పొదుపు సంఘాల సభ్యులుగానే కాకుండా, చిన్న తరహా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇండియన్ బ్యాంక్ ఒక అడుగు ముందుకు వేసింది.
IND MSME SAKHI పథకం అంటే ఏంటీ?
ఇండియన్ బ్యాంక్ ప్రత్యేకంగా డ్వాక్రా మహిళల కోసం రూపొందించిన రుణ పథకమే ఈ IND MSME SAKHI వ్యాపారం ప్రారంభించాలనే ఆసక్తి ఉండి, పెట్టుబడి లేక ఇబ్బంది పడే మహిళలకు ఇది ఒక గొప్ప అవకాశం. తయారీ రంగం, సేవా రంగం, లేదా వ్యాపార రంగాల్లో నిమగ్నమై ఉన్న లేదా కొత్తగా ప్రారంభించాలనుకునే మహిళా సభ్యులకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందుతుంది.
రుణం ఎంత లభిస్తుంది?
ఈ పథకం కింద అర్హులైన మహిళలు కనీసం రూ. పది వేల నుంచి గరిష్టంగా నాలుగు లక్షల వరకు రుణం పొందవచ్చు. వ్యాపార విస్తరణకు లేదా కొత్త యంత్రాల కొనుగోలుకు ఈ నిధులను వాడుకోవచ్చు.
ఎవరు అర్హులు?
ఈ పథకం లబ్ధి పొందాలంటే దరఖాస్తుదారులు ఈ కింది నిబంధనలను కలిగి ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా ఏదైనా డ్వాక్రా సంఘంలో సభ్యురాలై ఉండాలి. గత రెండు సంవత్సరాలుగా సక్రమంగా రుణాలను చెల్లిస్తున్న ట్రాక్ రికార్డ్ ఉండాలి. 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుకు 650 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉండటం చాలా అవసరం.
వడ్డీ రేట్లు, ఖర్చులు
చాలా బ్యాంకులు వ్యాపార రుణాలపై భారీగా వడ్డీ వసూలు చేస్తాయి, కానీ ఇండియన్ బ్యాంక్ ఈ పథకం కింద అత్యంత సరసమైన వడ్డీ రేట్లను అందిస్తోంది.
Also Read: డ్వాక్రా మహిళల కుమార్తెల పెళ్లికి రూ.1 లక్ష లోన్! కల్యాణ లక్ష్మి స్కీమ్ దరఖాస్తు విధానం ఇదే!
రెపోరేట్+3.60శాతం మాత్రమే. ఈ రుణానికి సంబంధించి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు కొనుగోలు చేసే యంత్రాలు లేదా వ్యాపార పెట్టుబడిలో కేవలం పది శాతం సొమ్మును మీరు సమకూర్చుకుంటే మిగిలిన 90 శాతం మొత్తాన్ని బ్యాంక్ రుణంగా ఇస్తుంది.
తిరిగి చెల్లించే కాలపరిమితి
రుణం పొందిన మహిళలకు తిరిగి చెల్లించడానికి గరిష్టంగా 60 నెలల సమయం ఇస్తారు. దీంతోపాటు వ్యాపారం నిలదొక్కుకోవడానికి కొంతకాలం మారటోరియం పీరియడ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.
Also Read: ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వ టాప్ 4 స్కీమ్స్ ఇవే! వీటిలో చేరితే భవిష్యత్ బంగారమే!
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే?ఈ రుణం పొందడానికి మీ ఇల్లు లేదా భూమి వంటి అదనపు పూచీకత్తు సమర్పించాల్సిన పని లేదు. మీరు వ్యాపారం కోసం కొనుగోలు చేసే యంత్రాలు లేదా ఆస్తులే బ్యాంక్ వద్ద సెక్యూరిటీగా ఉంటాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం సీజీటీఎంఎస్‌ఈ పథకం కింద ఈ రుణాలకు భద్రత కల్పిస్తారు.
దరఖాస్తు సమయంలో కావాల్సిన పత్రాలు
ఆధార్ కార్డు, డ్వాక్రా సంఘం సభ్యత్వ వివరాలు, సిఫార్సు లేఖ. గత కొద్ది నెలల బ్యాంక్ స్టేట్మెంట్. మీరు చేయబోయే వ్యాపార ప్రణాళిక ప్రాథమిక వివరణ. పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఆసక్తి గల మహిళలు నేరుగా తమ సమీపంలోని ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించి ఫామ్ పూర్తి చేయాలి. అంతేకాకుండా, టెక్నాలజీ అందుబాటులో ఉన్నవారు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా తమ లీడ్ నమోదు చేసుకోవచ్చు.
Also Read: క్రెడిట్ కార్డ్ బిల్లు ఓవర్‌డ్యూ ఉందా ? బ్యాంక్ సెటిల్‌మెంట్ ఆఫర్ మీకు లాభమా? నష్టమా !
డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఎదిగి, సొంతంగా వ్యాపారాలను నిర్వహించాలనే లక్ష్యంతో రూపొందిన ఈ పథకం మహిళకు ఉపయోగకరం. తక్కువ వడ్డీతో ఎలాంటి పూచీకత్తు లేకుండా లభిస్తున్న ఈ రూ.4 లక్షల రుణాన్ని సద్వినియోగం చేసుకుంటే మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య దేశంలో పెరిగే అవకాశం ఉంది.
Also Read: పేదల సొంతింటికి ముహూర్తం ఫిక్స్.. ఏపీ పీఎంఏవై గ్రామీణ్ స్కీమ్ పై గుడ్ న్యూస్!
Before You Go
Budget 2026 - 2027 Top 10 Points | కేంద్ర బడ్జెట్ లో పది ముఖ్యమైన అంశాలు
Frequently Asked Questions
IND MSME SAKHI పథకం అంటే ఏమిటి?
ఈ పథకం కింద ఎంత రుణం పొందవచ్చు?
కనీసం రూ. 10,000 నుంచి గరిష్టంగా రూ. 4 లక్షల వరకు రుణం పొందవచ్చు. వ్యాపార విస్తరణకు లేదా కొత్త యంత్రాల కొనుగోలుకు ఈ నిధులను వాడుకోవచ్చు.
ఈ పథకానికి ఎవరు అర్హులు?
డ్వాక్రా సంఘంలో సభ్యురాలై, గత 2 ఏళ్లుగా సక్రమంగా రుణాలు చెల్లిస్తూ, 18-65 ఏళ్ల మధ్య ఉండి, 650 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్న మహిళలు అర్హులు.
రుణం తిరిగి చెల్లించే కాలపరిమితి ఎంత?
గరిష్టంగా 60 నెలల సమయం ఉంటుంది. వ్యాపారం నిలదొక్కుకోవడానికి కొంతకాలం మారటోరియం పీరియడ్ కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ రుణం పొందడానికి ఎలాంటి పూచీకత్తు అవసరం?
ఇల్లు లేదా భూమి వంటి అదనపు పూచీకత్తు అవసరం లేదు. కొనుగోలు చేసే యంత్రాలు లేదా ఆస్తులే సెక్యూరిటీగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం CGTMSE పథకం కింద భద్రత కల్పిస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















