How To Apply For A EPFO Loan: ఉద్యోగుల భవిష్య నిధి (Employees' Provident Fund - EPF) అనేది ప్రభుత్వ రంగ పదవీ విరమణ పొదుపు పథకం. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఈపీఎఫ్‌ పథకం కింద, ఉద్యోగులు, ఉద్యోగ జీవితంలో ఉన్నంతకాలం తమ ప్రాథమిక జీతంలో 12 శాతం వాటా (Contribution to EPF) చెల్లిస్తారు. ఆ కంపెనీ కూడా, తన వంతుగా అంతే మొత్తాన్ని ‍‌జమ చేస్తుంది. కంపెనీ కాంట్రిబ్యూట్‌ చేసే మొత్తంలో 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ పథకం (Employees' Pension Scheme - EPS)లో జమ అవుతుంది & మిగిలిన 3.67 శాతం ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాలో జమ అవుతుంది. ప్రభుత్వం, EPF మీద 8.65 శాతం వడ్డీ చెల్లిస్తుంది.


PF బ్యాలెన్స్‌లో 50 శాతం వరకు...
మనలో దాదాపు అందరికీ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) గురించి తెలుసు. కానీ, PF బ్యాలెన్స్‌పై రుణం తీసుకోవచ్చని కూడా తెలుసా?. అత్యవసర సందర్భాల్లో మీరు మీ PF బ్యాలెన్స్‌లో 50 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.  'ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌' (EPFO) పరిధిలోని చాలా మంది ఉద్యోగులు ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకుంటారు. సాధారణంగా, ఉద్యోగులకు వివాహం, వైద్య అత్యవసర పరిస్థితి, ఇల్లు కట్టుకోవడం లేదా ఉన్నత చదువులు వంటి సమయాల్లో పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు EPF రుణం తీసుకుంటుంటారు. 


PF అడ్వాన్స్ పొందడానికి ఈ విషయాలను గుర్తుంచుకోండి


EPF లోన్ కోసం దరఖాస్తు చేసుకునే ఉద్యోగికి చెల్లుబాటు అయ్యే UAN (Universal Account Number) ఉండాలి. 
ఉద్యోగి EPFO లో క్రియాశీల సభ్యుడిగా ఉండాలి & EPFO నిర్దేశించిన ప్రమాణాలను నెరవేర్చాలి. 
రుణ మొత్తం నిర్దేశించిన పరిమితి లోపు ఉండాలి. 


EPF లోన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ‍‌(How to apply for EPF loan?)


ముందుగా, EPFO Unified Member Portal అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.      
ఇప్పుడు, మీ యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ (UAN), పాస్‌వర్డ్ & క్యాప్చా నమోదు చేయండి. దీంతో మీరు మీ ఖాతాలోకి లాగిన్ అవుతారు.        
ఇప్పుడు Online Services లోకి వెళ్లి > Cliam ( Form- 31, 19, 10C) మీద క్లిక్ చేయండి.      
ఆ తర్వాత మీ పేరు, పుట్టిన తేదీ & బ్యాంక్ ఖాతా వివరాలు వంటి అన్ని సమాచారాలను పూరించండి.       
ఇప్పుడు, డ్రాప్‌డౌన్ మెనూ మీద క్లిక్‌ చేస్తే, మీరు లోన్ తీసుకోవడానికి గల కారణాలు కనిపిస్తాయి. వాటిలో ఒకటి ఎంచుకోండి. 
నిర్దిష్ట లోన్‌ మొత్తాన్ని నింపిన తర్వాత దరఖాస్తు ఫారాన్ని సబ్మిట్‌ చేయండి. 
చివరగా, రుజువు పత్రాలను అప్‌లోడ్ చేయండి. ఆధార్ ఆధారిత OTPతో వాటిని ధృవీకరించండి. 


ఇక్కడితో మీ దరఖాస్తు అందినట్లు 'ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌' (EPFO) ధృవీకరిస్తుంది. డబ్బు 7 నుంచి 10 రోజుల్లో మీ బ్యాంక్‌ ఖాతాలో క్రెడిట్‌ అవుతుంది.