EMI On Mahindra Thar Roxx Car Loan: భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత పాపులర్‌ SUVలలో ‍‌(Most Popular SUVs In India) మహీంద్రా థార్ రాక్స్ ఒకటి. ఈ కారుకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది.  మహీంద్రా థార్ రాక్స్ మోడల్‌ పెట్రోల్ & డీజిల్ పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంది. దిల్లీలో, ఈ కార్‌ ఎక్స్-షోరూమ్ ధర (Mahindra Thar Roxx Ex-Showroom Price, Delhi) రూ. 12.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 23.09 లక్షల వరకు ఉంటుంది. థార్ రాక్స్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న మోడల్ MX5 RWD (పెట్రోల్). న్యూదిల్లీలో ఈ వేరియంట్ ఆన్-రోడ్‌ ప్రైస్‌ (Mahindra Thar Roxx On-road Price, Delhi) రూ. 19.46 లక్షలు.


మహీంద్రా థార్ రాక్స్ కోసం ఎంత EMI చెల్లించాలి?
మీ డ్రీమ్‌ కార్‌ మహీంద్రా థార్ రాక్స్ MX5 RWD (పెట్రోల్) వేరియంట్‌ను సొంతం చేసుకోవడానికి మీరు ఒకేసారి పూర్తి మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు. దేశ ప్రజలు, ముఖ్యంగా యూత్‌ ఇష్టపడుతున్న ఈ వెహికల్‌ను కారు లోన్‌పై కూడా కొనుగోలు చేయవచ్చు. థార్ రాక్స్ MX5 RWD (పెట్రోల్) వేరియంట్ కొనడానికి మీ దగ్గర కనీసం రూ. 2 లక్షలు ఉంటే చాలు. ఎందుకంటే, మీరు ఈ వాహనానికి రూ. 1.95 లక్షలు డౌన్ పేమెంట్ ‍‌(Down payment for Mahindra Thar Roxx Car Loan) చెల్లించాలి. ఇది పోను, మీరు బ్యాంక్‌ నుంచి రూ. 17.51 లక్షల రుణం ‍‌(Car Loan On Mahindra Thar Roxx) పొందవచ్చు. ఈ రుణంపై వసూలు చేసే వడ్డీ ప్రకారం, మీరు ప్రతి నెలా బ్యాంకులో EMI జమ చేయాలి.


వివిధ కాల వ్యవధుల్లో, మహీంద్రా థార్ రాక్స్ కార్‌ లోన్‌ EMI వివరాలు:
* మహీంద్రా థార్ రాక్స్ కొనడానికి, మీరు నాలుగు సంవత్సరాల కాలానికి (Loan tenure) కార్‌ లోన్‌ తీసుకున్నారని అనుకుందాం. బ్యాంక్ ఈ రుణంపై 9 శాతం వడ్డీ వసూలు చేస్తుందని భావిద్దాం. ఇప్పుడు, మీరు ప్రతి నెలా దాదాపు రూ. 43,600 EMI చెల్లించాల్సి ఉంటుంది.
* ఒకవేళ, ఈ SUV (Sport Utility Vehicle)ను కొనడానికి మీరు 5 సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటుతో, 60 నెలల పాటు ప్రతి నెలా రూ. 36,400 EMI చెల్లించాలి.
* ఈ మహీంద్రా కారు కొనడానికి మీరు 6 సంవత్సరాల కాలానికి ఆటో లోన్‌ తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటుతో, మీరు ప్రతి నెలా బ్యాంకులో రూ. 31,600 EMI డిపాజిట్ చేయాలి.
* మహీంద్రా థార్ రాక్స్ కొనడానికి మీరు 7 సంవత్సరాల టెన్యూర్‌తో లోన్‌ తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటుపై మీరు నెలనెలా రూ. 28,200 EMI చెల్లించాలి.


మహీంద్రా థార్ రాక్స్ కొనడానికి బ్యాంక్‌ నుంచి కార్‌ లోన్‌ తీసుకునే ముందు, ఈ రుణానికి సంబంధించిన అన్ని విషయాలను పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. లోన్‌ డాక్యుమెంట్లపై సంతకం చేసే ముందు అన్ని ఒప్పంద పత్రాలను జాగ్రత్తగా చదవండి. ఎందుకంటే బ్యాంకులు వివిధ విధానాలను అనుసరిస్తుంటాయి. కాబట్టి, EMI గణాంకాలలో తేడాలు ఉండవచ్చు.