Apply For PAN 2.0 Online: భారత ప్రభుత్వం ఇటీవల PAN 2.0 ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. కార్డ్‌దారుల వ్యక్తిగత వివరాల భద్రత & కార్డ్ వినియోగ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు పన్ను చెల్లింపుదారుల గుర్తింపును ఆధునీకరించడం ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ చెప్పిన ప్రకారం..  కొత్త కార్డ్‌లో మెరుగైన పనితీరు & భద్రతతో కూడిన ప్రామాణీకరణ కోసం (PAN authentication) కోసం క్యూఆర్‌ కోడ్‌ (QR code on PAN) ఉంటుంది.

Continues below advertisement


PAN 2.0 ప్రాజెక్ట్ అంటే ఏంటి?
పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్‌ను మరింత సులభంగా మార్చడానికి రూపొందించిన అప్‌డేటెడ్‌ ఇ-గవర్నెన్స్ ఇనీషియేటివ్‌ ఇది. ఇప్పటి వరకు వేర్వేరుగా ఉన్న PAN (Permanent Account Number) & TAN (Tax Deduction and Collection Account Number) వ్యవస్థలను ఈ ప్రాజెక్ట్ ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా కలిపేస్తుంది. దీనివల్ల, దీనిని వినియోగించడం & భద్రత రెండూ మెరుగుపడతాయి.


PAN 2.0 లక్షణాలు
QR కోడ్ ఇంటిగ్రేషన్: కార్డుదారు గుర్తింపును వేగంగా ధృవీకరించడానికి & ప్రామాణీకరించడానికి వీలవుతుంది.
ఏకీకృత డిజిటల్ పోర్టల్: పాన్, టాన్‌ సేవలు ఒకే వ్యవస్థలోకి ఏకీకృతం అవుతాయి.
పాన్ డేటాకు భద్రత: పాన్‌లోని వ్యక్తిగత సమాచారం కేంద్రీకృత విధానంలో సురక్షితంగా నిల్వ ఉంటుంది, నిర్వహణ సమర్థవంతంగా ఉంటుంది.


పాన్ కార్డ్‌ను 2.0ను ఎవరు తీసుకోవాలి?
ఇప్పటికే పాన్ కార్డ్ ఉన్న వ్యక్తులంతా పాన్ కార్డ్‌ 2.0కు అప్‌గ్రేడ్‌ కావడానికి అర్హులు, దీనికోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదు. ఇప్పటికే కార్డ్‌ ఉన్నవాళ్లు QR-ఆధారిత వెర్షన్‌ కోసం అభ్యర్థించవచ్చు. కొత్త దరఖాస్తుదారులు తగ్గిన అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత గుర్తింపు పత్రాన్ని, చిరునామా రుజువును అందించాలి. పన్ను చెల్లింపుదారులందరికీ (taxpayers) అప్‌గ్రేడ్ ఉచితం.


పాన్ 2.0 కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి?
స్టెప్‌ 1: NSDL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి, PAN రిక్వెస్ట్‌ పేజీలోకి వెళ్లండి
స్టెప్‌ 2: మీ PAN & వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయండి. మీ గుర్తింపు, చిరునామా, జనన తేదీ రుజువు కోసం స్కాన్ చేసిన కాపీలను సమర్పించండి.
స్టెప్‌ 3: OTP డెలివరీ పద్ధతిని ఎంచుకుని వివరాలను ధృవీకరించండి.           
స్టెప్‌ 4: నిబంధనలు & షరతులకు అంగీకరిస్తూ సంబంధిత గడిలో టిక్‌ మార్క్‌ పెట్టండి.
స్టెప్‌ 5: చివరిగా, మీరు ఇచ్చిన సమాచారాన్ని మరొకసారి చెక్‌ చేసుకుని సబ్మిట్‌ చేయండి. కొన్ని రోజుల్లో కొత్త కార్డ్ మీ ఇంటికి వస్తుంది.


పాన్ 2.0 దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు
గుర్తింపు రుజువు: ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటరు ID లేదా డ్రైవింగ్ లైసెన్స్.      
చిరునామా రుజువు: బ్యాంక్ స్టేట్‌మెంట్‌, యుటిలిటీ బిల్లులు లేదా అద్దె ఒప్పందాలు.        
జనన తేదీ రుజువు: జనన ధృవీకరణ పత్రం, 10వ తరగతి మార్క్స్‌ లిస్ట్‌ లేదా పాస్‌పోర్ట్.       


మరో ఆసక్తికర కథనం: రూ.12 లక్షల ఆదాయంపై పన్ను మిహాయింపు గ్రాస్‌ శాలరీ మీదా, నెట్‌ శాలరీ మీదా? సమాధానం మీకు తెలుసా?