search
×

Gold-Silver Price: బంగారం ధరలో కాస్త ఊరట! నేడు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

Hyderabad Gold Rate ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.47,550 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,870 గా ఉంది.

FOLLOW US: 

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు పెరిగింది. 10 గ్రాములకు రూ.200 పెరిగింది. గత రెండ్రోజులు రూ.100 చొప్పున తగ్గగా, నేడు ఎకాఎకి రెట్టింపు ఎగబాకినట్లయింది. ఇక వెండి ధర నేడు స్థిరంగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,550 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,870 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.65,700 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,700 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,550 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,870గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,700 గా ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర (Todays Gold Rate) ఇలా..
అయితే, ఇతర నగరాల్లోనూ బంగారం ధర నేడు పెరిగింది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,920 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870 గా ఉంది.

ప్లాటినం ధర నేడు (Todays Platinum Rate) ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు నిలకడగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.22,840 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.

రష్యా - ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

Published at : 27 Jun 2022 07:05 AM (IST) Tags: Gold Price Silver Price Todays gold cost Todays silver price platinum price hyderabad gold silver price vijayawada gold rate

సంబంధిత కథనాలు

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్ల నిబంధనల్లో కీలక మార్పు చేసిన మోదీ సర్కార్‌!

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్ల నిబంధనల్లో కీలక మార్పు చేసిన మోదీ సర్కార్‌!

Hurun India Rich List 2022: అదానీ దూకుడు.. సాటెవ్వరు! అంబానీని వెనక్కి నెట్టేసిన గౌతమ్‌.. రోజుకు రూ.1600 కోట్ల ఆదాయం

Hurun India Rich List 2022: అదానీ దూకుడు.. సాటెవ్వరు! అంబానీని వెనక్కి నెట్టేసిన గౌతమ్‌.. రోజుకు రూ.1600 కోట్ల ఆదాయం

Gold-Silver Price 20 September 2022: స్వర్ణ కాంతి తగ్గింది, వెండి దూకుడు ఆగింది - ఇవాళ్టి రేట్లు ఇవి

Gold-Silver Price 20 September 2022: స్వర్ణ కాంతి తగ్గింది, వెండి దూకుడు ఆగింది - ఇవాళ్టి రేట్లు ఇవి

PMVVY: ఈ బంపర్‌ స్కీమ్‌తో నెలనెలా గ్యారెంటీగా రూ.9 వేలకు పైగా మీ చేతికొస్తుంది

PMVVY: ఈ బంపర్‌ స్కీమ్‌తో నెలనెలా గ్యారెంటీగా రూ.9 వేలకు పైగా మీ చేతికొస్తుంది

Gold Price Today: ఆ ఒక్కటీ మిస్సయితే పసిడి ధర మరింత పడే ఛాన్స్‌!

Gold Price Today: ఆ ఒక్కటీ మిస్సయితే పసిడి ధర మరింత పడే ఛాన్స్‌!

టాప్ స్టోరీస్

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!