PMJJBY: ఒకప్పుడు మధ్య తరగతి లేదా అధిక ఆదాయ వర్గాల ప్రజలు మాత్రమే బీమా పథకాలను కొనుగోలు చేసేవారు. పేదవాళ్లు కూడా బీమా సౌకర్యాన్ని, ఆర్థిక భద్రతను పొందాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. దాని పేరు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PM జీవన్ జ్యోతి బీమా యోజన). దీనిలో, ఏడాదికి కేవలం రూ. 436 కట్టి రూ. 2 లక్షల వరకు బీమా రక్షణ పొందవచ్చు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. మీరు కూడా ఈ పథకం రక్షణలోకి రావాలని అనుకుంటే, ముందుగా దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
PMJJBY గురించి ముఖ్యమైన విషయాలు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీదారు.. ప్రమాదం, అనారోగ్యం తదితర కారణాలతో మరణిస్తే నామినీకి రూ. 2 లక్షల వరకు బీమా క్లెయిమ్ లభిస్తుంది. PMJJBY అనేది పాలసీదారు మరణించిన తర్వాత మాత్రమే ప్రయోజనాలను ఇచ్చే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అని గమనించాలి. అంటే, తన మరణాంతరం కూడా తన కుటుంబానికి ఆర్థిక రక్షణను పాలసీదారు అందించగలడు. మరోవైపు, పాలసీదారు ప్రమాదంలో వికలాంగుడైతే, అతను రూ. 1 లక్ష వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కాబట్టి, పాలసీదారు జీవించి ఉంటే అతని కుటుంబానికి ఈ ప్రయోజనాలు అందవు ఉండదు. ఈ పథకంలో 18 నుంచి 50 సంవత్సరాల మధ్య కొనుగోలు చేయవచ్చు.
ఎంత ప్రీమియం చెల్లించాలి? PMJJBY దరఖాస్తు కోసం ప్రతి సంవత్సరం రూ. 436 మాత్రమే చెల్లించాలి. 2022 సంవత్సరానికి ముందు ఈ మొత్తం రూ. 330 గా ఉండగా, ఆ తర్వాత రూ. 426 కు పెంచారు. ఈ బీమా ప్రీమియం ఏటా జూన్ 1 నుంచి తర్వాతి సంవత్సరం మే 30 కాలంలో చెల్లుబాటులో ఉంటుంది. ఈ పాలసీ కోసం ఆటో డెబిట్ సిస్టమ్ ద్వారా ప్రీమియం అమౌంట్ కట్ అవుతుంది. అంటే.. జూన్ 1న, మీ సేవింగ్స్ ఖాతా నుంచి డబ్బు ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది, బీమా ప్రీమియానికి డిపాజిట్ అవుతుంది.
ఈ పాలసీని కొనుగోలు చేయడానికి అవసరమైన పత్రాలు:ఆధార్ కార్డ్ (Aadhaar Card)పాన్ కార్డ్ (PAN Card)రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు (Passport Size Photos)బ్యాంక్ పాస్ బుక్ (Bank Passbook)మొబైల్ నంబర్ (Mobile Number)
పాలసీ దరఖాస్తు & క్లెయిమ్ ప్రక్రియమీరు మీ బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. ప్రతి సంవత్సరం జూన్ 1న, ఆటో డెబిట్ మోడ్ ద్వారా మీ సేవింగ్స్ ఖాతా నుంచి రూ. 436 ను పాలసీ కోసం తీసేస్తారు. నామినీకి పాలసీని క్లెయిమ్ చేసే హక్కు ఉంటుంది. పాలసీదారు మరణ ధృవీకరణ పత్రం, ID రుజువును చూపడం ద్వారా పాలసీని క్లెయిమ్ చేయవచ్చు. ప్రమాదం కారణంగా పాలసీదారు వికలాంగుడైతే, బీమా కోసం క్లెయిమ్ చేయవచ్చు. దీని కోసం మీరు డిశ్చార్జ్ నివేదికను చూపించాలి. డబ్బు మీ ఖాతాకు బదిలీ అవుతుంది.