రుణం పొందడమన్నది చాలా సందర్భాల్లో ఒక సుదీర్ఘమైన ప్రక్రియ, పేపర్ వర్క్ భారీగా ఉంటుంది, అంతే కాకుండా చాలా కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. డబ్బు అత్యవసరమైన సందర్భాల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. అలాంటి సందర్భాలలో, ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఒక గొప్ప ఎంపికగా నిలుస్తుంది. ఎందుకంటే ఇందులో ఆమోద ప్రక్రియ అనేది ఉండదు, అంతే కాదు పంపిణీ కూడా వేగవంతం ఉంటుంది.
ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అనేది సాధారణంగా స్వల్పకాలికంగా, అన్ సెక్యూర్డ్ ఇన్‌స్టంట్ లోన్‌గా ఉంటుంది. ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులు సహ అనేక రకాల రుణదాతలు వీటిని అందిస్తూ ఉంటారు. ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అనేవి రుణగ్రహీత రుణయోగ్యతను బట్టి వారికి అనుకూలంగా ఉంటాయి. రుణగ్రహీతల రుణయోగ్యతను మదింపు చేసే రుణదాతలు తదనుగుణంగా వారికి వ్యక్తిగతమైన ఆఫర్స్ సృష్టించి వేగవంతమైన ప్రాసెసింగ్ ద్వారా సత్వరమే నిధులు అందిస్తారు.
ఉదాహరణకు, బజాజ్ ఫైనాన్స్ వంటి రుణదాతలు ఇన్‌స్టా పర్సనల్ లోన్స్ పేరుతో ప్రీ- అప్రూవ్డ్ ఆఫర్స్ అందిస్తారు. దీని ద్వారా మీరు 30 నిమిషాల నుంచి 4 గంటల స్వల్ప సమయంలో నిధులు అందుకోగలుగుతారు.
ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ పొందడం ద్వారా అందుకునే నాలుగు ప్రధాన ప్రయోజనాలివి:
- వేగవంతమైన ప్రాసెసింగ్
సాంప్రదాయ రుణాల్లో దరఖాస్తుల పరిశీలనకు రోజుల నుంచి వారాల సమయం పడుతుంది. అదే ప్రీ-అప్రూవ్డ్ లోన్స్‌లో రుణాలు అందించే ప్రక్రియ వేగవంతంగా ఉంటుంది. రుణగ్రహీత ఆర్థిక ప్రొఫైల్ ముందుగానే అంచనా వేయబడుతుంది. నిర్దిష్ట ప్రమాణాలు కలిగిన వారికి ముందస్తు ఆమోదాన్ని రుణగ్రహీతలు ఇస్తారు. ఇది ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించి రుణగ్రహీతలకు వారికి అవసరమైన డబ్బును వేగంగా అందిస్తుంది.
- ఇన్‌స్టంట్ ఫండింగ్
ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ అనేవి రుణగ్రహీతలకు ముందస్తు ఆమోదిత రుణమొత్తాన్ని వేగంగా అందుకునేలా రూపొందించబడ్డాయి. రుణగ్రహీత ఆ ఆఫర్‌కు అంగీకారం తెలిపిన వెంటనే నిధులు గంటల వ్యవధిలోనే పంపిణీ చేయడం జరుగుతుంది. అత్యవసరంగా డబ్బు అవసరమైన సందర్భాల్లో ఇది వరంగా పనిచేస్తుంది. అది హాస్పిటల్ బిల్లు చెల్లింపు కావచ్చు లేదా ట్యూషన్ ఫీజు చెల్లింపు కానివ్వడం లేదా ఇంటి మరమ్మత్తు పనులు కానివ్వండి,మీకు అరచేతిలో డబ్బులు అందుబాటులో ఉండటం వల్ల ఎంతో తేడాను మీరు గమనించవచ్చు.
- అతి తక్కువ లేదా అసలు డాక్యుమెంటేషన్ అవసరం ఉండదు
రెగ్యులర్ పర్సనల్ లోన్ కోసం డాక్యుమెంట్లు సేకరించడం, సమర్పించడం అన్నది చాలా సమయం తీసుకునే ప్రక్రియే కాదు అది చాలా గజిబిజిగా ఉంటుంది. అయితే, ప్రీ-అప్రూవ్డ్ లోన్స్‌లో ఈ భారం గణనీయంగా తగ్గుతుంది. ప్రీ-అప్రూవల్ ప్రక్రియలో రుణగ్రహీత రుణయోగ్యత ముందస్తుగానే మదింపు చేయబడుతుంది కాబట్టి కనీస పత్రాల మాత్రమే అవసరమవుతాయి. అదనపు డాక్యుమెంటేషన్ అవసరం ఉండదు. ఈ స్ట్రీమ్‌లైన్డ్ డాక్యుమెంటేషన్ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా లోన్ అప్లికేషన్ ప్రాసెస్‌ను సులభతరం చేస్తుంది. ఎంపిక చేసిన కస్టమర్‌లు వారి ఆదాయ రుజువు లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్స్ వంటి పత్రాలు సమర్పించకుండానే మా ఇన్‌స్టా పర్సనల్ లోన్ పొందవచ్చు
- అనుకూలమైన వ్యవధి
రుణదాతలు తరచుగా రుణగ్రహీతలకు వారి ఆర్థిక సామర్థ్యం, ప్రాధాన్యతకు అనుగుణంగా తిరిగి చెల్లింపు వ్యవధిని ఎంచుకునే అవకాశం ఇస్తారు. రుణగ్రహీతలు వారి అవసరాలకు అనుగుణంగా సౌకర్యవంతమైన రీతిలో తిరిగి చెల్లింపు జరిపేలా ఇది సదుపాయం కల్పిస్తుంది. రుణాన్ని త్వరగా తిరిగి చెల్లించేందుకు మీరు తక్కువ వ్యవధిని ఎంచుకున్నా లేదా నెలవారీ చెల్లింపు మొత్తం తక్కువుండి ఎక్కువ కాలం కొనసాగించదలుచుకున్నా, ఈ ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ మీ భిన్నమైన అవసరాలను తీర్చగలుగుతాయి.
మీ అన్ని అత్యవసర ఖర్చులకు సరైన పరిష్కారంగా ఇన్‌స్టా పర్సనల్ లోన్స్ అందిస్తోంది బజాజ్ ఫైనాన్స్. ప్రస్తుత కస్టమర్లు రూ. 12,76,500 వరకు వరకు ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఆఫర్ పొందవచ్చు. కొత్త కస్టమర్లు తమ ఫోన్ నంబర్, ఓటీపీతో తక్షణమే ముందుగా కేటాయించిన రుణ పరిమితిని పొందవచ్చు. ఇన్‌స్టా పర్సనల్ లోన్లు తిరిగి చెల్లించేందుకు 6 నుంచి 63 నెలల వరకు అనుకూలమైన కాలపరిమితితో కూడి ఉంటాయి. మీ అవసరాలకు బాగా సరిపోయే తిరిగి చెల్లింపు వ్యవధిని ఎంచుకునే సౌలభ్యం మీకు ఉంది.
ఇన్‌స్టా పర్సనల్ లోన్ ఎలా పనిచేస్తుందో లోతుగా తెలుసుకునేందుకు బజాజ్ ఫిన్‌సర్వ్ వెబ్‌సైట్ సందర్శించండి.