FD Interest Rate: అన్ని బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలను అమలు చేస్తున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ తన రెపో రేటును పెంచడంతో అన్ని రకాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు కూడా పెరిగాయి. స్వల్ప కాలం నుంచి దీర్ఘకాలం వరకు మంచి పెట్టుబడి మార్గంగా ఇవి అత్యంత ప్రజాదరణ పొందాయి. 


సీనియర్‌ సిటిజన్లు ఇతర సాధారణ పెట్టుబడిదార్ల కంటే ఎక్కువ రాబడిని FDల మీద అందుకుంటారు. ఒకవేళ కాల గడువు పూర్తి కాకముందే FD మొత్తాన్ని లేదా కొంతమొత్తాన్ని వెనక్కు తీసుకుంటే, దానిపై ఆయా బ్యాంకులను బట్టి జరిమానా వర్తిస్తుంది. FD మెచ్యూర్ అయిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కాల వ్యవధి, కనీస మొత్తం వంటివి బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి. SBI, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి అగ్ర బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇక్కడ ఇస్తున్నాం.


స్టేట్‌ బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లు - SBI FD interest rates
రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 3% నుంచి 7% మధ్య స్థిర డిపాజిట్ వడ్డీ రేట్లు అందిస్తుంది. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ బ్యాంక్ అత్యధిక వడ్డీ రేటు 7% అందిస్తుంది. అమృత్ కలశ్‌ డిపాజిట్‌పై సాధారణ ప్రజలకు అందించే వడ్డీ రేటు 7.10%.


7 రోజుల నుంచి 45 రోజులకు - సాధారణ పౌరులకు 3% - సీనియర్‌ సిటిజన్లకు 3.5%
46 రోజుల నుంచి 179 రోజులకు - సాధారణ పౌరులకు 4.5 - సీనియర్‌ సిటిజన్లకు 5
180 రోజుల నుంచి 210 రోజులకు - సాధారణ పౌరులకు 5.25 - సీనియర్‌ సిటిజన్లకు 5.75
211 రోజుల నుంచి ఒక సంవత్సరానికి - సాధారణ పౌరులకు 5.75 - సీనియర్‌ సిటిజన్లకు 6.25
ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాలకు - సాధారణ పౌరులకు 6.8 - సీనియర్‌ సిటిజన్లకు 7.3
2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకు - సాధారణ పౌరులకు 7 - సీనియర్‌ సిటిజన్లకు 7.5
3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు - సాధారణ పౌరులకు 6.5 - సీనియర్‌ సిటిజన్లకు 7
5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు - సాధారణ పౌరులకు 6.5 - సీనియర్‌ సిటిజన్లకు 7.5
400 రోజులు (“అమృత్‌ కలశ్‌” ప్రత్యేక పథకం) - సాధారణ పౌరులకు 7.1 - సీనియర్‌ సిటిజన్లకు 7.6


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లు - HDFC Bank FD interest rates
రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 3% నుంచి 7.10% మధ్య రేట్లు అందిస్తోంది. 15 నెలల నుంచి 18 నెలల కాల వ్యవధిలో అత్యధిక వడ్డీ రేటును అందిస్తోంది.


7 రోజుల నుంచి 29 రోజులకు - సాధారణ పౌరులకు 3% - సీనియర్‌ సిటిజన్లకు 3.5%
30 రోజుల నుంచి 45 రోజులకు - సాధారణ పౌరులకు 3.5% - సీనియర్‌ సిటిజన్లకు 4.00
46 రోజుల నుంచి 6 నెలలకు - సాధారణ పౌరులకు 4.50 - సీనియర్‌ సిటిజన్లకు 5.00
6 నెలల నుంచి 9 నెలలకు - సాధారణ పౌరులకు 5.75 - సీనియర్‌ సిటిజన్లకు 6.25%
9 నెలల నుంచి ఒక సంవత్సరానికి - సాధారణ పౌరులకు 6.00 - సీనియర్‌ సిటిజన్లకు 6.50
ఒక సంవత్సరం నుంచి 15 నెలలకు - సాధారణ పౌరులకు 6.60 - సీనియర్‌ సిటిజన్లకు 7.10
15 నెలల నుంచి 18 నెలలకు -  సాధారణ పౌరులకు 7.10 - సీనియర్‌ సిటిజన్లకు 7.60
18 నెలల నుంచి 5 సంవత్సరాలకు - సాధారణ పౌరులకు 7.00 - సీనియర్‌ సిటిజన్లకు 7.50
5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు - సాధారణ పౌరులకు 7.00 - సీనియర్‌ సిటిజన్లకు 7.75


ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లు - ICICI Bank FD interest rates
రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 3% నుంచి 7.10% మధ్య స్థిర డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తోంది. 15 నెలల నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధిలో అత్యధిక వడ్డీ రేటు ఆఫర్‌ చేస్తోంది.అందించబడుతుంది.


7 రోజుల నుంచి 29 రోజులకు - సాధారణ పౌరులకు 3% - సీనియర్‌ సిటిజన్లకు 3.5%
30 రోజుల నుంచి 45 రోజులకు - సాధారణ పౌరులకు 3.5% - సీనియర్‌ సిటిజన్లకు 4.00
30 రోజుల నుంచి 60 రోజులకు - సాధారణ పౌరులకు 4.25 - సీనియర్‌ సిటిజన్లకు 4.75
61 రోజుల నుంచి 184 రోజులకు - సాధారణ పౌరులకు 4.50 - సీనియర్‌ సిటిజన్లకు 5.00
185 రోజుల నుంచి 270 రోజులకు - సాధారణ పౌరులకు 5.75 - సీనియర్‌ సిటిజన్లకు 6.25
271 రోజుల నుంచి 1 సంవత్సరానికి - సాధారణ పౌరులకు 6.00 - సీనియర్‌ సిటిజన్లకు 6.50
1 సంవత్సరం నుంచి 15 నెలలకు -  సాధారణ పౌరులకు 6.70 - సీనియర్‌ సిటిజన్లకు 7.20
15 నెలల నుంచి 2 సంవత్సరాలకు -  సాధారణ పౌరులకు 7.10 - సీనియర్‌ సిటిజన్లకు 7.60
2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు - సాధారణ పౌరులకు 7.00 - సీనియర్‌ సిటిజన్లకు 7.50
5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు - సాధారణ పౌరులకు 6.90 - సీనియర్‌ సిటిజన్లకు 7.50


కెనరా బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లు - Canara Bank FD interest rates
రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 4% నుంచి 7.25% మధ్య డిపాజిట్ వడ్డీ రేట్లు అందిస్తోంది. 444 రోజుల కాల వ్యవధి డిపాజిట్‌పై అత్యధికంగా 7.25% ఆఫర్‌ చేస్తోంది.


7 రోజుల నుంచి 45 రోజులకు - సాధారణ పౌరులకు 4 - సీనియర్‌ సిటిజన్లకు 4
46 రోజుల నుంచి 90 రోజులకు - సాధారణ పౌరులకు 5.25 - సీనియర్‌ సిటిజన్లకు 5.25
91 రోజుల నుంచి 179 రోజులకు - సాధారణ పౌరులకు 5.5 - సీనియర్‌ సిటిజన్లకు 5.5
180 రోజుల నుంచి 269 రోజులకు - సాధారణ పౌరులకు 6.25 - సీనియర్‌ సిటిజన్లకు 6.75
270 రోజుల నుంచి 1 సంవత్సరానికి  - సాధారణ పౌరులకు 6.5 - సీనియర్‌ సిటిజన్లకు 7
ఒక్క సంవత్సరానికి  - సాధారణ పౌరులకు 7 - సీనియర్‌ సిటిజన్లకు 7.5
444 రోజులు  - సాధారణ పౌరులకు 7.25 - సీనియర్‌ సిటిజన్లకు 7.75
1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలకు  - సాధారణ పౌరులకు 6.9 - సీనియర్‌ సిటిజన్లకు 7.4
2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకు  - సాధారణ పౌరులకు 6.85 - సీనియర్‌ సిటిజన్లకు 7.35
3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు  - సాధారణ పౌరులకు 6.8 - సీనియర్‌ సిటిజన్లకు 7.3
5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు  - సాధారణ పౌరులకు 6.7 - సీనియర్‌ సిటిజన్లకు 7.2