How To Check PF Balance via SMS, Missed Call: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) సభ్యులు, ఇప్పుడు, పీఎఫ్‌ అకౌంట్‌లో బ్యాలెన్స్‌ను చాలా సులభంగా చెక్‌ చేయొచ్చు. పాస్‌బుక్‌ను కూడా ఈజీగా యాక్సెస్‌ చేయవచ్చు. ఆఫీస్‌ల చుట్టు తిరిగే శ్రమ లేకుండా, ఒళ్లు కదలకుండా ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లోనే అంతా చూడొచ్చు. 


మీ PF అకౌంట్‌లోని బ్యాలెన్స్‌ చెక్‌ చేయడానికి ఒక్క SMS చేస్తే సరిపోతుంది. లేదా ఒక్క మిస్డ్ కాల్ ఇచ్చినా చాలు.


SMS ద్వారా EPF బ్యాలెన్స్‌ ఎలా చెక్‌ చేయాలి? 


- మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ ఫోన్‌లోని SMSలో EPFOHO అని టైప్‌ చేయండి. స్పేస్‌ ఇచ్చి మీ UANను, స్పేస్‌ ఇచ్చి మీకు అనువైన భాషలోని మొదటి మూడు అక్షరాలను టైప్ చేయండి. ఉదాహరణకు "తెలుగు" కోసం TEL అని టైప్‌ చేయాలి. దీనిని EPFOHO UAN TEL అని రాసి మీ 7738299899 నంబర్‌కు పంపండి. "ఇంగ్లీష్‌"లో సమాచారం కావాలనుకుంటే...  EPFOHO UAN ENG అని పంపాలి.


మిస్డ్ కాల్ ద్వారా  EPF బ్యాలెన్స్‌ ఎలా చెక్‌ చేయాలి?


- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425కు డయల్ చేయండి.
- మీ PF బ్యాలెన్స్ మీ మొబైల్‌ ఫోన్‌కు SMS రూపంలో వస్తుంది.


EPF పాస్‌బుక్‌ను చెక్‌ చేయడం ఎలా?


- http://epfindia.gov.in లింక్‌ ద్వారా EPFO వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. హోమ్‌ పేజీ మెనూలో 'Services' మీద క్లిక్‌ చేయండి. డ్రాప్‌ డౌన్‌ మెనూలోనూ ‘For Employees’ సెక్షన్‌పై క్లిక్ చేయండి.
- 'Services' విభాగంలోని ‘Member Passbook’ క్లిక్ చేయండి.
- ఇప్పుడు, passbook.epfindia.gov.in యూఆర్‌ఎల్‌తో కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. 
- మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయండి.
- క్యాప్చా కోడ్‌ను యథాతథంగా నింపి, ‘Sign In’పై క్లిక్ చేయండి.
- మీ ఆధార్‌తో లింక్ అయిన మీ ఫోన్ నంబర్‌కు ఆరు అంకెల ఒన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (OTP) వస్తుంది.
- మీ ఖాతా వివరాలను యాక్సెస్ చేయడానికి సంబంధిత గడిలో OTPని ఎంటర్‌ చేయండి.
- EPFO ఫీల్డ్ ఆఫీస్‌ల్లో సెటిల్‌ అయిన ఎంట్రీలు ఇక్కడ కనిపిస్తాయి.


మెంబర్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకున్న వ్యక్తుల EPF పాస్‌బుక్‌ మాత్రమే పోర్టల్‌లో కనిపిస్తుంది. ఒకవేళ మీరు మెంబర్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోకపోతే, ముందు ఆ పని చేయాలి. అవసరమైన వివరాలన్నీ సమర్పించి రిజిస్టర్‌ చేసుకున్న ఆరు గంటల తర్వాత మీ పాస్‌బుక్ అందుబాటులోకి వస్తుంది. పాస్‌బుక్‌లో ఏవైనా మార్పులు జరిగినా, ఆరు గంటల తర్వాతే EPFO పోర్టల్‌లో కనిపిస్తాయి.


ఆధార్‌ లింక్‌ కాకపోయినా EPF డెత్ క్లెయిమ్‌


ఉద్యోగుల భవిష్య నిధి క్లెయిమ్‌లకు సంబంధించి, ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటీవల అతి పెద్ద ఊరట ప్రకటించింది. EPF ఖాతాకు ఆధార్ నంబర్‌ లింక్‌ కాని సభ్యుడు మరణిస్తే, క్లెయిమ్‌ ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ ఫీల్డ్‌ ఆఫీస్‌లకు EPFO కొత్త మార్గదర్శకాలు పంపింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం... నామినీకి చెందిన ఆధార్ నంబర్‌ను సిస్టమ్‌లో అప్‌లోడ్‌ చేస్తారు, JD ఫారంపై సంతకం చేయడానికి నామినీని అనుమతిస్తారు. మిగిలిన ప్రక్రియ మొత్తం యథాతథంగా కొనసాగుతుంది. ఒకవేళ, ఆ ఖాతాలో నామినీ పేరు కూడా లేకపోతే, అతని కుటుంబ సభ్యులు లేదా చట్టపరమైన వారసుల్లో ఒకరి ఆధార్‌ సమర్పించవచ్చు. దీనికి, మిగిలిన కుటుంబ సభ్యులు/చట్టపరమైన వారసుల సమ్మతి అవసరం. కొత్త మార్గదర్శకాలను ఈ నెల 17న EPFO ప్రకటించింది.


మరో ఆసక్తికర కథనం: పదేళ్లు దాటిన ఆధార్‌ కార్డ్‌ పని చేయదా, ఇప్పుడేం చేయాలి?