Credit Card: మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవాళ్లకు మాత్రమే ఏ బ్యాంకు అయినా క్రెడిట్ కార్డ్ ఇస్తుంది. మంచి స్కోర్ లేని వ్యక్తులకు క్రెడిట్ కార్డ్ దొరకడం కష్టం. అయితే, బ్యాడ్/పూర్ క్రెడిట్ స్కోర్ ఉన్నా కూడా, కచ్చితంగా క్రెడిట్ కార్డ్ పొందే సింపుల్ చిట్కా ఒకటి ఉంది. దీనిని ఫాలో అయితే, బ్యాంక్‌లు మరోమాట మాట్లాడకుండా కార్డ్ ఇష్యూ చేస్తాయి. మీరు షాపింగ్‌ల మీద షాపింగ్‌లు చేసుకోవచ్చు.
క్రెడిట్ స్కోర్ అంటే?
క్రెడిట్ స్కోర్‌ను మన ఆర్థిక క్రమశిక్షణకు ప్రతిరూపంగా చెప్పుకోవచ్చు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే రుణాలు, 'బయ్ నౌ పే లేటర్' వంటివాటిని తిరిగి సరిగా చెల్లిస్తున్నామో లేదో చెప్పే నంబరే క్రెడిట్ స్కోర్. ఇది 300-900 మధ్య ఉంటుంది. తీసుకున్న రుణాల మీద చేసే చెల్లింపుల ఆధారంగా ఈ 300-900 మధ్య ఒక నంబర్‌ను క్రెడిట్ స్కోర్‌గా మీకు కేటాయిస్తారు.
స్కోర్ పరమార్థం
800 నుంచి 900 : ఎక్స్‌లెంట్/ అద్భుతమైన స్కోరు
740 నుంచి 799: వెరీ గుడ్/ చాలా బాగుంది
670 నుంచి 739: గుడ్/ బాగుంది
580 నుంచి 669: ఫెయిర్/ పర్లేదు
300 నుంచి 579: పూర్/ అసలు బాగోలేదు
పూర్ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులు కూడా క్రెడిట్ కార్డును పొందాలంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ద్వారా సాధ్యమవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), SBM బ్యాంక్ (ఇండియా) సహా మరికొన్ని బ్యాంక్‌లు తమ FD ఖాతాదార్లకు క్రెడిట్ స్కోర్‌తో సంబంధం లేకుండా క్రెడిట్ కార్డ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డ్ పరిమితి FDలో 80- 90% వరకు ఉంటుంది. కార్డ్ హోల్డర్ నెలవారీ ఔట్ స్టాండింగ్ చెల్లించకపోతే, ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి ఆ మొత్తాన్ని బ్యాంక్ తీసుకుంటుంది. FDలపై ఇచ్చే క్రెడిట్ కార్డ్‌లపై టాక్స్‌లు, ఛార్జీలు ఇతర కార్డ్‌ల కంటే తక్కువగా ఉంటాయి.
ఎస్‌బీఐ కార్డ్ ఉన్నతి (SBI Card Unnati)
ఎస్‌బీఐ కార్డ్ ఉన్నతిపై నాలుగేళ్ల వరకు ఎలాంటి ఛార్జీ ఉండదు, ఫ్రీగా వాడుకోవచ్చు. ఐదో సంవత్సరం నుంచి ప్రతి ఏటా రూ. 499 చెల్లించాలి.
రూ. 25,000 లేదా అంతకంటే ఎక్కువ FD ఉంటే ఈ కార్డ్‌ను బ్యాంక్ జారీ చేస్తుంది.
ఐసీఐసీఐ ఇన్‌స్టంట్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ (ICICI Instant Platinum Credit Card)
ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్‌స్టంట్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ త్వరగా, ఉచిత క్రెడిట్ కార్డ్ పొందడానికి ఉత్తమ ఆప్షన్.
ఇందులో జాయినింగ్ లేదా వార్షిక ఛార్జీ ఉండదు.
యాక్సిస్ బ్యాంక్ ఇన్‌స్టా ఈజీ క్రెడిట్ కార్డ్ (Axis Bank Insta Easy Credit Card)
FD మొత్తంలో 80% వరకు ఇన్‌స్టా ఈజీ క్రెడిట్ కార్డ్ క్రెడిట్ పరిమితిగా జారీ చేస్తారు
ఔట్‌స్టాండింగ్ లేకపోతే 50 రోజుల పాటు ఉచిత క్రెడిట్ అందుబాటులో ఉంటుంది.
BOB అష్యూర్ క్రెడిట్ కార్డ్ (Bank of Baroda Assure credit card)
దీనిలో, అత్యవసర సమయంలో క్రెడిట్ పరిమితిలో 100% వరకు ఉపసంహరించుకోవచ్చు.
ఇది కూడా చదవండి: మీ దగ్గర ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉందా?, పేమెంట్స్ ట్రెండ్ ఇకపై మారిపోతుంది