Charges for Bank Transactions: మన దేశంలో కొన్ని కోట్ల మందికి బ్యాంక్ ఖాతాలు (bank accounts in India) ఉన్నాయి. బ్యాకింగ్ అన్నది ఇప్పటి ప్రజల రోజువారీ జీవనంలో ఒక భాగంగా మారింది. అయితే.., మీ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బును ఎప్పుడైనా విత్‌డ్రా (Withdraw money from your bank account) చేసుకోవచ్చని మీకు నమ్ముతున్నారా?. ఇదే నిజమని మీరు నమ్ముంతుంటే ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
మీ అకౌంట్‌లో ఉన్న మీ డబ్బులను మీరు తీసుకోవడానికి కూడా పన్ను (tax on money withdrawals) కట్టాల్సి ఉంటుంది. ఇలాంటి అనవసరమైన పన్నులు చెల్లించకుండా ఉండాలంటే, క్యాష్ విత్‌డ్రాను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ముందుగా, టాక్స్ బారిన పడకుండా సంవత్సరానికి ఎంత డబ్బు విత్‌డ్రా చేయవచ్చో తెలుసుకోవాలి. నిర్ణీత పరిమితికి మించి నగదు విత్‌డ్రా చేస్తే కొంత ఛార్జ్ చెల్లించాలనే నిబంధన ఏటీఎం లావాదేవీలకే కాదు, బ్యాంకుకు వెళ్లి డబ్బు తీసుకున్నా కూడా (charges on money withdrawals from the bank account) వర్తిస్తుంది.
బ్యాంక్ అకౌంట్ నుంచి ఎంత డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు? (limit of withdrawals from a bank account)
తమ బ్యాంకు ఖాతా నుంచి ఎంత నగదు కావాలంటే అంత మొత్తాన్ని ఎలాంటి ఛార్జ్ లేకుండా తీసుకోవచ్చని చాలా మంది ఖాతాదార్లు భావిస్తున్నారు. కానీ, విత్‌డ్రా లిమిట్ దాటితే అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194N ప్రకారం (Section 194N of the Income Tax Act), ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే TDS (Tax Deducted at Source) చెల్లించాల్సి ఉంటుంది. వరుసగా 3 సంవత్సరాలుగా ఆదాయపు పన్ను పత్రాలు (ITR) దాఖలు చేయని వారికి మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది. ఇలాంటి వాళ్లు... కమర్షియల్ బ్యాంకు లేదా కో-ఆపరేటివ్ బ్యాంక్ లేదా పోస్టాఫీసు నుంచి రూ.20 లక్షల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తే...
అయితే, ఐటీఆర్ ఫైల్ చేసే వారికి ఈ రూల్ కింద మరింత ఉపశమనం లభిస్తుంది. అటువంటి ఖాతాదారులు TDS చెల్లించకుండానే బ్యాంకు, పోస్టాఫీసు లేదా సహకార బ్యాంకు ఖాతా నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో కోటి రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఎంత TDS చెల్లించాలి? (TDS on withdrawals from a bank account)
ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ ప్రకారం, మీ బ్యాంక్ ఖాతా నుంచి కోటి రూపాయల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే, 2% TDS కట్ (TDS on money withdrawals) అవుతుంది. గత మూడు సంవత్సరాలుగా ITR ఫైల్ చేయకుండా, ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 20 లక్షల కంటే ఎక్కువ నగదు ఉపసంహరించుకుంటే, ఆ మొత్తంపై 2% TDS & కోటి రూపాయల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే 5% TDS చెల్లించాలి.
ATM లావాదేవీలపై ఛార్జ్‌లు (Charges on ATM transactions)
ఏటీఎం నుంచి నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ డబ్బు తీసుకుంటే బ్యాంకులు కొంత రుసుము వసూలు చేస్తాయి. 2022 జనవరి 1 నుంచి, ATM నుంచి క్యాష్ విత్‌డ్రా చేస్తే వసూలు చేసే సర్వీస్ ఛార్జీని రిజర్వ్ బ్యాంక్ (RBI) పెంచింది. ఇప్పుడు, నిర్ణీత సంఖ్యకు మించిన లావాదేవీలకు రూ.21 చొప్పున బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. గతంలో ఇది రూ.20గా ఉంది. చాలా బ్యాంకులు తమ ATMల నుంచి ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీలను అందిస్తున్నాయి. ఇది కాకుండా, ఇతర బ్యాంకుల ATMల నుంచి కూడా మూడు లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు. మెట్రో నగరాల్లో అయితే... సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి ఉచితంగా మూడు సార్లు మాత్రమే డబ్బు తీసుకోవచ్చు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవే