Business News In Telugu | పర్సనల్ లోన్స్ అనేవి వైద్య అత్యవసరాలు, ప్రయాణము లేదా ఇంటి పునర్నిర్మాణం వంటివి కవర్ చేయటానికి చాలా మంచి మార్గము. అయితే, వీటి ఆమోదము మీ క్రెడిట్ స్కోర్, డెట్-టు-ఇన్కం నిష్పత్తి మరియు ఆర్ధిక స్థిరత్వము వంటి కీలకమైన అర్హత ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. చాలామంది దరఖాస్తుదారులు సవాళ్ళను ఎదుర్కొంటారు, కాని శుభవార్త ఏమిటంటే, కొన్ని వ్యూహాత్మక ఆర్ధిక చర్యలలో మీరు మీ అర్హతను పెంచుకోవచ్చు. అనుకూలమైన నిబంధనలతో ఒక ఋణాన్ని సురక్షితం చేసే అవకాశాలను పెంచుకొనుటకు మీ క్రెడిట్ ప్రొఫైల్ ను బలోపేతం చేసుకోండి, బాకీ అప్పులను తగ్గించుకోండి మరియు స్థిరమైన ఆదాయాన్ని నిలిపి ఉంచుకోండి.
మీ పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపరచుకొనుటకు విధానాలు
1. అత్యధిక క్రెడిట్ స్కోర్ కలిగి ఉండండి
పర్సనల్ లోన్ అర్హతను నిర్ణయించుటలోని కీలకమైన కారకాలలో మీ క్రెడిట్ స్కోర్ ఒకటి. 685 లేదా అంతకు మించి ఉన్న స్కోర్ ఆమోదము పొందే అవకాశాలను పెంచుతుంది. మెరుగైన వడ్డీ రేట్ల వద్ద మరింత ఎక్కువ పర్సనల్ లోన్ ను పొందటానికి మంచి క్రెడిట్ స్కోర్ కూడా మీకు సహాయపడగలదు. దానిని ఎలా మెరుగుపరచుకోవాలి అనేది ఇక్కడ ఇవ్వబడింది:
-
మీ ఈఎంఐలు మరియు క్రెడిట్ కార్డ్ బిల్లులు అన్నిటిని సరైన సమయానికి చెల్లించండి
-
స్వల్పకాలములో అనేక ఋణాల కొరకు దరఖాస్తు చేయకండి.
-
మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని 30% కంటే తక్కువగా ఉండేలా చూసుకోండి.
2. పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ ను ఉపయోగించండి
ఒక పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేసే ముందు, మీ ఋణ అర్హతను పరీక్షించుకొనుటకు ఒక పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ ను ఉపయోగించండి. ఇది ఆదాయము, ప్రస్తుత బాధ్యతలు మరియు క్రెడిట్ చరిత్ర ఆధారంగా మీకు అర్హత ఉండే ఋణ మొత్తాన్ని అంచనా వేయుటలో సహాయపడుతుంది.
3. స్థిరమైన ఆదాయము మరియు ఉద్యోగ చరిత్రను నిర్ధారించండి
ఆర్ధిక సంస్థలు స్థిరమైన ఆదాయాన్ని మరియు దరఖాస్తుదారులకు వారి ప్రస్తుత ఉద్యోగములో ఉద్యోగము వచ్చిన కనీసము ఆరు నెలల వరకు ఉపాధిని ఉండాలని కోరుకుంటాయి. ఒకవేళ స్వయం-ఉపాధి పొందినవారైతే, స్థిరమైన రాబడులు ఉండేలా చూసుకోవడం మరియు సరైన ఆర్ధిక రికార్డులు అర్హతను మరింత బలోపేతం చేస్తాయి.
4. మీ ప్రస్తుత అప్పును తగ్గించుకోండి
అత్యధిక డెట్-టు-ఇన్కం (డిటిఐ) నిష్పత్తి మీ అర్హతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీ డిటిఐ ని తగ్గించుకొనుటకు:
-
దరఖాస్తు చేసే ముందు బాకీ ఉన్న ఋణాలు లేదా క్రెడిట్ కార్డ్ బకాయిలను చెల్లించండి
-
ఒకేసారి అనేక ఋణాలు తీసుకోకండి
-
ప్రస్తుతం ఉన్న ఆర్ధిక బాధ్యతలను సమతుల్యం చేసుకొనుటకు మీ ఆదాయాన్ని పెంచుకోండి
5. దీర్ఘకాల తిరిగిచెల్లింపు కాలపరిమితిని ఎంచుకోండి
దీర్ఘకాల కాలపరిమితిని ఎంచుకోవడం వలన మీ ఈఎంఐ భారం కొంత తగ్గుతుంది, తద్వారా ఆమోదం పొందే అవకాశాలు మెరుగుపడతాయి. అయితే, దీర్ఘకాలిక కాలపరిమితుల వలన అధికమొత్తములో వడ్డీ చెల్లింపులు చేయవలసిరావచ్చు అని గుర్తుపెట్టుకోండి.
6. అదనపు ఆదాయ మూలాలను ప్రకటింఅహ్ండి
పెట్టుబడులు, అద్దెలు లేదా ఫ్రీలాన్స్ పని నుండి మీకు అదనపు ఆదాయము ఉంటే, దానిని మీ దరఖాస్తులో ప్రకటించండి. అధిక ఆదాయ స్థాయి మీ తిరిగిచెల్లింపు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు అర్హతను పెంచుతుంది.
7. తరచూ ఋణము కొరకు దరఖాస్తు చేయకండి
ప్రతి ఋణ దరఖాస్తు కొరకు కఠినమైన విచారణ ఉంటుంది, ఇది మీ క్రెడిట్ స్కోర్ ను తగ్గించవచ్చు. అవసరమైనప్పుడు మాత్రమే పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేయండి మరియు ముందుగానే మీ అర్హత ప్రమాణాలను నెరవేరుస్తున్నారని నిర్ధారించుకొండి.
పర్సనల లోన్ అర్హతను మెరుగుపరచుకొనుట వలన ప్రయోజనాలు
మీ పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపరచుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి:
-
అధిక ఋణమొత్తాలు – ఒక శక్తివంతమైన క్రెడిట్ ప్రొఫైల్ ఉంటే మీరు ఎక్కువ మొత్తం ఋణాన్ని తీసుకోవచ్చు.
-
తక్కువ వడ్డీ రేట్లు – మంచి క్రెడిట్ స్కోర్ మరియు స్థిరమైన ఆదాయము, తక్కువ వడ్డీ రేట్లను నిర్ధారించుటలో సహాయపడతాయి.
-
వేగవంతమైన లోన్ ప్రాసెసింగ్ – అర్హత ప్రమాణాలను నెరవేర్చడం వలన ఆమోదము మరియు పంపిణి వేగవంతం అవుతాయి.
-
అనుకూలమైన తిరిగిచెల్లింపు నిబంధనలు – మంచి ఆర్ధిక స్థితితో, మీరు మరింత మెరుగైన తిరిగిచెల్లింపు ఎంపికలను అందుకోవచ్చు.
బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ ను ఎందుకు పరిగణించాలి?
ఒక పర్సనల్ లోన్ అనేక ప్రయోజనాలను అందిస్తూ వివిధ ఆర్ధిక అవసరాలకు ప్రాధాన్యత కలిగిన ఎంపికగా అయింది. దరఖాస్తు చేసేముందు, మీరు ఆమోదం పొందే అవకాశాలను నిర్ణయించుటకు ఒక పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ ఉపయోగించి మీ అర్హతను పరీక్షించుకోవచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ ఎందుకు గొప్ప ఎంపిక అనేదానికి కారణాలు:
-
కొల్లాటరల్ అవసరం లేదు– సురక్షితమైన ఋణాల మాదిరిగా కాకుండా, పర్సనల్ లోన్స్ కొరకు ఆస్తులను పూచీకత్తుగా పెట్టవలసిన పనిలేదు.
-
త్వరిత పంపిణి – 24 గంటలలోపు పంపిణీలతో చాలా ఆర్ధిక సంస్థలు ఋణాలను తక్షణమే ఆమోదిస్తాయి*.
-
బహులోపయోగ వినియోగము – నిధులను ప్రయాణము, వివాహాలు, వైద్య అత్యవసరాలు, లేదా ఇంటి పునర్నిర్మాణము వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు.
-
అనుకూలమైన తిరిగిచెల్లింపు కాలపరిమితి – మీరు 12 నుండి 96 నెలల మధ్య కాలపరిమితిని ఎంచుకోవచ్చు.
ముగింపు
అత్యధిక క్రెడిట్ స్కోర్ కలిగి ఉన్నప్పుడు, ఆర్ధిక బాధ్యతలు తగ్గించుకున్నప్పుడు మరియు స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉన్నప్పుడు ఒక పర్సనల్ లోన్ పొందడం సులభం అవుతుంది. దరఖాస్తు చేసే ముందు ఒక పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ ను ఉపయోగించడం మీకు ఉన్న అవకాశాలను అంచనా వేయడము మరియు అనవసరమైన తిరస్కరణలను నివారించడములో సహాయపడుతుంది. ఈ సులభమైన చిట్కాలను అనుసరించడం వలన, మీరు మీ అర్హతను మెరుగుపరచుకోవచ్చు, మెరుగైన ఋణము పొందవచ్చు మరియు సులభంగా మీ ఆర్ధిక లక్ష్యాలను సాధించవచ్చు.
*నియమ నిబంధనలు వర్తిస్తాయి.
Disclaimer: This article is a paid feature. ABP and/or ABP LIVE do not endorse/ subscribe to the views expressed herein. We shall not be in any manner be responsible and/or liable in any manner whatsoever to all that is stated in the said Article and/or also with regard to the views, opinions, announcements, declarations, affirmations, etc., stated/featured in the said Article. Accordingly, viewer discretion is strictly advised.