అన్వేషించండి

Best Alternative To Gold: బంగారంపై పెట్టడం కంటే నెలకు ఐదు వేలు ఇలా పొదుపు చేస్తే కోటీశ్వరులు కావచ్చు! పూర్తి వివరాలు ఇవే!

Best Alternative To Gold: బంగారం కొనవద్దని ప్రధానమంత్రి పిలుపునివ్వడంతో సంచలనంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయ పెట్టుబడులపై ప్రజలు దృష్టి పెట్టారు. ఈ స్కీమ్‌లో నెలకు ఐదు వేలు పెడితే కోటీశ్వరులు కావచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రధానమంత్రి మోదీ పిలుపుతో బంగారం బదులు NPS మంచి పెట్టుబడి.
  • నెలకు రూ.5000 NPS లో పెట్టుబడితో కోటిన్నర పొందండి.
  • NPS పథకం 30 ఏళ్లలో అధిక రాబడితో భవిష్యత్తుకు భరోసా.
  • NPS లో పన్ను మినహాయింపు, తక్కువ ఛార్జీలు, సులువుగా ఖాతా.

Best Alternative To Gold: దేశంలో ఆర్థిక పరిస్థితులు చాలా భయానకంగా ఉన్నాయి. దీని నుంచి బయటపడేందుకు కేంద్రం దారులు వెతుకుతోంది. అందులో భాగంగానే ఏడాది పాటు బంగారం కొనవద్దని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి మోదీ. అయితే బంగారం కొన వద్దని పిలుపునివ్వడంతో చాలా మంది ప్రత్యామ్నాయ పెట్టుబడులపై దృష్టి పెట్టారు. నెలకు ఐదు వేల వరకు పెట్టుబడి పెట్టగలిగితే మీరు కోటీశ్వర్లు కావచ్చు. అ పథకం పేరే నేషనల్‌ పెన్షన్ సిస్టమ్‌(NPS). కేవలం క్రమశిక్షణతో కూడిన చిన్న మొత్తు పెట్టుబడితో మీ భవిష్యత్‌ను ఎలా సురక్షితం చేసుకోవచ్చో తెలుసుకుందాం. 

ఏంటీ ఈ ఎన్‌ఎస్‌పీ

నేషనల్‌ పెన్షన్ సిస్టమ్‌ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక స్వచ్ఛంద, దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. ఇది మార్కెట్‌ ఆధారిత రాబడులను అందిస్తూనే, పదవి విరమణ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని అందించేలా రూపొందించారు. ఇందులో ఇన్వెస్ట్‌ చేసే మొత్తం నిపుణులైన ఫండ్ మేనేజర్ల ద్వారా ఈక్విటీ, డెట్‌ ఇన్స్ట్రుమెంట్లలో పెట్టుబడి పెట్టనున్నారు. తద్వారా సంప్రదాయ పథకాల కంటే మెరుగైన రాబడులు వచ్చే అవకాశం ఉంది. 

ఐదు వేలతో కోటి రూపాయలు సంపాదించడం ఎలా 

చాలా మందికి నెలకు ఐదు వేల పెట్టుబడితో కోటి రూపాయలు సాధ్యమేనా అనే డౌట్ వస్తుంది. కానీ కాంపౌండింగ్‌ శక్తి ద్వారా ఇది సాధ్యమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వనరుల ఆధారంగా చిన్న ఉదాహరణతో అర్థమయ్యేలా చూద్దాం. 

Also Read: బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!

 మంచి ఉదాహరణ ఇదే 

మీ వయసు 30 సంవత్సరాలు అనుకుంటే మీరు మరో 30 ఏళ్ల తర్వాత  రిటైర్ అవుతారు. ఆ లెక్కన నెలకు 5వేల చొప్పున పెట్టుబడి పడితే ఏడాదికి సగటున పది శాతం  వడ్డీ లభిస్తే మీకు భారీ లాభం. ఈ లెక్కన చూస్తే మీరు 30 ఏళ్లలో 18 లక్షల పెట్టుబడి పెడతారు. కానీ పది శాతం వార్షిక వడ్డీ రేటుతో మీరు పొందే వడ్డీ రాబడి సుమారు 95,96,000 అవుతుంది. ఫలితంగా 60 ఏళ్లు వయసులో మీ చేతికి వచ్చే మొత్తం కార్పస్‌ సుమారు 1,13,96,000 రూపాయలుగా ఉంటుంది. 

Also Read: ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే ప్రతి ఏడాది E-KYC తప్పనిసరి.. లేకపోతే సబ్సిడీ బంద్

ఒకేసారి మొత్తం తీసుకోవచ్చా?

ఎన్‌పీఎస్ నుంచి రిటైర్మెంట్‌ సమయంలో మొత్తం సొమ్మును ఒకేసారి తీసుకోవాడనికి వీలుండదు. రూల్స్ ప్రకారం 1.14 కోట్లలో సుమారు 68.37 లక్షలు మీరు ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ మొత్తంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదు. మిగిలిన 40 శాతం అంటే 45.58 లక్షలను తప్పనిసరిగా యాన్యుటీలో ఉంచాలి. ఈ మొత్తం ద్వారా మీకు జీవితాంతం ప్రతి నెల పింఛన్ రూపంలో వస్తుంది. 

Also Read: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!

ఎన్‌పీఎస్ కేవలం పెన్షన్ స్కీమ్ మాత్రమే కాదు. తెలివైన టాక్స్ సేవింగ్ టూల్ కూడా. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద లభించే 1.5 లక్ష పరిమితికి అదనంగా సెక్షన్ 80సీసీడీ కింద మరో 50వేల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇతర ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్లతో పోలిస్తే ఎన్‌పీఎస్‌లో ఫండ్ మేనేజ్మెంట్‌ ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. 

Also Read: మీ ఇంట్లోని బంగారం ఇక ఆదాయ వనరు- కేంద్రం సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీ! ఇవిగో ఫుల్ డీటైల్స్

ఎన్పీఎస్ ఖాతా తెరవాలంటే ఏం కావాలి?

ఎన్‌పీఎస్‌లో ఎంత త్వరగా పెట్టుబడి ప్రారంభిస్తే అంత ఎక్కువ లాభం ఉంటుంది. 18 ఏళ్ల నుంచి ఎవరైనా ఇందులో చేరవచ్చు. దీని కోసం ఆధార్ కార్డ్, పాన్ కార్డు, మొబైల్ నెంబర్, బ్యాంకు ఖాతా వివరాలు ఉంటే సరిపోతుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో లేదా ఆన్‌లైన్‌ ద్వారా కేవలం పది నిమిషాల్లో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. 

Also Read: క్రెడిట్ కార్డ్ బిల్లు ఓవర్‌డ్యూ ఉందా ? బ్యాంక్ సెటిల్‌మెంట్ ఆఫర్ మీకు లాభమా? నష్టమా !

షరతులు వర్తిస్తాయి

ఎన్‌పీఎస్ అనేది మార్కెట్ ఆధారిత పథకం, కాబట్టి రాబడులు స్థిరంగా ఉండవు. మార్కెట్ ఒడిదుకుడుకులను బట్టి వడ్డీ రేట్లలో మార్పులు ఉండొచ్చు. అలాగే, ఇది ఒక దీర్ఘకాలిక లాక్ ఇన్‌ పీరియడ్‌ కలిగిన పథకం. అయితే, అత్యవసర పరిస్థితుల్లో కొన్ని షరతులతో కూడిన పాక్షిక ఉపసంహరణలకు అవకాశం ఉంటుంది. 

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Frequently Asked Questions

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) అంటే ఏమిటి?

NPS అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛంద, దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. ఇది మార్కెట్ ఆధారిత రాబడులను అందిస్తూ, పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని అందించడానికి రూపొందించబడింది.

నెలకు 5 వేల పెట్టుబడితో కోటి రూపాయలు ఎలా సంపాదించవచ్చు?

కాంపౌండింగ్ శక్తి ద్వారా ఇది సాధ్యం. 30 ఏళ్ల వయసులో నెలకు 5 వేల చొప్పున, 10% వార్షిక వడ్డీతో 30 ఏళ్లలో పెట్టుబడి సుమారు 1.14 కోట్లు అవుతుంది.

NPS నుండి పదవీ విరమణ సమయంలో డబ్బును ఎలా తీసుకోవచ్చు?

పదవీ విరమణ సమయంలో మొత్తం డబ్బును ఒకేసారి తీసుకోలేరు. సుమారు 68.37 లక్షలు పన్ను లేకుండా తీసుకోవచ్చు, మిగిలిన 40% (45.58 లక్షలు) యాన్యుటీలో ఉంచాలి, ఇది నెలవారీ పెన్షన్ ఇస్తుంది.

NPS పన్ను ఆదా చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది?

NPS ఒక తెలివైన పన్ను ఆదా సాధనం. సెక్షన్ 80C కింద 1.5 లక్షలకు అదనంగా, సెక్షన్ 80CCD కింద మరో 50 వేల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.

NPS ఖాతా తెరవడానికి ఏమి అవసరం?

NPS ఖాతా తెరవడానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మొబైల్ నంబర్, మరియు బ్యాంకు ఖాతా వివరాలు అవసరం. 18 ఏళ్ల నుంచి ఎవరైనా ఈ ఖాతాను తెరవవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Shani Dev Story: నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
Embed widget