Paytm Update: పేటీఎం బ్రాండ్‌తో ఆర్థిక సేవలు అందిస్తున్న ఫిన్‌టెక్ దిగ్గజం వన్‌97 కమ్యూనికేషన్స్‌కు ‍‌(One97 Communications Ltd - OCL) విజయ్ శేఖర్ శర్మ సోలో ఓనర్‌గా మారారు. చైనాకు చెందిన దిగ్గజ అలీబాబా గ్రూప్ మద్దతు ఉన్న యాంట్‌ఫిన్, పేటీఎంలో తన వాటను 23.79% నుంచి 9.90%కి తగ్గించుకుంది. అందువల్ల, కంపెనీ ఫౌండర్‌ & CEO అయిన శర్మ, పేటీఎం ఏకైక సిగ్నిఫికంట్‌ బెనిఫిషియల్‌ ఓనర్‌ (Significant Beneficial Owner - SBO) అయ్యారు. 


ఆదివారం నాడు, రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేటీఎం చెప్పింది ఇది - "కంపెనీ మొత్తం ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో యాంట్‌ఫిన్ వాటా 23.79% నుంచి 9.90%కి తగ్గిందని ఆ సంస్థ నుంచి మాకు సమాచారం అందింది. దీని ప్రకారం, యాంట్‌ఫిన్‌తో సంబంధం ఉన్న ఏ వ్యక్తికి కూడా కంపెనీ సిగ్నిఫికంట్‌ బెనిఫిషియల్‌ ఓనర్‌గా అర్హత లేదు".


క్రమంగా ఎగ్జిట్‌ అవుతున్న యాంట్‌ఫిన్ 


గత కొన్ని వారాల్లో, విజయ్ శేఖర్ శర్మ పూర్తి యాజమాన్యంలో విదేశీ సంస్థ 'రెసిలెంట్ అసెట్ మేనేజ్‌మెంట్ B.V.'కు, పేటీఎంలో తనకున్న 10.3% వాటాను యాంట్‌ఫిన్ అమ్మింది. దీంతో, ఈ కంపెనీ స్టేక్‌ 23.79% నుంచి భారీగా తగ్గింది. ఆ తర్వాత బ్లాక్ డీల్స్‌లో మరో 3.6% అమ్మకాలు జరిగాయి.


షేర్‌ హోల్డింగ్‌ డేటా మారిన తర్వాత, OCLలో ప్రత్యక్షంగా & పరోక్షంగా శర్మ మొత్తం వాటా 19.42%కు చేరింది, ఇది అతనిని కంపెనీకి ఏకైక SBOగా మార్చింది. అయితే, గుర్తింపు పొందిన ప్రమోటర్ లేని కంపెనీగా పేటీఎం మిగిలిపోయింది. భారతీయ చట్టాల ప్రకారం, ఒక కంపెనీకి ఎవరినైనా ప్రమోటర్‌గా అధికారికంగా గుర్తించాలంటే ఆ వ్యక్తి/సంస్థ వాటా 25% పైన ఉండాలి.


శర్మ SBO అయితే వచ్చే మార్పులేంటి?
శర్మ SBO అవ్వడం వల్ల పేటీఎం స్టాక్‌పై చైనీస్ చికాకులు తగ్గుతాయని మార్కెట్‌ ఎనలిస్ట్‌లు భావిస్తున్నారు. దీంతోపాటు, భవిష్యత్‌లో కంపెనీకి రాబోయే ప్రధాన స్ట్రాటెజిక్‌ ఇన్వెస్టర్ల రిస్క్‌ను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. రెగ్యులేటరీ అంశాల పరంగా కూడా ఇది పేటీఎంకు సానుకూలంగా మారుతుందని  ఎనలిస్ట్‌లు భావిస్తున్నారు.


గత సెషన్‌లో (శుక్రవారం, 01 సెప్టెంబర్‌ 2023), BSEలో 0.42% పెరిగి రూ. 857.20 వద్ద ముగిసిన పేటీఎం షేర్ ప్రైస్‌ ఇవాళ (సోమవారం, 04 సెప్టెంబర్‌ 2023) ఫ్లాట్‌గా రూ.858.10 వద్ద ఓపెన్‌ అయింది. ఉదయం 10.15 గంటల సమయానికి 0.50% గ్రీన్‌ కలర్‌తో రూ.861.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


పేటీఎం స్టాక్‌ గత నెల రోజుల్లో 8% పైగా పెరిగింది. ఆరు నెలల్లో ఈ కంపెనీ షేర్లు దాదాపు 38% ర్యాలీ చేశాయి. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు (YTED) దాదాపు 62% జూమ్ అయ్యాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఇవాళ్టి రేట్లివి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial