search
×

Stock Market Closing: 60K టచ్‌ చేసిన సెన్సెక్స్‌ - ఆటో, ఆయిల్‌ షేర్లకు గిరాకీ!

Stock Market Closing 28 October 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం మోస్తరుగా లాభపడ్డాయి. ఆటో, ఆయిల్‌ షేర్లకు గిరాకీ కనిపించింది.

FOLLOW US: 

Stock Market Closing 28 October 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం మోస్తరుగా లాభపడ్డాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందనప్పటికీ మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఆటో, ఆయిల్‌ షేర్లకు గిరాకీ కనిపించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 49 పాయింట్ల లాభంతో 17,786 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 203 పాయింట్ల లాభంతో 59,959 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు లాభపడి 82.47 వద్ద స్థిరపడింది.

BSE Sensex

క్రితం సెషన్లో 59,756 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,742 వద్ద మొదలైంది. 59,739 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,133 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 203 పాయింట్ల లాభంతో 59,959 వద్ద ముగిసింది.

NSE Nifty

News Reels

గురువారం 17,736 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,756 వద్ద ఓపెనైంది. 17,723 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,838 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 49 పాయింట్ల లాభంతో 17,786 వద్ద స్థిరపడింది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 41,236 వద్ద మొదలైంది. 40,839 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,482 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 308 పాయింట్ల నష్టంతో 40,990 వద్ద ముగిసింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభాల్లో 19 నష్టాల్లో ఉన్నాయి. మారుతీ, రిలయన్స్‌, అపోలో హాస్పిటల్స్‌, ఎన్‌టీపీసీ, హీరోమోటో కార్ప్‌ షేర్లు లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, సన్‌ ఫార్మా, గ్రాసిమ్‌, దివిస్‌ ల్యాబ్‌ నష్టపోయాయి. ఆటో, ఆయిల్‌ గ్యాస్‌ సూచీలు స్వల్పంగా ఎగిశాయి. బ్యాంకు, ఐటీ, మీడియా, మెటల్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌ రంగాలపై సెల్లింగ్‌ ప్రెజర్‌ నెలకొంది. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BSEIndia (@bseindia)

Published at : 28 Oct 2022 04:11 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

సంబంధిత కథనాలు

Stock Market Closing 29 November 2022: షైనింగ్‌.. షైనింగ్‌! రికార్డు లాభాల్లో క్లోజైన నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Closing 29 November 2022: షైనింగ్‌.. షైనింగ్‌! రికార్డు లాభాల్లో క్లోజైన నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Opening: తగ్గేదే లే! ఎవరెస్టు ఎక్కేందుకు రెడీగా నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Opening: తగ్గేదే లే! ఎవరెస్టు ఎక్కేందుకు రెడీగా నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Closing: పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్ల జోష్‌! స్వల్ప లాభాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market Closing: పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్ల జోష్‌! స్వల్ప లాభాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market Closing: అమేజింగ్‌ రికవరీ! పీఎస్‌యూ అండతో సెన్సెక్స్‌, నిఫ్టీ దూకుడు

Stock Market Closing: అమేజింగ్‌ రికవరీ! పీఎస్‌యూ అండతో సెన్సెక్స్‌, నిఫ్టీ దూకుడు

Stock Market Closing: తేరుకున్న సెన్సెక్స్‌, నిఫ్టీ, రూపాయి - ప్రభుత్వ బ్యాంకు షేర్లు భళా!

Stock Market Closing: తేరుకున్న సెన్సెక్స్‌, నిఫ్టీ, రూపాయి - ప్రభుత్వ బ్యాంకు షేర్లు భళా!

టాప్ స్టోరీస్

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్