search
×

Stock Market Opening: ప్రాఫిట్‌ బుకింగ్‌తో నష్టాల్లో సూచీలు - పవర్‌, ఆటో, ఐటీ షేర్లపై సెల్లింగ్‌ ప్రెజర్‌

Stock Market Opening 02 December 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో మొదలయ్యాయి. సూచీలు గరిష్ఠాలకు చేరడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు.

FOLLOW US: 
Share:

Stock Market Opening 02 December 2022:

భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. సూచీలు గరిష్ఠాలకు చేరడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 114 పాయింట్ల నష్టంతో 18,698 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 397 పాయింట్ల నష్టంతో 62,886 వద్ద ట్రేడవుతున్నాయి. పవర్‌, ఆటో, ఐటీ షేర్లపై సెల్లింగ్‌ ప్రెజర్‌ కనిపిస్తోంది.

BSE Sensex

క్రితం సెషన్లో 63,284 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,978 వద్ద మొదలైంది. 62,857 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,148 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 397 పాయింట్ల నష్టంతో 62,886 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty

గురువారం 18,812 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,752 వద్ద ఓపెనైంది. 18,689 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,781 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 114 పాయింట్ల నష్టంతో 18,698 వద్ద చలిస్తోంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ఉంది. ఉదయం 42,976 వద్ద మొదలైంది. 42,961 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,127 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 210 పాయింట్లు పతనమై 43,050 వద్ద ట్రేడవుతోంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 13 కంపెనీలు లాభాల్లో 37 నష్టాల్లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్‌, ఓఎన్‌జీసీ, గ్రాసిమ్‌, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌ లాభపడ్డాయి. ఐచర్‌ మోటార్స్‌, ఎం అండ్‌ ఎం, దివిస్‌ ల్యాబ్‌, సిప్లా, టాటా కన్జూమర్‌ నష్టపోయాయి. మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ సూచీలు ఎగిశాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాల సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Also Read: అంబానీ ఫస్ట్‌, అదానీ లాస్ట్‌ - అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్‌

Also Read: నవంబర్‌ నెలలోనూ కార్‌ సేల్స్‌లో హై స్పీడ్‌ - టాప్‌ గేర్‌లో మారుతి, హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BSEIndia (@bseindia)

Published at : 02 Dec 2022 11:32 AM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Best MFs: మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఇది రివార్డింగ్‌ టైమ్‌, ఈ నెలలో ఇన్వెస్ట్‌ చేయగల బెస్ట్‌ ఫండ్స్ ఇవి

Best MFs: మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఇది రివార్డింగ్‌ టైమ్‌, ఈ నెలలో ఇన్వెస్ట్‌ చేయగల బెస్ట్‌ ఫండ్స్ ఇవి

Best Equity Funds: గత పదేళ్లుగా అదరగొడుతున్న బెస్ట్‌ ఈక్విటీ ఫండ్స్‌ - వీటి ట్రాక్ రికార్డ్‌ కేక

Best Equity Funds: గత పదేళ్లుగా అదరగొడుతున్న బెస్ట్‌ ఈక్విటీ ఫండ్స్‌ - వీటి ట్రాక్ రికార్డ్‌ కేక

ETFs: ఈటీఎఫ్‌ అంటే ఏంటి - ఎన్ని రకాలు ఉన్నాయి, ఏది బెస్ట్‌?

ETFs: ఈటీఎఫ్‌ అంటే ఏంటి - ఎన్ని రకాలు ఉన్నాయి, ఏది బెస్ట్‌?

Debt Fund: డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ అంటే ఏంటి! - సరైన ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి?

Debt Fund: డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ అంటే ఏంటి! - సరైన ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి?

Investment Opportunity: కొత్త ఫండ్‌ ఆఫర్లు వస్తున్నాయ్‌, పెట్టుబడిదార్లకు భలే అవకాశం!

Investment Opportunity: కొత్త ఫండ్‌ ఆఫర్లు వస్తున్నాయ్‌, పెట్టుబడిదార్లకు భలే అవకాశం!

టాప్ స్టోరీస్

IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా

IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా

Telangana Graduate MLC : తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్

Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్

Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన

Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన

Nominations Over : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !

Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !