By: ABP Desam | Updated at : 22 May 2023 03:52 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : pixel )
Stock Market Closing 22 May 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. అదానీ గ్రూప్ కంపెనీల జోరుతో మదుపర్లు ఉత్సాహంగా కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 110 పాయింట్లు పెరిగి 18,314 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 234 పాయింట్లు పెరిగి 61,963 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 16 పైసలు బలహీనపడి 82.82 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,729 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,579 వద్ద మొదలైంది. 61,579 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,044 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 234 పాయింట్ల లాభంతో 61,963 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 18,203 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 18,201 వద్ద ఓపెనైంది. 18,178 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,335 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 110 పాయింట్లు పెరిగి 18,314 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 43,935 వద్ద మొదలైంది. 43,684 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,026 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 84 పాయింట్లు తగ్గి 43,855 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 34 కంపెనీలు లాభాల్లో 15 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, దివిస్ ల్యాబ్, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. హీరో మోటో, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, ఐచర్ మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, ప్రైవేటు బ్యాంక్ సూచీలు ఎరుపెక్కాయి. ఐటీ, మెటల్ ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.61,410గా ఉంది. కిలో వెండి రూ.300 తగ్గి రూ.75,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.120 తగ్గి రూ.28,240 వద్ద కొనసాగుతోంది.
Also Read: ₹2000 నోట్ల డిపాజిట్లకు పాత రూల్ - పరిమితి దాటితే PAN ఇవ్వాల్సిందే
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Hedge using S&P BSE Sensex and S&P BSE Bankex Derivatives#Sensex #Bankex #FridayExpiry #ReducedLotSize pic.twitter.com/2woNRBHTSx
— BSE India (@BSEIndia) May 22, 2023
BSE relaunches BANKEX and S&P SENSEX, trade on ultra-low latency algo trading platform from Multitrade Softech#BSE #Bankex #Sensex #Multitrade #algotrading #strategy #BOTTRADING #trading #stockmarkets @BSEIndia @SENSEX_BSE pic.twitter.com/Zq9tgjqF0a
— Multitrade Softech (@multitradeIN) May 20, 2023
Stock Market News: 18,600 కిందకు నిఫ్టీ - సెన్సెక్స్ 223 పాయింట్లు ఫాల్, పెరిగిన రూపాయి
Paytm Shares: పేటీఎం 'కరో.. కరో.. కరో జల్సా'! వారంలో 22% గెయిన్ - 10 నెలల గరిష్ఠానికి షేర్లు!
Stock Market News: ఫ్లాట్.. ఫ్లాట్.. ఫ్లాట్! స్వల్ప నష్టాల్లో మొదలైన సెన్సెక్స్, నిఫ్టీ
Stock Market News: స్టాక్ మార్కెట్లో జజ్జనక! 18,700 పైన నిఫ్టీ, 63,142 వద్ద సెన్సెక్స్ క్లోజింగ్!
Stock Market News: టర్న్ అరౌండ్ అయిన సెన్సెక్స్, నిఫ్టీ - ఎరుపెక్కిన ఐటీ ఇండెక్స్!
Telangana Poltics : తెలంగాణ చీఫ్‌ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుతుంది ?
Devineni Uma : అహంకారం వల్లే ఓడిపోయాం - దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు !
NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?
Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!