search
×

Stock Market News: ఆఖర్లో తగ్గినా.. ప్రాఫిట్స్‌లోనే సెన్సెక్స్‌, నిఫ్టీ! రియాల్టీ, ఆటో షేర్లకు గిరాకీ

Stock Market Closing 06 April 2023: స్టాక్‌ మార్కెట్లు గురువారం మోస్తరు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు ఓపెనయ్యాక మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు.

FOLLOW US: 
Share:

Stock Market Closing 06 April 2023: 

స్టాక్‌ మార్కెట్లు గురువారం మోస్తరు లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. రెపోరేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం మదుపర్లలో పాజిటివ్‌ సెంటిమెంటు నింపింది. ఐరోపా మార్కెట్లు ఓపెనయ్యాక మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 42 పాయింట్లు పెరిగి 17,599 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 143 పాయింట్లు పెరిగి 59,832 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు బలపడి 81.99 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 59,689  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,627 వద్ద మొదలైంది. 59,520 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,950 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 143 పాయింట్ల లాభంతో 59,832 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

బుధవారం 17,557 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,533 వద్ద ఓపెనైంది. 17,502 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,638 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 42 పాయింట్లు పెరిగి 17,599 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 40,940 వద్ద మొదలైంది. 40,820 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,274 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 41 పాయింట్లు పెరిగి 41,041 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభాల్లో 20 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటాన్‌ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, ఫైనాన్స్‌, మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌, హెల్త్‌కేర్‌ సూచీలు ఎగిశాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.60,980 గా ఉంది. కిలో వెండి రూ.600 తగ్గి రూ.76,490 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.640 తగ్గి రూ.26,330 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 06 Apr 2023 03:46 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news BSE Sensex

సంబంధిత కథనాలు

Mutual Funds: స్మార్ట్‌గా డబ్బు సంపాదించిన స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌, మూడేళ్లలో 65% రిటర్న్‌

Mutual Funds: స్మార్ట్‌గా డబ్బు సంపాదించిన స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌, మూడేళ్లలో 65% రిటర్న్‌

Stock Market News: 18,500 మీదే నిఫ్టీ క్లోజింగ్‌ - ఆటో, రియాల్టీ, మెటల్స్‌ బూమ్‌!

Stock Market News: 18,500 మీదే నిఫ్టీ క్లోజింగ్‌ - ఆటో, రియాల్టీ, మెటల్స్‌ బూమ్‌!

Stock Market News: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న నిఫ్టీ, సెన్సెక్స్‌ - హీరో మోటో దూకుడు!

Stock Market News: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న నిఫ్టీ, సెన్సెక్స్‌ - హీరో మోటో దూకుడు!

Stock Market News: రెడ్‌ జోన్లో సూచీలు - 18,500 నిఫ్టీ క్లోజింగ్‌!

Stock Market News: రెడ్‌ జోన్లో సూచీలు - 18,500 నిఫ్టీ క్లోజింగ్‌!

Stock Market: లైఫ్‌ టైమ్‌ హై ముందు మార్కెట్లో వొలటిలిటీ - సెన్సెక్స్‌ 327 పాయింట్లు డౌన్‌!

Stock Market: లైఫ్‌ టైమ్‌ హై ముందు మార్కెట్లో వొలటిలిటీ - సెన్సెక్స్‌ 327 పాయింట్లు డౌన్‌!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి