PNG Imported Like LPG | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా పలు దేశాల్లో ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం చూపుతోంది. అయితే ఎల్‌పీజీ సిలిండర్లతో పోలిస్తే అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో పీఎన్‌జీ (PNG) సరఫరా అయితే చాలా భిన్నంగా ఉంటుంది. పీఎన్‌జీని కూడా ఎగుమతి,  దిగుమతి చేయవచ్చు. కానీ ఎల్పీజీతో పోల్చితే దీని ప్రాసెస్ చాలా వేరుగా ఉంటుంది. పీఎన్జీ ఎలా రవాణా చేస్తారు, ప్రాసెస్ వివరాలు ఇక్కడ  తెలుసుకుందాం.

Continues below advertisement

PNG vs LPG సరఫరాలో వ్యత్యాసం ఏమిటి?ఎల్‌పీజీని నిల్వ చేయడంతో పాటు ఒక చోటు నుండి మరో చోటుకు తీసుకెళ్లడం చాలా ఈజీ. ఎందుకంటే దీనిని సిలిండర్లలో నింపి ట్రక్కులు లేదా ఓడల ద్వారా సముద్ర మార్గం ద్వారా పంపవచ్చు. కానీ పీఎన్‌జీలో ప్రధానంగా మీథేన్ వాయువును కలిగి ఉంటుంది. ఆ వాయువును ఎల్పీజీ తరహాలో మెయింటైన్ చేయలేరు. పీఎన్జీని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లాలంటే మొదట ద్రవ రూపంలోకి మార్చాలి లేదా పైప్‌లైన్ ద్వారా పంపాలి.

Continues below advertisement

పీఎన్జీ దిగుమతి చేసుకునే పద్ధతి ఇదీపీఎన్‌జీ (PNG)ని దిగుమతి చేసుకోవడానికి అత్యంత ఎక్కువగా ఉపయోగించే పద్ధతి దానిని 'లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్' (LNG)గా మార్చుకోవాలి. ఈ ప్రక్రియలో నేచురల్ గ్యాస్‌ను సుమారు -162 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లబరుస్తారు. దీనివల్ల అది ద్రవ రూపంలోకి మారుతుంది. మరోవైపు దాని ఘనపరిమాణం సుమారు 600 రెట్లు తగ్గుతుంది. దీనివల్ల ప్రత్యేకమైన క్రయోజెనిక్ ఓడలను ఉపయోగించి సుదూర ప్రాంతాలకు పెద్ద మొత్తంలో ఈ గ్యాస్‌ను ఎగుమతి, దిగుమతి చేయడం సాధ్యమవుతుంది.

రవాణా చేసి, తిరిగి వాయువుగా మార్చడంఒకసారి ఎల్‌ఎన్‌జీగా మారిన తర్వాత ఈ ఇంధనాన్ని ప్రత్యేకంగా రూపొందించిన ట్యాంకర్ ఓడల్లో నింపి సముద్ర మార్గం ద్వారా తరలిస్తారు.  ఇది గమ్యస్థాన దేశాలకు చేరుకున్నప్పుడు, దానిని టెర్మినల్‌కు పంపిస్తారు ఇక్కడ దానిని తిరిగి వాయువుగా మారుస్తారు. గ్యాస్‌గా మారిన తర్వాత, పైప్‌లైన్ల ద్వారా ఇళ్లు, పరిశ్రమలతో పాటు విద్యుత్ ప్లాంట్లకు సైతం పీఎన్‌జీ రూపంలో సరఫరా చేస్తారు.

పైప్‌లైన్ నెట్‌వర్క్పీఎన్‌జీని ఒక చోటు నుండి మరో చోటుకు తీసుకెళ్లడానికి మరొక మార్గం బార్డర్ పైప్‌లైన్లను ఉపయోగించడం. ఈ పైప్‌లైన్లను భూమి పైన లేదా నీటి అడుగున కూడా వేయవచ్చు. అయితే దీనికి భారీ పెట్టుబడితో పాటు భౌగోళికంగా ఇతర దేశాలతో రాజకీయ సహకారం ఉండాలి. లేకపోతే పీఎన్జీ సరఫరా చేయడం కష్టమే. 

పీఎన్జీ సరఫరా ఎందుకు కష్టం?ఎల్‌పీజీ (LPG)లా కాకుండా పీఎన్‌జీకి చాలా చల్లని స్టోరేజ్ (Cold Storage) లేదా పెద్ద పైప్‌లైన్ నెట్‌వర్క్ అవసరం పడుతుంది. ఈ కారణంగా దీని దిగుమతి, ఎగుమతి చాలా ఖరీదైనవి, టెక్నాలజీ పరంగానూ సవాలుతో కూడుకున్నవిగా మారుతాయి.