Gold Price: గోల్డ్ వేగం ఇప్పుడు నెమ్మదిస్తుంది. 2025 ఏప్రిల్ నెలలో 3,500 డాలర్లు రికార్డు స్థాయిలో ఔన్స్‌ ధర పెరిగింది. ఇప్పుడు బంగారం ధర‌ల్లో తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం బంగారం 3,250 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది బంగారం ఆల్‌ టైం గరిష్టం కంటే సుమారు 250 డాలర్లు లేదా 7 శాతం తక్కువ. గత 9 నెలల్లో బంగారం దాదాపు 50 శాతం పెరుగుదలను చూపించింది. కానీ ఇప్పుడు పెట్టుబడిదారులలో ర్యాలీ ఆగిపోయిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి?

గోల్డ్-సిల్వర్, గోల్డ్-ప్లాటినం నిష్పత్తి హెచ్చరిక 

ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, గోల్డ్/సిల్వర్ నిష్పత్తి ప్రస్తుతం 1:100 స్థాయికి చేరుకుంది, దీని అర్థం ఒక ఔన్స్ బంగారం కొనడానికి 100 ఔన్స్ వెండి అవసరం. చరిత్ర చూస్తే ఈ నిష్పత్తి 1:70 దగ్గరగా ఉండేది. అదేవిధంగా, గోల్డ్/ప్లాటినం నిష్పత్తి గత రెండు దశాబ్దాలుగా 1 నుంచి 2 మధ్య ఉంది, కానీ ప్రస్తుతం ఇది 3.5 వద్ద ఉంది. దీని అర్థం బంగారం విలువ అధికంగా ఉంది. దానిలో సవరణ రావచ్చు.

బంగారానికి పెరుగుదలకు కారణాలేేంటీ?

2022-23 జియోపాలిటికల్ ఒత్తిళ్లు, సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోలు, గ్లోబల్ అనిశ్చితి బంగారం డిమాండ్‌ను పెంచాయి. కానీ 2025లో డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లు పెరుగుదలకు ఆజ్యంపోసింది. 2025 ఫిబ్రవరి తర్వాత బంగారం మరింత వేగం పుంజుకుంది. కానీ ఇప్పుడు ట్రంప్ వైఖరి మరింత కఠినంగా ఉంది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య చర్చలకు అవకాశాలు ఉన్నాయి.  మార్కెట్ టారిఫ్ నిర్మాణంలో సడలింపు ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. దీంతో పెట్టుబడిదారులు బంగారం నుంచి డబ్బును తీసివేసి ఈక్విటీ , వాణిజ్య వస్తువుల వైపు మళ్లుతున్నారు.

బంగారంపై డాలర్ ఒత్తిడి 

US డాలర్ ఇండెక్స్ ఇటీవల 100పైగా చేరుకుంది, గత మూడు సంవత్సరాలలో ఇదే గరిష్ట స్థాయి. సాధారణంగా డాలర్ బలంగా ఉన్నప్పుడు, బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ కారణంగానే బంగారంలో ఇటీవల తగ్గుదల కనిపించింది.

బంగారం ధరలు మళ్ళీ పెరుగుతాయా?

అంచనా వేయడం కష్టం కానీ ప్రపంచ అనిశ్చితి మళ్ళీ తలెత్తితే, మాంద్యం, వాణిజ్య యుద్ధం, అమెరికా ఫెడరల్ రుణంలో సంక్షోభం వంటివి కారణాలతో  బంగారం మళ్ళీ వేగం పుంజుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాపై 36 ట్రిలియన్ డాలర్ల రుణం ఉంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే బంగారానికి మద్దతు లభించవచ్చు. US GDP తగ్గుదల (-0.3 శాతం), వినియోగదారుల నమ్మకంలో తగ్గుదల, జూన్‌లో వడ్డీ రేటు తగ్గింపు, ఇవన్నీ బంగారం పెరుగుదలకు సహకరించే అంశాలు.

భారతదేశంలో బంగారం 92,820 వద్ద

భారతదేశంలో బంగారం ధరలు ప్రస్తుతం 10 గ్రాములకు 92,820, ఇది 22 ఏప్రిల్‌లో ఏర్పడిన 1 లక్ష రికార్డు కంటే చాలా తక్కువ. అందువల్ల వివాహాలకు కొనుగోలుదారులు, దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈ "తగ్గుదలను కొనుగోలు అవకాశంగా భావించవచ్చు.  జూన్‌లో రెండు పెద్ద సంఘటనలు ఉన్నాయి. ఈ రెండు సంఘటనల తర్వాత బంగారం దిశ నిర్ణయమవుతుంది

జూన్ 9: ట్రంప్ పరస్పర టారిఫ్‌లు' 90 రోజుల గడువు ముగుస్తుంది.

జూన్ 17-18: US ఫెడరల్ రిజర్వ్ FOMC సమావేశం, దీనిలో రేటు తగ్గింపుకు అవకాశం ఉంది.