Indian Railways Free Facilities: భారత్‌లో ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ప్రజలు తక్కువ ఖర్చులో, సౌకర్యవంతంగా ప్రయాణిస్తూ వారి గమ్యస్థానాలకు చేరుకుంటారు. చాలామంది నిత్యం ఆఫీసులకు లేదా బిజినెస్, ఇతర పనులకు వెళ్లడానికి కూడా రైలులో ప్రయాణిస్తారు. అయితే రైల్వే అందించే కొన్ని ప్రత్యేక సౌకర్యాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. రైలు టికెట్ తీసుకున్న తర్వాత ప్రయాణికులకు పలు సర్వీసులు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి. ఈ సౌకర్యాల వల్ల ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుంది. కొన్నిసార్లు టైమ్ ఆదా అవుతోంది. కనుక మీరు కూడా ఆ సౌకర్యాలపై ఓ లుక్కేయండి. 

Continues below advertisement

రైల్వే స్టేషన్‌లో వెయిటింగ్ రూమ్ సౌకర్యంమీ రైలు ఆలస్యమైనా లేదా మీరు ముందుగానే రైల్వే స్టేషన్‌కు చేరుకున్నా, స్టేషన్‌లో వెయిటింగ్ రూమ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఇక్కడ మీరు హాయిగా కూర్చుని కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. మీ లగేజీని కూడా సురక్షితంగా ఉంచుకోవచ్చు. అలాగే అనేక పెద్ద స్టేషన్లలో ఏసీ (AC), నాన్ ఏసీ (Non AC) వెయిటింగ్ రూములు రెండూ అందుబాటులో ఉంటాయి.

ఉచిత వైఫై (Wi-Fi) సౌకర్యంనేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ మనకు రోజువారీ సౌకర్యంగా మారిపోయింది. ఇది మన జీవితంలో భాగమైపోయింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే అనేక పెద్ద స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని అందిస్తుంది. తద్వారా మీరు మీ మొబైల్ డేటాను వాడకుండానే  రైలు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నా కూడా వైఫై నెట్‌ సాయంతో మీ ఆన్‌లైన్ పనులను కూడా పూర్తి చేసుకోవచ్చు.

Continues below advertisement

ఏసీ కోచ్‌లలో లభించే ప్రయోజనాలుమీరు ఏసీ కోచ్‌లో జర్నీ టికెట్ తీసుకున్నట్లయితే, రైల్వే మీకు బెడ్‌షీట్, తలగడ, దుప్పట్లను ఉచితంగా అందిస్తుంది. దీని కోసం మీరు అదనంగా ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన పనిలేదు. దీనివల్ల మీ రాత్రి ప్రయాణం చేసినా ఏ ఇబ్బంది లేకుండా చాలా సౌకర్యవంతంగా మారుతుంది. వేసవిలో వీటి అవసరం తక్కువగా ఉంటుంది కానీ, చలికాలం, వర్షకాలంలో ఈ బెడ్‌షీట్, దుప్పట్లు మీ జర్నీని సౌకర్యవంతగా అయ్యేలా చేస్తాయి.

 మెడికల్ ఎమర్జెన్సీలో సహాయంరైలు ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా మీ ఆరోగ్యం లేదా ఇతర ప్రయాణికుడికి అనారోగ్య సమస్యలు వస్తే, రైల్వే తరపున వైద్య సహాయం అందించనున్నారు. ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉంటే తరువాత స్టేషన్‌లో డాక్టర్‌ను సైతం ఏర్పాట్లు కూడా చేస్తారు. అలాగే ఈ సమయంలో రైల్వే సిబ్బంది మీకు పూర్తి సహాయాన్ని అందిస్తారు.

భద్రత, సహాయంరైలు ప్రయాణంలో మీకు ఎలాంటి సమస్య ఎదురైనా TTE, కోచ్ అటెండెంట్, రైల్వే హెల్ప్‌లైన్ మీకు సహాయం చేయడానికి అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారుల విషయంలో ఈ సౌకర్యాలు మీకు ఎంతో అవసరం, ప్రయోజనకరంగా ఉంటాయి.