Investment Tips: మే నెలలో ఈక్విటీ మార్కెట్లు ఆల్-టైమ్ హై లెవెల్స్‌ సమీపంలోకి వెళ్లాయి. ఆ నెలలో మ్యూచువల్ ఫండ్‌ హౌస్‌లు ఫుల్‌ యాక్టివ్‌గా ఉన్నాయి. 


మ్యూచ్‌వల్‌ ఫండ్‌ కంపెనీలు మే నెలలో కొన్న టాప్‌-10 లార్జ్‌ క్యాప్ స్టాక్స్‌: 


ఇండస్ టవర్స్
ఏప్రిల్‌ నెలలో ఈ స్టాక్‌ కోసం మ్యూచువల్ ఫండ్స్ చేసిన ఖర్చు రూ. 203 కోట్లతో పోలిస్తే, మే నెలలో హోల్డింగ్ విలువ రెండింతలు పెరిగి రూ. 593 కోట్లకు చేరుకుంది. మే చివరి నాటికి ఫండ్ హౌస్‌లకు ఈ కంపెనీలో 3.86 కోట్ల షేర్లు ఉన్నాయి.


అదానీ టోటల్ గ్యాస్
మే నెలలో, అదానీ టోటల్ గ్యాస్‌లో సుమారు 3 లక్షల షేర్లను ఫండ్‌ హౌస్‌లు జోడించాయి. దీంతో, ఏప్రిల్‌ ఉన్న హోల్డింగ్ 10 లక్షల షేర్ల నుంచి మే నెలలో 13 లక్షలకు చేరుకుంది. వాటి విలువ ఇప్పుడు రూ. 89 కోట్లుగా ఉంది.


టాటా ఎల్‌స్కీ
మ్యూచువల్ ఫండ్స్, మేలో, ఈ టాటా గ్రూప్ స్టాక్‌లో అదనంగా 4 లక్షల షేర్లను కొనుగోలు చేశాయి. ప్రస్తుతం ఈ కంపెనీలో దాదాపు 14 లక్షల షేర్లను కలిగి ఉన్నాయి. వాటి విలువ రూ. 1,051 కోట్లు.


HDFC లైఫ్
మ్యూచువల్ ఫండ్స్, ఏప్రిల్‌లోని రూ. 755 కోట్ల విలువైన హోల్డింగ్‌ వాల్యూని అనేక రెట్ల కొనుగోళ్లతో మే నెలలో రూ. 5,722 కోట్లకు పెంచాయి. మే చివరి నాటికి ఫండ్ హౌస్‌లకు ఈ కంపెనీలో 9.66 కోట్ల షేర్లు ఉన్నాయి.


JSW స్టీల్
దేశీయ ఫండ్స్ ఈ స్టీల్ మేజర్‌లో దాదాపు 58 లక్షల షేర్లను కొత్తగా కొని, మొత్తం లెక్కను 4.64 కోట్లకు తీసుకెళ్లాయి. మ్యూచువల్ ఫండ్స్ ప్రస్తుతం JSW స్టీల్‌లో రూ. 3,233 కోట్ల విలువైన స్టేక్‌ను కలిగి ఉన్నాయి.


నైకా 
నైకాలో మ్యూచువల్ ఫండ్స్ కొత్తగా 2.35 కోట్ల షేర్లను కొనుగోలు చేశాయి. దీంతో ఏప్రిల్‌లో రూ. 2,498 కోట్ల హోల్డింగ్‌ మే నెలలో రూ. 2,841 కోట్లకు పెరిగింది.


జొమాటో
ఫండ్ హౌస్‌లు మే నెలలో 7 కోట్ల జొమాటో షేర్లను కొనుగోలు చేశాయి, వాటి హోల్డింగ్‌ను రూ. 4,785 కోట్లకు పెరిగింది. ఏప్రిల్‌లో MF హోల్డింగ్స్ విలువ రూ. 4,043 కోట్లుగా ఉంది.


UPL
మ్యూచువల్ ఫండ్స్ తమ పోర్ట్‌ఫోలియోలో 26 లక్షల UPL షేర్లను అదనంగా చేర్చాయి. ఈ కంపెనీలో MFల మార్కెట్ విలువ మే చివరి నాటికి రూ. 2,512 కోట్లకు చేరింది. 


HDFC బ్యాంక్
దేశీయ ఫండ్స్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో తమ హోల్డింగ్‌ను ఏప్రిల్‌లోని రూ. 65,937 కోట్ల నుంచి మేలో రూ. 67,233 కోట్లకు పెంచాయి. మే నెలలో అదనంగా 1.7 కోట్ల షేర్లను కొనుగోలు చేశాయి.


హిందాల్కో ఇండస్ట్రీస్
ఫండ్ హౌస్‌లు మే నెలలో 1.3 కోట్ల హిందాల్కో ఇండస్ట్రీస్‌ షేర్లను కొత్తగా జోడించాయి. ఈ నెలలో కంపెనీలో MFల ఉమ్మడి హోల్డింగ్ రూ. 10,114 కోట్లుగా ఉంది.


మరో ఆసక్తికర కథనం: కదలిక లేని పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.