Undiscovered Small Cap Stocks: ప్రస్తుత స్టాక్‌ మార్కెట్‌ పరిస్థితుల్లో... లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌ కంటే స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఎక్కువ లాభాలు తెచ్చి పెడుతున్నాయి. దీంతో, జాతి రత్నాల లాంటి స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ను వెదికి పట్టుకోవడంలో ఛోటా ఇన్వెస్టర్లతో పాటు సంస్ధాగత పెట్టుబడిదార్లు (institutional investors) కూడా బిజీగా ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ (MFలు), PMS స్కీమ్స్‌, ULIPలు, AIFలు ప్రస్తుతం స్మాల్‌ క్యాప్ హోల్డింగ్స్‌ మీద ఫోకస్‌ పెంచాయి. 


ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలను గమనిస్తే... జులై నెలలో, కిమ్స్, అఫిల్ ఇండియా, KEI ఇండస్ట్రీస్, వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్, బిర్లాసాఫ్ట్, CIE ఆటోమోటివ్ ఇండియా, MCX, నారాయణ హృదయాలయ, చోళమండలం ఫైనాన్షియల్ హోల్డింగ్స్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్‌లో ఎక్స్‌పోజర్‌ను ఫండ్‌ మేనేజర్స్‌ పెంచుకున్నారు. 


వీటిలో, 83 ఫండ్స్‌ ఫాలో అవుతున్న హాస్పిటల్ స్టాక్ కిమ్స్‌ (KIMS) గత ఒక ఏడాది కాలంలో ఈ స్టాక్‌ 66% ర్యాలీ చేసింది. 62 ఫండ్స్‌ యాజమాన్యంలో ఉన్న బిర్లాసాఫ్ట్, దలాల్‌ స్ట్రీట్‌లో అత్యంత ప్రజాదరణ ఉన్న స్మాల్‌ క్యాప్స్‌లో ఒకటి. గత 6 నెలల్లో ఈ స్టాక్‌ 65% రిటర్న్స్‌ ఇచ్చింది. 


జులై నెలలో, MCX, కార్బోరండమ్, ABFRL, PVR ఐనాక్స్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, అఫ్లే ఇండియా, KEI ఇండస్ట్రీస్, గో ఫ్యాషన్, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్, CIE ఆటోమోటివ్, సిటీ యూనియన్ బ్యాంక్, లారస్ ల్యాబ్స్, కెన్ ఫిన్ హోమ్స్, సఫైర్ ఫుడ్స్, కరూర్‌ వైశ్యా బ్యాంక్, గుజరాత్  స్టేట్ పెట్రోనెట్‌ వంటి స్మాల్‌ క్యాప్‌ షేర్లలోనూ ఫండ్‌ మేనేజర్లు హోల్డింగ్‌ పెంచుకున్నారు.


జులైలో ఫండ్‌ మేనేజర్స్‌ వాటా పెంచుకున్న స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌:


కిమ్స్‌ను హోల్డ్‌ చేస్తున్న MFలు 17 --- PMS స్కీమ్స్‌ 10  ---  ULIPలు 54  ---  AIFలు 2 --- మొత్తం ఫండ్స్‌ 83


అఫ్లే ఇండియాను హోల్డ్‌ చేస్తున్న MFలు 45 --- PMS స్కీమ్స్‌ 5  ---  ULIPలు 4  ---  AIFలు 2 --- మొత్తం ఫండ్స్‌ 76


KEI ఇండస్ట్రీస్‌ను హోల్డ్‌ చేస్తున్న MFలు 51 --- PMS స్కీమ్స్‌ 8 ---  ULIPలు 14  ---  AIFలు 0 --- మొత్తం ఫండ్స్‌ 73


వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్‌ను హోల్డ్‌ చేస్తున్న MFలు 53 --- PMS స్కీమ్స్‌ 4  ---  ULIPలు 7  ---  AIFలు 0 --- మొత్తం ఫండ్స్‌ 64


బిర్లాసాఫ్ట్‌ను హోల్డ్‌ చేస్తున్న MFలు 47 --- PMS స్కీమ్స్‌ 6 ---  ULIPలు 9  ---  AIFలు 0 --- మొత్తం ఫండ్స్‌ 62


CIE ఆటోమోటివ్‌ను హోల్డ్‌ చేస్తున్న MFలు 48 --- PMS స్కీమ్స్‌ 5  ---  ULIPలు 5  ---  AIFలు 1 --- మొత్తం ఫండ్స్‌ 59


MCXను హోల్డ్‌ చేస్తున్న MFలు 45 --- PMS స్కీమ్స్‌ 5 ---  ULIPలు 4  ---  AIFలు 2 --- మొత్తం ఫండ్స్‌ 56


నారాయణ హృదయాలయను హోల్డ్‌ చేస్తున్న MFలు 13 --- PMS స్కీమ్స్‌ 0  ---  ULIPలు 43  ---  AIFలు 0 --- మొత్తం ఫండ్స్‌ 56


చోళమండలం ఫైనాన్షియల్‌ను హోల్డ్‌ చేస్తున్న MFలు 45 --- PMS స్కీమ్స్‌ 2  ---  ULIPలు 7  ---  AIFలు 1 --- మొత్తం ఫండ్స్‌ 55


హోమ్ ఫస్ట్ ఫైనాన్స్‌ను హోల్డ్‌ చేస్తున్న MFలు 39 --- PMS స్కీమ్స్‌ 11  ---  ULIPలు 4  ---  AIFలు 1 --- మొత్తం ఫండ్స్‌ 55


మరో ఆసక్తికర కథనం: సీనియర్ సిటిజన్ల కోసం ప్రభుత్వ పెన్షన్ స్కీమ్స్‌, ఏది ఎక్కువ బెనిఫిట్స్‌ ఇస్తుంది?


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.