Infosys Q4 Earnings: బెంగళూరుకు చెందిన ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్, Q4FY23 బిజినెస్‌లో మార్కెట్ అంచనాలను అందుకోకపోవడంతో కంపెనీ షేర్లు ఇవాళ (17 ఏప్రిల్ 2023) కుప్పకూలాయి, 11% పైగా నష్టపోయాయి.
2023 మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 8% వృద్ధితో రూ. 6,128 కోట్లకు చేరుకోగా, కార్యకలాపాల ఆదాయం 16% వృద్ధి చెంది రూ. 37,441 కోట్లకు చేరుకుంది. లాభం, ఆదాయం గణాంకాలు రెండూ దలాల్ స్ట్రీట్ అంచనాల కంటే తక్కువగా ఉన్నాయి.
ఇన్ఫోసిస్ నుంచి, Q4లో రూ. 6,550 కోట్ల నికర లాభం, రూ. 38,850 కోట్ల ఆదాయాన్ని మార్కెట్ విశ్లేషకులు ఆశించారు.
ఫలితాల విడుదల సందర్భంగా, 2023-24 సంవత్సరం అంచనాలను ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు స్థిర కరెన్సీ పరంగా 4 నుంచి 7 మాత్రమే జంప్‌ను చూస్తాయని కంపెనీ అంచనా వేసింది. ఆపరేటింగ్ మార్జిన్ 20 నుంచి 22 శాతం వరకు ఉండొచ్చని లెక్కగట్టింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా మార్గదర్శకాలను ఈ కంపెనీ తగ్గించింది.
గురువారం మార్కెట్ వేళల తర్వాత ఈ కంపెనీ ఫలితాలు వెల్లడయ్యాయి. అంబేడ్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం భారత ఈక్విటీ మార్కెట్లు ట్రేడింగ్‌కు సెలవు ప్రకటించాయి. శని, ఆదివారాలు సాధారణ సెలవుల తర్వాత, ఇవాళ భారీ ఎఫెక్ట్ కనిపించింది.
ఉదయం 11.15 గంటల సమయానికి, ఒక్కో షేరు 11.02% లేదా రూ. 153.10 రూ. 1,235.45 వద్ద ట్రేడ్ అవుతోంది.
జనవరి-మార్చి ఫలితాల తర్వాత, ఇన్ఫోసిస్ స్టాక్ మీద టాప్ బ్రోకరేజ్‌ల అంచనాలు మారాయి. మారిన అంచనాలకు అనుగుణంగా స్టాక్ రికమెండేషన్స్ చేశాయి. ప్రస్తుతం నిరాశజనక ఫలితాల ఉన్నా, కంపెనీ భవిష్యత్ ఆదాయాలపై ఎక్కువ బ్రోకరేజ్‌లు ఆశాజనకంగా ఉన్నాయి, "బయ్" కాల్స్ ఇచ్చాయి. ఈ స్టాక్ ప్రస్తుత స్థాయి నుంచి దాదాపు 28% ర్యాలీ చేస్తుందని అంచనా వేశాయి.
ఇన్ఫోసిస్ స్టాక్ మీద టాప్ బ్రోకరేజ్‌ల రికమెండేషన్స్:
జెఫరీస్
రికమెండేషన్: బయ్ | టార్గెట్ ధర: రూ. 1,570 | అప్‌సైడ్ ర్యాలీ: 13%
నోమురా
రికమెండేషన్: న్యూట్రల్ | టార్గెట్ ధర: రూ. 1,290 | అప్‌సైడ్ ర్యాలీ: 28%
HDFC సెక్యూరిటీస్
రికమెండేషన్: యాడ్ (బయ్ నుంచి తగ్గింది) | టార్గెట్ ధర: రూ. 1,470 | అప్‌సైడ్ ర్యాలీ: 6%
కోటక్ సంస్థాగత సెక్యూరిటీస్
రికమెండేషన్: బయ్ | టార్గెట్ ధర: రూ. 1,470 | అప్‌సైడ్ ర్యాలీ: 6%
షేర్‌ఖాన్
రికమెండేషన్: హోల్డ్ | టార్గెట్ ధర: రూ. 1,500
BOB క్యాపిటల్ మార్కెట్స్
రికమెండేషన్: బయ్ | టార్గెట్ ధర: రూ. 1,760
నువామా
రికమెండేషన్: బయ్ | టార్గెట్ ధర: రూ. 1,610
ఫిలిప్ క్యాపిటల్
రికమెండేషన్: బయ్ | టార్గెట్ ధర: రూ. 1,590
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.