India EFTA Trade Deal Going Live On October 1: అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో బేరాలు సాగుతున్నాయి కానీ..యూరప్ విషయంలో మాత్రం  ఫటాఫట్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.  భారతదేశం, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA) వాణిజ్య , ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (TEPA)పై సంతకం చేశాయి. ఈ వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 1, 2025 నుండి అమల్లోకి వస్తుందని వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ శనివారం ప్రకటించారు.

మార్చి 10, 2024న సంతకం చేసిన  ఒప్పందంలో EFTA సభ్య దేశాలు ఐస్లాండ్, లీచ్టెన్‌స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్ ఉన్నాయి .  విదేశీ పెట్టుబడులు ,ద్వైపాక్షిక వాణిజ్యం అభివృద్ధికి ఈ ఒప్పందం ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.   సజావుగా అమలు ,  ప్రభావవంతమైన సమన్వయాన్ని  సాధించేందుకు ఇండియా-EFTA డెస్క్  స్థాపించారని  మంత్రి గోయల్  ప్రకటించారు.  EFTA ఆధారిత పెట్టుబడిదారులు భారత మార్కెట్లలో సులభంగా పాల్గొనేలా చేయడం లక్ష్యంగా ప్రభుత్వ ,  ప్రైవేట్ రంగ వాటాదారులకు సింగిల్-విండో ఫెసిలిటేషన్ మెకానిజంలా పనిచేయడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు.  

"ఈ డెస్క్ ప్రభుత్వాలు, ప్రైవేట్ కంపెనీలకు 'సింగిల్-విండో ప్లాట్‌ఫామ్'గా పనిచేస్తుంది," అని గోయల్  ప్రకటించారు.  భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న పరిశ్రమలకు విదేశీ సంస్థలకు అవసరమైన సేవలను క్రమబద్దీకరిస్తుంది. ఈ ఒప్పందం ద్వారా అటు యూరప్ తో పాటు ఇటు ఇండియాలో సహకార భాగస్వామ్యాన్ని  విస్తరించడం ప్పందంలో కీలకం  భారతదేశం ఇప్పటివరకు సంతకం చేసిన అత్యంత సమగ్రమైన వాణిజ్య ఒప్పందాలలో ఒకటి. ఇది భారతీయ ఎగుమతిదారులకు అధిక-విలువైన యూరోపియన్ మార్కెట్లకు ఎక్కువ అవకాశాలను   అందిస్తుంది. అదే సమయంలో అధునాతన సాంకేతికత, మూలధన ఆకర్షణ,   ఉపాధి అవకాశాలను కూడా తీసుకువస్తుందని భావిస్తున్నారు.

 ఈ ఒప్పందం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో ఒప్పందం అద్భుతమైనదని EFTA దేశాలు భావిస్తున్నాయి.  ప్రపంచ వాణిజ్య డైనమిక్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, ఈ ఒప్పందం దక్షిణాసియాలో EFTA ఉనికిని పెంచుతుందని..  భారతదేశంతో లోతైన ఆర్థిక సహకారాన్ని పెంపొందిస్తుందని  అంచనా వేస్తున్నారు.  

100 బిలియన్ డాలర్ల FDI అంచనా,  1 మిలియన్ ఉద్యోగాలు

TEPA ఫ్రేమ్‌వర్క్ కింద, భారతదేశం 15 సంవత్సరాల కాలంలో  100 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్యంలో మొదటి దశాబ్దంలో ప్రారంభంలో 50 బిలియన్ డాలర్లు, తరువాత ఐదు సంవత్సరాలలో అదనంగా  50 బిలియన్ డాలర్లు పెట్టుబడులుగా రానున్నాయి.  ఈ ఒప్పందం భారతదేశంలో ఒక మిలియన్ ఉద్యోగాలను సృష్టించే లక్ష్యాన్ని కూడా  పెట్టుకుంది.  పెట్టుబడులు,  ఆర్థిక కార్యకలాపాలలో ఊహించిన పెరుగుదలను చూపిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.