India Airlines Companies faces bankruptcy due to losses: భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌లలో ఒకటి. అయినా  గత మూడు దశాబ్దాల్లో దాదాపు 15కి పైగా విమానయాన సంస్థలు దివాలా తీసి మూతపడ్డాయి. ఈ రంగంలోకి ఆశలతో అడుగుపెట్టిన సంస్థలు భారీ నష్టాలు, రుణభారం,  పోటీతత్వం కారణంగా ఆకాశం నుంచి క్రాష్ ల్యాండ్ అవుతున్నాయి.  మాల్యా కూడా దివాలా తీసి పరారీ                                 

Continues below advertisement

1990లలో వేగంగా విస్తరించింది అనిపించిన  మోడీలుఫ్ట్ తీవ్ర పోటీ , ఆర్థిక కష్టాలతో 1996లో మూతపడింది. 2000లలో ఎయిర్ డెక్కన్, దేశంలో తొలి లో-కాస్ట్ క్యారియర్‌గా ప్రారంభమైనా, ఇంధన ధరల పెరుగుదల,  మార్కెట్ షేర్ క్షీణతతో 2008లో కింగ్‌ఫిషర్‌కు  అమ్మేసుకున్నారు.  కింగ్‌ఫిషర్ స్వయంగా 2012లో రూ.9,000 కోట్ల రుణాలతో దివాలా తీసింది, ఇక్కడ విజయ్ మాల్యా నాయకత్వంలో ఎయిర్ డెక్కన్ ఏకీకరణ తర్వాత నష్టాలు పెరిగాయి. 2010లలో పారామౌంట్ ఎయిర్‌వేస్ ,  ఎయిర్ పెగాసస్ వంటి చిన్న సంస్థలు రుణాలు , సాంకేతిక సమస్యలతో మూతపడ్డాయి. ఎయిర్ కార్నివల్ 2017లో జీతాలు చెల్లించకపోవడం , స్ట్రైకులతో ఆగిపోయింది.

జెట్ ఎయిర్ వేస్ ఇప్పుడు లేదు..తెలుస్తోందా?                  

Continues below advertisement

అతిపెద్ద  ఎయిర్ లైన్ సంస్థగా ఎదిగిన జెట్ ఎయిర్‌వేస్ 2019లో రూ.18,000 కోట్ల రుణభారంతో దివాలా ప్రక్రియలోకి జారుకుంది, ఇది 2024లో పూర్తిగా లిక్విడేషన్‌కు వెళ్లింది. తాజాగా, గోఫస్ట్  రూ.11,000 కోట్ల రుణాలతో మూతపడింది. ఈ దివాలాల వెనుక ప్రధాన కారణాలు అతి పోటీ,  చీప్ టికెట్ ధరలు, అధిక ఇంధన పన్నులు ,  కట్-త్రోట్ కాంపిటీషన్.   భారత విమానయాన రంగం అత్యంత క్యాపిటల్ ఇంటెన్సివ్, ఇక్కడ FDI  ఫారిన్ క్యారియర్స్‌కు 49% మాత్రమే ఉంది.   మరోవైపు, డాలర్ విలువ పెరగడం, లీజ్ పేమెంట్స్, మెయింటెనెన్స్ ఖర్చులు డాలర్‌లో ఉండటం నష్టాలను పెంచుతున్నాయి.

తెలుగువాళ్ల ప్రయత్నాలు ఫెయిల్                   

ట్రూజెట్ పేరుతో చిన్న విమానయానసంస్థను రామ్ చరణ్ తన స్నేహితులతో కలిసి ప్రారంభించారు. కానీ అది మూతపడింది. అలాగే.. ఏపీకి చెందిన పారిశ్రామికవేత్త లింగమనేని ఎయిర్ కోస్తాను ప్రారంభించారు. కొన్నాళ్లు నడిచిన తర్వాత అది కూడా మూతపడింది. ఇటీవల ట్రూజెట్ ను మళ్లీ పట్టాలెక్కిస్తారన్న ప్రచారం జరిగింది కానీ తర్వాత సైలెంట్ అయ్యారు.  కింగ్‌ఫిషర్ మూతతో వేలాది ఉద్యోగాలు పోయాయి, బ్యాంకులకు భారీ నష్టాలు వచ్చాయి. జెట్ ఎయిర్‌వేస్ కేసులో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ (IBC) కూడా పూర్తి పరిష్కారం ఇవ్వలేదు. COVID-19 మహమ్మారి ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేసింది.  ఇక్కడ ఒక సంస్థ ఫెయిల్ అయితే మొత్తం రంగం ప్రభావితమవుతుంది. నిపుణులు ఇంధన పన్నులు తగ్గించడం, రెగ్యులేటరీ రిఫార్మ్స్ , మరిన్ని FDIలకు అవకాశం కల్పించాలని సూచిస్తున్నారు.