EMI Burden Management Tips: తక్షణ అవసరం తీరేందుకు మీ వద్ద నగదు లేని సందర్భంలో లోన్ తీసుకుంటారు. అయితే కొంతకాలం తరువాత EMI చెల్లించడానికి ఇబ్బంది పడి వాయిదాలు చెల్లించడం మానేస్తారు. దాంతో అది క్రెడిట్ స్కోరు మీద ప్రభావం చూపుతుంది. బ్యాంకులు, సంస్థల నుంచి మీపై బకాయి చెల్లింపుల కోసం ఒత్తిడి పెరుగుతుంది. ఇంటి నెలవారీ బడ్జెట్, క్రెడిట్ కార్డ్ బకాయిలు,  రకరకాల లోన్ల EMIలు కలిసి మీపై ఒత్తిడిని పెంచుతాయి. ఒకవేళ మీరు కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లయితే, కొన్ని చిట్కాలను పాటించి సమస్య నుండి బయటపడవచ్చు.

Continues below advertisement

ఖర్చులను తగ్గించుకోండి, కొత్త అప్పులు చేయకండిపెరుగుతున్న ఖర్చులను భరించలేక, తమ అవసరాల కోసం ప్రజలు తరచుగా కొత్త రుణాలు తీసుకుంటూ ఉంటారు. లోన్లు పెరిగేకొద్దీ మీ EMI భారం పెరుగుతోంది. దాంతో అవి చెల్లించలేక నెమ్మదిగా అప్పుల ఊబిలో కూరుకుపోతారు. మీపై కూడా EMI ఒత్తిడి పెరుగుతుంటే, ఫస్ట్ కొత్త లోన్ తీసుకోవడం ఆపివేయాలి. పాత EMIల కోసం డబ్బును సర్దుబాటు చేయడానికి మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఉదాహరణకు, బయట తినడం, అనవసరమైన షాపింగ్‌లను తగ్గించండి లేదా పూర్తిగా ఆపేయండి. ఎంత పొదుపు చేసినా, ఆ మొత్తాన్ని EMI తీర్చడానికి ఉపయోగించాలి. అన్నింటికంటే ఎక్కువ వడ్డీ ఉన్న లోన్‌ను ముందుగా పూర్తి చేసుకోవాలి. 

చిన్న లోన్స్ క్లోజ్ చేయండి మీరు వేర్వేరు చిన్న లోన్స్ సంబంధించి అనేక EMIలు చెల్లిస్తున్నట్లయితే, మొదట ఆ చిన్న చిన్న రుణాలను తీర్చివేయడానికి ప్రయత్నించండి. వడ్డీ రేటును తగ్గించడం గురించి లేదా 'వన్-టైమ్ సెటిల్మెంట్' (One-time settlement) గురించి బ్యాంకుతో మాట్లాడటం కూడా ఒక మంచి ప్రత్యామ్నాయం కావచ్చు. కొంతకాలం తరువాత లోన్స్ తగ్గడంతో ఈఎంఐ భారం తగ్గుతుంది. 

Continues below advertisement

పొదుపునకు ప్రాధాన్యత ఇవ్వండిమీ ఆదాయంలో కొంత భాగాన్ని ఖచ్చితంగా పొదుపు చేయాలి. పొదుపు చేసిన ఆ మొత్తాన్ని లోన్ అసలు మొత్తాన్ని ఒకేసారి చెల్లించడానికి (Bulk payment) ఉపయోగించవచ్చు. దీనివల్ల మీ ఆర్థిక స్థితిలో మార్పు వస్తుంది. అప్పులు, లోన్స్ తగ్గి కొంచెం ఊరట పొందుతారు. క్రెడిట్ కార్డ్ బాకీలు ముందుగా చెల్లించాక మిగతా లోన్స్ చెల్లించేలా ప్లాన్ చేసుకోవడం బెటర్.

ఆర్థిక ప్రణాళిక కోసం చిట్కాలు (Financial Planning Tips)50/30/20 రూల్: మీ నెలవారీ ఆదాయంలో 50 శాతం అవసరాలకు, 30 మీ లగ్జరీ, కోరికలకు, 20% కచ్చితంగా పొదుపు లేదా అప్పులు తీర్చడానికి కేటాయించాలి.

ఎమర్జెన్సీ ఫండ్: ఏదైనా అనుకోని ఖర్చు వస్తే మళ్ళీ అప్పు చేయకుండా ఉండటానికి మీ వద్ద కనీసం 3 నుండి 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బులు ఉండేలా ప్లాన్ చేసుకోవడం మంచిది.