Patanjali News: భారత దేశంలో ఆధునిక వైద్యానికి తోడు ఆయుర్వేద వైద్యంలో దిగ్గజాలు తమదైన ప్రత్యేకతను చూపిస్తున్నాయి. పరిశోధనతో పాటు కొత్త ఉత్పత్తులతో ఆరోగ్య సంరక్షణలో భారత దేశ ప్రత్యేకతను నిలబెడుతున్నారు. భారత్ చెందిన ప్రముఖ ఆయుర్వేద దిగ్గజాలు - పతంజలి, హిమాలయ , సన్ హెర్బల్స్ సంత్థలు- ఆరోగ్య సంరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నాయి. ఈ సంస్థల ఆయుర్వేద వైద్యం, రీసెర్చ్, ఇన్నోవేషన్ల కారణంగా భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తు వేగంగా మారుతోంది.
ఈ కంపెనీల ప్రయత్నాలు స్వదేశంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా, ప్రపంచ ఆరోగ్య పటంలో భారతదేశాన్ని బలమైన శక్తిగా నిలబెడుతున్నాయి. ఆయుర్వేద మందులను ఆధార ఔషధంగా స్థాపించడానికి కంపెనీలు శాస్త్రీయ పరిశోధనల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ కంపెనీల ప్రయత్నాల వలన మధుమేహం, ఒత్తిడి , మూత్రపిండాల వ్యాధులు వంటి దీర్ఘకాలిక రోగాలకు సహజ చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి.
పతంజలి ఆయుర్వేదం ఈ విషయంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు తీసుకు వచ్చింది. ఈ సంస్థ ఉత్పత్తులు 70 కి పైగా దేశాలకు విస్తరించాయి. పతంజలి పరిశోధనా కేంద్రం 500 మందికి పైగా శాస్త్రవేత్తల బృందం ఆయుర్వేద ఔషదాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చి ఆరోగ్య సంరక్షణలో కీలంగా మార్చేందుకు పరిశోధనలు చేస్తూ ఉంటారు. పతంజలి కిడ్నీని మరింత ఆరోగ్యంగా మార్చడానికి , కిడ్నీ సమస్యలను పరిష్కరించడానికి తీసుకు వచ్చిన రెనోగ్రిట్ ఔషదం, 2024లో సైంటిఫిక్ రిపోర్ట్స్ ద్వారా టాప్ 100 అధ్యయనాలలో ఒకటిగా నిలిచింది. ఇది కిడ్నీ సంరక్షణకు సహజ పరిష్కారం చూపిస్తుంది. కిడ్నీ పనితీరు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పతంజలి యొక్క 4,700 కి పైగా రిటైల్ అవుట్‌లెట్‌ల నెట్‌వర్క్ ప్రపంచవ్యాప్తంగా 70 కి పైగా దేశాలకు ఆయుర్వేద ఉత్పత్తులను అందిస్తోంది. డాబర్ తన ఫ్లాగ్‌షిప్ చ్యవన్‌ప్రాష్ యాంటీఆక్సిడెంట్ లక్షణాలను జర్నల్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌లో ప్రచురించారు. 2020 క్లినికల్ ట్రయల్ ద్వారా దీన్ని రోగనిరోధక శక్తిని పెంచడంలో అత్యంత కీలకంగా ఉంటుందని నిరూపితమయింది. డాబర్ విస్తృతమైన ప్రపంచ పంపిణీ నెట్‌వర్క్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో ఆయుర్వేద మందులకు గిరాకీ పెరిగేలా చేసింది.
1955లో ప్రారంభించిన లివర్ సపోర్ట్ ఫార్ములా అయిన హిమాలయ Liv.52, ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సెల్లర్‌గా ఉంది. ఔషధ మూలికల నుండి క్రియాశీల సమ్మేళనాలను విశ్లేషించే 200 మందికి పైగా శాస్త్రవేత్తలతో కూడిన కంపెనీ... పరిశోధనల కోసం భారీగా పెట్టుబడులు పెడుతూనే ఉంది. ఈ ఆయుర్వేద మార్కెట్ లీడర్స్ తమ పరిధిని విస్తరించడానికి సాంకేతికతను - డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫారమ్‌లు, టెలిమెడిసిన్ , మెడికల్ టూరిజంను స్వీకరించడం వంటి వాటికి విస్తరిస్తున్నారు.
ఆయుర్వేదంలో ప్రైవేట్ రంగ ఆవిష్కరణలకు మద్దతు ఇస్తూ, కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ విధానపరమైన మద్దతును అందించింది, వీటిలో వైద్య వీసాలు, 43,000 కంటే ఎక్కువ పరిశోధన అధ్యయనాల ఆమోదం వంటివి ఉన్నాయి. ఫలితంగా ఆయుర్వేదంలో వరల్డ్ లీడర్‌గా ఎదుగుతోంది. ఆరోగ్య సంరక్షణను మరింత సరసమైనదిగా ,అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆయుర్వేద ఆవిష్కరణలు భారతదేశాన్ని సమగ్ర ఆరోగ్య కేంద్రంగా మారుస్తున్నాయి. ఇది ప్రపంచ ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును పునర్నిర్మించగల మార్పుగా నిపుణులు అంచనా వేస్తున్నారు