By: ABP Desam | Updated at : 27 Sep 2021 09:25 AM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
భారత్‌లో బంగారం ధర ఈ రోజు (సెప్టెంబరు 26) స్థిరంగా ఉంది. వరుసగా రెండో రోజు కూడా ధరలు స్థిరంగా ఉండడం విశేషం. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ భారత మార్కెట్‌లో రూ.45,240 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.46,240 గా ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లోనూ పసిడి ధర రెండు రోజులుగా స్థిరంగానే కొనసాగుతుంది.
మరోవైపు, వెండి ధరలో నిన్న స్వల్ప తగ్గుదల కనిపించగా.. తాజాగా నిలకడగా ఉంది. భారత మార్కెట్‌లో కిలో వెండి రూ.59,900గా ఉండగా.. హైదరాబాద్ మార్కెట్‌లో మాత్రం రూ.64,100 గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో సెప్టెంబరు 27న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర ఇవాళ కూడా స్థిరంగా ఉంది. దీంతో 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99) ధర ప్రస్తుతం రూ.47,130 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6) ధర రూ.43,200 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.64,100 పలికింది.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర సెప్టెంబరు 26న రూ.43,200 కాగా.. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.47,130గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,100గా ఉంది. విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,200 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,130గా ఉంది. ఇక్కడ కూడా వెండి ధర కిలో హైదరాబాద్ తరహాలోనే రూ.64,100 పలుకుతోంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు సెప్టెంబరు 27న ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,240ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,530గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,570 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,530గా ఉంది.
Also Read: గులాబ్ తుపాను ప్రభావం.. ఏపీలో కుంభవృష్టి, తెలంగాణలో మరో 3 రోజులు దంచికొట్టనున్న వానలు
ప్లాటినం ధరలో స్వల్ప తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర హైదరాబాద్‌లో గ్రాము రూ.2,317గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఈ ధర గ్రాముకు ఏకంగా రూ.7 వరకూ పెరిగింది. 10 గ్రాముల ప్లాటినం ధర ఇక్కడ రూ.23,170 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అంతే ఉంది.
వివిధ అంశాలపై పసిడి ధర
బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
Also Read: గులాబ్ తుపాన్ ఎఫెక్ట్…హైదరాబాద్ వాసులు తప్పనిసరైతే కానీ బయటకు రావొద్దని హెచ్చరికలు
Investment Tips: మహిళల కోసం గోల్డెన్ టిప్స్ - బంగారం, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ - ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?
Adani Stocks: మూడో రోజూ రఫ్ఫాడిస్తున్న అదానీ స్టాక్స్ - 10లో 9 షేర్లకు గ్రీన్ టిక్, మిగిలిన ఆ ఒక్కటి ఏది?
RBI MPC Meet: బ్యాంక్ వడ్డీ రేట్లు పెరుగుతాయా, తగ్గుతాయా?, ఆర్‌బీఐ మీటింగ్ ప్రారంభం
Latest Gold-Silver Prices Today 06 December 2023: రెండోరోజూ పసిడి పతనం - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Petrol-Diesel Price 06 December 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Telanagna Politics: కాంగ్రెస్ కేసీఆర్‌నే ఫాలో కానుందా? కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? లేక కేసీఆరే షాక్ ఇస్తారా?
Pavan Babu Meet : చంద్రబాబుతో పవన్ భేటీ - అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై చర్చ!
CM Revanth : మాట నిలబెట్టుకున్న రేవంత్ - దివ్యాంగురాలు జ్యోతికి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం
AP High Court: ఎస్‌ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు
/body>