Buzzing Stocks: బుధవారం సైతం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల్లోనే కొనసాగాయి. అయితే నష్టాల్లో ట్రేడింగ్ ప్రాంభించిన సూచీలు చివరికి ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి. వాస్తవానికి ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్, మార్కెట్లో నెలకొన్న హై ఓలటాలిటీ సూచీలను నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు సైతం కొన్ని కంపెనీల షేర్లు ప్రధానంగా ఫోకస్ లో ఉండనున్నాయి.


నేడు తమ క్యూ4 ఫలితాలను మార్కెట్లోకి విడుదల చేయనున్న దిగ్గజాలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలాగే ఇతర వార్తల కారణంగా నేడు మార్కెట్ల ట్రేడింగ్ సమయంలో ట్రేడర్లు గమనించాలని షేర్లలో ఎల్ అండ్ టి, బజాజ్ కన్జూమర్, డబ్ల్యూపీఐఎల్ షేర్లు ఉన్నాయి. 


వార్తల్లో నిలిచిన షేర్లు.. వాటి వెనుక కారణాలు..


బీఎస్ఈ- దేశంలోని లీడింగ్ స్టాక్ ఎక్స్ఛేంజీ బుధవారం తన షేర్ హోల్డర్లకు ఒక్కో షేరుపై రూ.15 ఫైనల్ డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. దీంతో నేడు కంపెనీ షేర్లు ఫోకస్‌లో కొనసాగుతున్నాయి. 


ఎల్ అండ్ టి- బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ముగిసిన తర్వాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి నాలుగో త్రైమాసికంలో 10 శాతం వృద్ధితో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.4,396 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించింది.


టీవీఎస్ మోటార్స్- దేశీయ ఆటో రంగంలోని టీవీఎస్ మోటార్స్2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీ లాభాలు, ఆదాయాలను నమోదు చేసింది. ఇదే క్రమంలో ఏడాదిలో 40 లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించి సరికొత్త మైలురాయిని నెలకొల్పింది.


బజాజ్ కన్జూమర్- వాస్తవానికి బజాజ్ కన్జూమర్ షేర్లు నేడు ఫోకస్ లో కొనసాగటానికి కారణం కంపెనీ షేర్లను బ్రైబ్యాక్ చేయాలని నిర్ణయించటమే. ఈక్రమంలో 57.41 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కోటి రూ.290 చొప్పున చెల్లించి తిరిగి కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తోంది. 


బ్యాంక్ ఆఫ్ బరోడా- తాజాగా బుధవారం సాయంత్రం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజ బ్యాంక్ ఆఫ్ బరోడాపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో బ్యాంక్ తన బీవోబీ వరల్డ్ యాప్ ద్వారా కస్టమర్లను ఆన్ బోర్డ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించబడింది. ఆంక్షల ఎత్తివేత కంపెనీకి నిజంగా శుభపరిణామం. నేడు మార్కెట్లో స్టాక్ మంచి ర్యాలీని నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది.


సులవైన్ యార్డ్స్- సులవైన్ యార్డ్స్ కంపెనీ మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.13.6 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అలాగే ఈ కాలంలో వ్యాపార ఆదాయం రూ.132 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది.



విప్రో- దేశీయ టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న విప్రో షేర్లు నేడు ఫోకస్‌లో ఉండటానికి కారణం.. జనరేటివ్ ఏఐ ఆధారిత వ్యాపార పరిష్కారాలను అందించేందుకు కాగ్నిటోస్ ఇంక్ కంపెనీతో జతకట్టటమే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏఐ టూల్స్ వినియోగం విస్తృతంగా పెరుగుతున్న వేళ తాజా పరిణామాలు కంపెనీకి సానుకూలమైనవిగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 


Also Read: 8 ఏళ్లలో మీ డబ్బులు ట్రిపుల్‌- సావరీప్ గోల్డ్ బాండ్‌తో లైఫ్‌ బంగారమే!