Financial Rules Changing From 01 April 2025: నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో, ఏప్రిల్ 01, 2025 నుంచి మన దేశంలో చాలా విషయాల్లో మార్పులు జరిగాయి. ఇవి మీ జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి.
కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిన పెద్ద మార్పులు:
గ్యాస్ సిలిండర్ చవకదేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు 45 రూపాయలు వరకు తగ్గాయి. సాధారణ ప్రజలకు మాత్రం ఊరట లభించలేదు, ఇళ్లలో వంటకు వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేట్లలో ఎటువంటి మార్పు లేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం, దిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 41 తగ్గి రూ.1762 గా ఉంది. కోల్‌కతాలో రూ. 44.50 పైసలు తగ్గి రూ. 1868.50 కు దిగి వచ్చింది. ముంబైలో రూ. 42 తగ్గిన తర్వాత రూ.1713.50గా మారింది. చెన్నైలో రూ.43.50 దిగి వచ్చింది, సిలిండర్ కొత్త ధర రూ.1921.50 అయింది.
రూ.12.75 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంకొత్త ఆర్థిక సంవత్సరం నుంచి, మీరు రూ. 12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగులకు అదనంగా రూ. 75,000 ప్రామాణిక మినహాయింపు లభిస్తుంది. అంటే, ఉద్యోగులకు రూ. 12 లక్షల 75 వేల రూపాయల వార్షిక ఆదాయం పన్ను రహితం.
అప్‌డేటెడ్ రిటర్న్‌ల గడువుITR-U (అప్‌డేటెడ్ రిటర్న్) సమర్పించే గడువు ఏడాది నుంచి రెండేళ్లకు (12 నెలల నుంచి 48 నెలలకు) పెరిగింది.
UPI నియమాలుగత 12 నెలలుగా వినియోగించని మొబైల్ నంబర్‌కు లింక్ అయిన UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ఐడీలు ఏప్రిల్ 01, 2025 నుంచి పని చేయవు. అలాంటి నంబర్‌తో లింక్ అయిన ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటివి పని చేయవు. కొత్త మొబైల్ నంబర్‌ను బ్యాంక్‌కు వెళ్లి లేదా ATM లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా UPIకి లింక్ చేసుకోవచ్చు.
బ్యాంక్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ SBI, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి అన్ని ప్రభుత్వ బ్యాంకులు కనీస బ్యాలెన్స్ మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ కనీస బ్యాలెన్స్ పట్టణ, సెమీ అర్బన్ & గ్రామీణ ప్రాంతాల ఆధారంగా మారుతుంది. ఒక నెలలో కనీస బ్యాలెన్స్ కంటే తక్కువ ఉంటే జరిమానా పడుతుంది.
గృహ రుణాలుఈ రోజు నుంచి హోమ్ లోన్ రూల్స్ కూడా మారాయి. మెట్రో సిటీల్లో రూ.50 లక్షలు, మధ్య స్థాయి నగరాల్లో రూ.45 లక్షలు, పట్టణాల్లో రూ.35 లక్షల వరకు హోమ్ లోన్‌లు ప్రాధాన్య రంగ రుణాలుగా లభిస్తాయి.
ఆధార్-పాన్ అనుసంధానంపాన్-ఆధార్ లింక్ చేయకపోతే, ఈ రోజు (01 ఏప్రిల్ 2025) నుంచి డివిడెండ్ ఆదాయం లభించదు. TDS రేటు కూడా పెరుగుతుంది & వసూలు చేసిన పన్ను మొత్తం ఫామ్-26ASలో కనిపించదు.
TDS పరిమితి పెంపుసీనియర్ సిటిజన్‌లకు, వివిధ డిపాజిట్లపై సంపాదించే వడ్డీ ఆదాయంపై వర్తించే టీడీఎస్ పరిమితి రూ.లక్షకు పెరిగింది. ఇతరులకు రూ.50,000కు పెరిగింది.
TCS పరిమితి పెంపువిదేశాల్లో చేసే ఖర్చులు, విద్యారుణం తీసుకుని విదేశీ విద్యాసంస్థల ఫీజ్ కోసం పంపే డబ్బుపై టీసీఎస్ పరిమితి రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెరిగింది.
నామినీ వివరాలుడీమ్యాట్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్స్‌లో KYC వివరాలను అప్‌డేట్ చేయాలి. నామినీ వివరాలను మరోమారు ధృవీకరించాలి.
మ్యూచువల్ ఫండ్ రూల్స్‌ఈరోజు నుండి మీరు మ్యూచువల్ ఫండ్ల నియమాలలో కూడా మార్పులను చూస్తారు. సెబీ కొత్త నియమం ప్రకారం, కొత్త ఫండ్ ఆఫర్ ద్వారా సేకరించిన నిధులను 30 పని దినాలలోపు పెట్టుబడి పెట్టాలి.
క్రెడిట్ కార్డ్ రూల్స్SBI, యాక్సిస్ బ్యాంక్, IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిబంధనలలో మార్పులు వచ్చాయి. నయా రూల్స్ ప్రకారం... రివార్డ్ పాయింట్లు, ఫీజులు, ఇతర అంశాల్లో కొన్ని మార్పులు జరిగాయి. గతంలో అందుబాటులో ఉన్న క్యాష్‌బ్యాక్, ఆఫర్‌లను కొంతమేర కట్ చేశారు.
UPS అమలుఏప్రిల్ 1 నుంచి, పాత పెన్షన్ పథకం స్థానంలో ఏకీకృత పెన్షన్ పథకం అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 2024 ఆగస్టులో దీనిని ప్రకటించింది. దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు UPS ద్వారా ప్రభావితమవుతారు.
GST రూల్స్‌వస్తువులు & సేవల పన్ను (GST) నియమాలలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరిగాయి. 180 రోజుల కంటే పాత ఆధార్ పత్రాలపై ఈ-వే బిల్లులు జనరేట్ కావు. GST పోర్టల్‌లో మల్టీ-ఫ్యాక్టర్ ప్రామాణీకరణ ఉంటుంది.
కార్లు మరింత ఖరీదుఈ రోజు నుంచి కార్ ధరలు పెరిగాయి. BMW, మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్ర, కియా, హ్యుందాయ్ సహా చాలా కంపెనీలు ప్యాసెంజర్ వెహికల్ ధరలను దాదాపు 4% వరకు పెరిగాయి.
టోల్ పెంపుదేశంలోని వివిధ టోల్ & జాతీయ రహదారులపై వేర్వేరు ఛార్జీలను NHAI ఆమోదించింది, ఈ రోజు నుంచి ఇది అమలవుతుంది.
డిజిలాకర్‌లో మార్పులుపెట్టుబడిదారులు డిజిలాకర్‌లో డిమ్యాట్ ఖాతా హోల్డింగ్ స్టేట్‌మెంట్, కన్సలిడేటెడ్ అకౌంట్ స్టేట్‌మెంట్‌ను నిల్వ చేసుకోవచ్చు. దీని ఉద్దేశం ఆ పత్రాలను కోల్పోకుండా లేదా మరచిపోకుండా నిరోధించడం & పెట్టుబడుల నిర్వహణను సులభతరం చేయడం.