FPIs: ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPIs) వేట కొనసాగుతోంది. ఆకర్షణీయమైన రిస్క్-రివార్డ్‌తో ఉన్న స్టాక్స్‌ను వెంటబడి కొంటున్నారు. విదేశీ పెట్టుబడిదార్లు, ఈ నెల మే మొదటి పక్షం రోజుల్లో (మొదటి 15 రోజులు) కేవలం ఆరు రంగాల్లోనే రూ. 20,000 కోట్లకు పైగా కుమ్మరించారు.
FPIల షాపింగ్ లిస్ట్
విదేశీ పెట్టుబడిదారుల షాపింగ్ లిస్ట్‌లో బ్యాంకులు & ఇతర ఫైనాన్షియల్ స్టాక్స్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ నెల 1-15 తేదీల మధ్య కాలంలో, రూ. 8,382 కోట్లను విలువైన బ్యాంకులు & ఇతర ఫైనాన్షియల్ స్టాక్స్‌ను విదేశీయులు కొన్నారు. ఆ తర్వాత వాహన రంగం (రూ. 4,705 కోట్లు), ఆయిల్ అండ్ గ్యాస్ (రూ. 2,319 కోట్లు), హెల్త్‌కేర్ (రూ. 1,957 కోట్లు), FMCG (రూ. 1,664 కోట్లు), క్యాపిటల్ గూడ్స్ (రూ. 1,153 కోట్లు), అదర్స్ (రూ. 864 కోట్లు), కన్జ్యూమర్ సర్వీసెస్ (రూ. 934 కోట్లు), కెమికల్స్ (రూ. 688 కోట్లు), కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్ (రూ. 607 కోట్లు), టెలీకమ్యూనికేషన్ (రూ. 594 కోట్లు) సెక్టార్లు ఉన్నాయి.
ఈ 15 రోజుల్లో ఐటీ, పవర్, కన్‌స్ట్రక్షన్, మీడియా స్టాక్స్‌లో FIIలు అమ్మకాలకు దిగారు. ఇవి పోను, మొత్తంగా 24,740 కోట్ల రూపాయల మేర నికర కొనుగోలుదార్లుగా (net buyers) ఉన్నారు.
ఎఫ్‌ఐఐల ఇష్టసఖి భారత్
అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఎఫ్‌ఐఐలకు అత్యంత ఇష్టసఖిగా ఉన్న దేశం భారతదేశం. మే నెలలో ఇప్పటివరకు, ఎఫ్‌ఐఐలు మన దేశంలోకి అత్యధికంగా 2.5 బిలియన్ డాలర్లు, తైవాన్‌లోకి 1.4 బిలియన్ డాలర్లు పంపింగ్ చేశారు. అదే సమయంలో, థాయిలాండ్ నుంచి అత్యధికంగా 427 మిలియన్ డాలర్లు, ఇండోనేషియా నుంచి 199 మిలియన్ డాలర్లను వెనక్కు తీసుకున్నారు.
జూన్ 13-14 తేదీల్లో జరిగే యూఎస్ ఫెడ్ (US FED) తదుపరి సమావేశంలో, త్వరలో మరో 25 bps మేర వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని, ఆ తర్వాత మరో దఫా పెంపు ఉండకపోవచ్చని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. దీంతో, అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా మారతాయని అంటున్నారు.
గతంలో, భారతదేశంలో ఫైనాన్షియల్ సెక్టార్ తర్వాత FIIలు ఎక్కువ పెట్టుబడి పెట్టింది ఐటీ రంగంలో. అయితే, బిగ్ బాయ్స్ ఇప్పుడు ఎక్కువగా వదిలించుకుంటోంది కూడా టెక్ స్టాక్స్‌నే. BSE500 షేర్‌హోల్డింగ్ ప్రకారం... మార్చి త్రైమాసికంలో FIIలు ITల్లోని తమ పొజిషన్లను తగ్గించుకుని నెట్ సెల్లర్స్‌గా మారారు. ఆర్థిక మాంద్యం కారణంగా ఐటీ రంగం ఎదుర్కొంటున్న ప్రపంచ స్థాయి ఎదురుగాలులు దీనికి కారణం.
మార్చి త్రైమాసిక ఫలితాల తర్వాత.. వాహన రంగం, కన్జ్యూమర్ డిస్క్రిషనరీ, ఫైనాన్షియల్స్ స్టాక్‌ల రేటింగ్స్ అప్‌గ్రేడ్ అయ్యాయి; ఐటీ, పారిశ్రామిక, సిమెంట్ రంగాల స్టాక్స్ రేటింగ్స్‌లో కోతలు పడ్డాయి.
ఇది కూడా చదవండి: ఎటూ కదలని పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.